మెయిన్ ఫీచర్

గ్రామీణ మహిళల్ని వణికిస్తున్న రక్తపోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాయకష్టం చేస్తూ వేళకు ఆహారం తీసుకునే గ్రామీణులు ఆరోగ్యవంతంగా ఉంటారని అనుకోవడం సహజం. మంచి ఆహారపు అలవాట్లు, మేలైన ఆరోగ్య పద్ధతులకు దూరమవుతున్నందున నగర వాసుల్లోనే ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తాం. అయితే, ఉరుకులు పరుగుల ఆధునిక యుగంలో పల్లెల్లోనూ జీవనశైలి మారుతున్నందున గ్రామీణులు సైతం రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’లో వెల్లడైంది. ఒత్తిళ్ల కారణంగా పల్లెవాసులు, పోషకాలు లేని ఆహారం వల్ల పట్టణ ప్రాంతాల వారు పలురకాల వ్యాధులకు లోనవుతున్నారని ఆ సర్వే తేల్చిచెబుతోంది. ఊబకాయం సమస్యపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ రక్తపోటు మాత్రం మహమ్మారిలా విజృంభిస్తోంది. పట్టణాల్లో కంటే గ్రామాల్లో ముఖ్యంగా మహిళల్లో ఇది నానాటికీ అధికమవుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’లో 15 రాష్ట్రాలకు సంబంధించి పల్లెలు, పట్టణ వాసుల ఆరోగ్య పరిస్థితులు విశే్లషించారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు పదివేల కుటుంబాలను సర్వే చేయగా పట్టణ ప్రాంత మహిళల్లో 45.6 శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నట్లు తేలింది. దేశం మొత్తమీద చూస్తే ఊబకాయం కలిగిన మహిళలు ఆంధ్రప్రదేశ్‌లోనే అధిక సంఖ్యలో ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు. ఈ రాష్ట్రంలో పల్లెప్రాంతాలకు సంబంధించి 27.6 శాతం మంది మహిళలు అధిక బరువుతో సతమతమవుతున్నారు. దేశంలోని మిగతా గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెప్రాంత మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువగానే ఉంది. మన దేశంలో మహిళల్లో ఊబకాయం 2005-06లో 13.92 శాతం ఉండగా, 2015-16 నాటికి 19.56 శాతానికి పెరగడం వైద్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. గత దశాబ్దకాలంలో దేశ వ్యాప్తంగా పురుషుల్లో ఊబకాయం 10.35 నుంచి 18.04 శాతానికి వృద్ధి చెందింది. మిగతా రాష్ట్రాలతో పోల్చిచూస్తే బిహార్ గ్రామీణ ప్రాంత మహిళల్లో ఊబకాయం తక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, రక్తపోటు విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బిహార్ పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంత మహిళల్లో రక్తపోటు ఎక్కువగా ఉంది. రక్తపోటుకు సంబంధించి ఇదే పరిస్థితి మిగతా రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. అండమాన్, నికోబార్ దీవుల్లో సైతం పల్లె ప్రాంతాల్లో ఆడ,మగ అనే తేడాలేకుండా అధిక సంఖ్యలో రక్తపోటును ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి మేఘాలయలోనూ నెలకొంది. మానసిక ఒత్తిళ్ల వల్లే రక్తపోటు తీవ్రరూపం దాలుస్తోంది. ఇక, బ్లడ్ సుగర్ విషయంలో పల్లెలు, పట్టణాల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. ఎప్పటిలాగే పట్టణ వాసుల్లో బ్లడ్ సుగర్ సమస్య ప్రతాపం చూపుతోంది. అయిత, గోవాకు సంబంధించి పరిస్థితి మరోలా ఉంది. ఈ రాష్ట్రంలో పట్టణాల్లో కంటే పల్లెల్లోని మహిళలు ఎక్కువగా బ్లడ్ సుగర్‌ను ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. పుదుచ్చేరి, త్రిపుర, హర్యానా వంటి చిన్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాలతో పోల్చితే పల్లెల్లోని పురుషులు ఎక్కువగా బ్లడ్ సుగర్ బారిన పడుతున్నారు.
వైద్య నిపుణుల అభిప్రాయాలను విశే్లషించి చూస్తే దేశ వ్యాప్తంగా పట్టణాల్లో ఊబకాయం, గ్రామీణ ప్రాంతాల్లో రక్తపోటు సమస్య నానాటికీ విషమిస్తోంది. పట్టణ వాసుల్లో పోషకాహారంపై అవగాహన లేకపోవడం, పల్లెల్లోని మహిళలపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ రెండు సమస్యలూ ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, వైద్య సౌకర్యాలు లేకపోవడం, గిట్టుబాటు కాని వ్యవసాయంపైనే ఆధారపడడం.. వంటి పరిస్థితులు పల్లెవాసుల్లో మానసిక ఒత్తిళ్లకు ప్రధాన కారణాలవుతున్నాయి. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల ధరలు అందుబాటులో లేకపోవడంతో అన్ని ప్రాంతాల వారూ నాణ్యమైన పోషకాహారానికి నోచుకోవడం లేదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినపుడే ప్రజలు ఒత్తిళ్లకు దూరమై నాణ్యమైన ఆహారం తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. *