అంతర్జాతీయం

‘జికా’తో వెనిజులాలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారకాస్, ఫిబ్రవరి 12: వెనిజులాలో జికా వైరస్ వల్ల ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు నికొలాస్ మడురో శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. దోమల వల్ల వ్యాపించే జికా వైరస్ కారణంగా మరణాలు సంభవించడం వెనిజులాలో ఇదే మొదటిసారి. దేశంలో మొత్తం 319 మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించడం జరిగిందని మడురో నేషనల్ టెలివిజన్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. జికా వైరస్‌తో సోకిన 68 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 5నుంచి ఈ నెల 8వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 5,221 జికా వైరస్ సోకిన అనుమానిత కేసులు నమోదయినట్లు మడురో వివరించారు. జికా వైరస్‌ను ఎదుర్కోవడంలో వెనిజులాకు సహకరిస్తున్న భారత్, క్యూబా, చైనా, ఇరాన్, బ్రెజిల్ దేశాల ప్రభుత్వాలకు, దౌత్య కార్యాలయాలకు మడురో కృతజ్ఞతలు తెలిపారు.
జికా వైరస్ తీవ్రతపై త్వరలోనే స్పష్టత: డబ్ల్యుహెచ్‌ఒ
జెనీవా: జికా వైరస్ కారణంగా తల్లి గర్భంలో ఉన్న శిశువుల్లో తల పరిమాణం తగినంతగా పెరగకపోవడం, మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం, తీవ్రమైన నరాల సంబంధమైన వ్యాధులు తలెత్తడం వంటివి సంభవిస్తాయా? లేదా? అనేది కొన్ని వారాల్లో తెలుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) పేర్కొంది.