గుంటూరు

పుల్వామా దాడికి గట్టి సమాధానం చెప్పిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఫిబ్రవరి 27: పుల్వామా దాడికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. బుధవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భారత వైమానికి చర్య గర్వంగా ఉందన్నారు. టెర్రరిస్టుల తుదముట్టించిన వాయుసేనను చూసి గర్వపడుతున్నారని స్పీకర్ కోడెల స్పష్టం చేశారు. సంఘటనపై తాను హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఆసేతుహిమాచలం సంతోషం వ్యక్తం చేస్తుందన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా తుదముట్టించాలని కోరారు.
కోటప్పకొండ తిరునాళ్ళను
విజయవంతం చేయాలి
మహాశివరాత్రి సందర్భంగా జరగనున్న కోటప్పకొండ తిరునాళ్ళను అధికారులు, దేవాదాయశాఖ సిబ్బంది విజయవంతం చేయాలని స్పీకర్ కోడెల కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని స్పష్టం చేశారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది తిరునాళ్ళకు భక్తులు అధిక సంఖ్యలో రానున్నారని అన్నారు. తిరునాళ్ళ సందర్భంగా రెండో సమావేశాన్ని బుధవారం కొండపైన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. కోటప్పకొండలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని, రాష్ట్ర పండుగ హోదా నేపథ్యంలోప్రభుత్వం ప్రతి ఏటా 30లక్షల నిధులు విడుదల చేస్తుందని, అధికారులు ప్రభుత్వం నుండి బకాయిలు వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ ఏడాది 72 అడుగుల వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. వయోవృద్ధుల కోసం ఐదు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశామని, కొండపైన సువిశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా రోప్‌వే పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.

నర్సుల సంఘం రాష్ట్ర సెక్రటరిగా యల్లంపల్లి
గుంటూరు (అరండల్‌పేట), ఫిబ్రవరి 27: రాష్ట్ర ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరిగా యల్లంపల్లి పద్మజ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాష్ట్ర నర్సుల సంఘం సర్యసభ్య సమావేశం ఎన్జీవో సమావేశ మందిరంలో జరిగింది. సంఘ సభ్యులు పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో స్ట్ఫా నర్సుగా పనిచేస్తున్న యల్లంపల్లి పద్మజను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరిగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షురాలు శాంతాభవాని తెలిపారు. ఈ సందర్భంగా యల్లంపల్లి పద్మజ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా భోధానాసుపత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులను రెగ్యూలర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిదంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రామాకేర్ సెంటర్లలో పనిచేస్తున్న ఉద్యోగులను 300 ఓసియస్ కిందకు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జ్యోతి, కోటమ్మ, ఇందిర జిల్లా అధ్యక్షురాలు బెల్లంకొండ శైలజ పాల్గొన్నారు.