తెలంగాణ

ఇద్దరు బాలికలపై అత్యాచార యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: ఇద్దరు బాలికలకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేసి అత్యాచారానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కిరణ్‌కుమార్, నితీష్ కుమార్ అనే యువకులు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేశారు. తర్వాత బాలకలను సమీపంలోని కోళ్లఫారం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అంతలోనే స్పృహలోకి వచ్చిన బాలికలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.