తెలంగాణ

ఫారెస్ట్ కాలేజీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ములుగులో నిర్మించిన ఫారెస్టు కాలేజీ, పరిశోధనా కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కళాశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులతో సీఎం కాసేపు ముచ్చటించారు. గజ్వేల్ నియోజకవర్గంలో మోడల్ మార్కెట్, సమీకృత అధికార కార్యాలయం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, ప్రభుత్వాసుపత్రిని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.