గుంటూరు

ఆర్షధర్మ ‘పరిరక్షణా యోధుడు’ బొల్లేపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 8: సంప్రదాయ రైతు కుటుంబంలో జన్మించి, నిరంతరం దైవ ధ్యాన నిమగ్నుడై, తన సతీమణి లలితాంబతో కలిసి దశాబ్దాలుగా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తున్న భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ ఆర్షధర్మ పరిరక్షణా యోధుడని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం రాత్రి నగరంలోని బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళా వేదికపై స్వధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో 2018 ధర్మజ్యోతి పురాస్కర ప్రదానోత్సవ సభ వైభవంగా జరిగింది. సభకు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. ఆశీపూర్వక సందేశమిచ్చిన విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, సంఘ సేవకురాలు సత్యవాణి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, వెంకన్న ఆలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, లయన్స్ 324 డి3 జిల్లా నూతన గవర్నర్‌గా ఎన్నికైన కొర్రపాటి రామారావు, ప్రముఖ వైద్యులు కొండబోలు బసవపున్నయ్య తదితర ప్రముఖులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ధార్మిక రుజువర్తనా జీవితాన్ని బహుదా కొనియాడారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ను వ్యవస్థాపించడం ద్వారా అనేక బృహత్తరమైన కార్యక్రమాలను తన భుజస్కంధాలపై వేసుకుని ఒక రాజర్షిలాగా ఆయన ధార్మిక యజ్ఞాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, లలితాంబ దంపతులకు అతిథులుగా విచ్చేసిన ప్రముఖులు ధర్మజ్యోతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. గజమాలలు, పట్టుశాలువాలు, నూతన వస్త్రాలు వేద పండితులు, అర్చక బృంద ఆశీస్సుల నడుమ ఈ పురస్కార ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. సభలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కెజి శంకర్ దంపతులు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ నాయకుడు చాగం వెంకటేశ్వరరెడ్డి, బిఎస్‌ఎన్‌ఎల్ మాజీ జీఎం ఎంఎల్‌ఎన్ రావు, జిల్లా వ్యాప్తంగా గల అనేక మంది అభిమానులు, పలు దేవాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యతోనే సమాజ పురోగాభివృద్ధి
గుంటూరు (పట్నంబజారు), ఫిబ్రవరి 8: విద్యతోనే సమాజ పురోగాభివృద్ధి సాధ్యపడుతుందని గుంటూరు అర్బన్ ఎఎస్‌పి వైటి నాయుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉల్ఫ్ హాల్ గ్రౌండ్‌లో జైన్ పబ్లిక్ స్కూల్ 35వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు స్కూల్ డైరెక్టర్ ఎండి మున్ను అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వైటి నాయుడు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతంలో విద్యాసంస్థను నెలకొల్పి వారికి విద్యాబోధన అందిస్తున్న జైన్ స్కూల్ నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించినప్పుడే వారు జీవితంలో స్థిరపడతారన్నారు. నేటి ఆధునికయుగంలో అన్నిరంగాలు ముందంజలో ఉన్నాయంటే అది విద్యద్వారానే సాధ్యపడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం స్థాపించిన జైన్ స్కూల్‌లో తాను భాగస్వామినేనని, కొన్ని అనివార్య కారణాల వల్ల సంస్థ నుంచి వైదొలిగానన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉర్ధూ స్కూల్స్ ఇన్స్‌పెక్టర్ షేక్ ఖాశిం, స్కూల్ ప్రిన్సిపాల్ కనకదుర్గ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.