రాష్ట్రీయం

ఉత్తరాదిలో పొగమంచుతో పలు రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగ మంచు కారణంగా జనవరి 10వ, తేదీ నుంచి ఫిబ్రవరి 29వరకు పలు రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల శాఖ అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నంబర్ 12791 సికిందరాబాద్-దోణాపూర్ ఎక్స్‌ప్రెస్ జనవరి 10, 14, 21, 24, 28, 31 తేదీలలో రద్దయింది. అదేవిధంగా ఫిబ్రవరి 4, 7, 11, 14, 18, 21, 25, 28తేదీల్లో రద్దు చేసినట్టు పేర్కొన్నారు. జనవరి 13, 20, 27 తేదీలలో నడపవలసిన ట్రైన్ నెం. 12723 హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ట్రైన్ నెం. 12721 హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25 తేదీలలో, ఫిబ్రవరి 1, 8, 15, 22, 29లలో రద్దు చేశారు. అదేవిధంగా ట్రైన్ నెం. 12485 నాందేడ్-శ్రీగంగానగర్ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 11, 25, ఫిబ్రవరి 1, 8, 15, 22, 29 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నెం. 12715 హెచ్‌ఎస్ నాందేడ్-అమృత్‌సర్ సచ్‌ఖాంద్ ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 14, 18, 21, 25, 28 ఫిబ్రవరి 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29 తేదీలలో రద్దు చేసినట్టు ఉమాశంకర్‌కుమార్ పేర్కొన్నారు. ప్రయాణీకుల అధిక రద్దీని నియంత్రించేందుకు గాను ఆరు ప్రత్యేక రైళ్లను వివిధ గమ్య స్థానాలకు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 20న తిరుపతి-కాకినాడ మధ్య, ఈ నెల 24న సికింద్రాబాద్-శ్రీకాకుళంరోడ్ సూపర్‌ఫాస్ట్ రైలు, 25న శ్రీకాకుళం రోడ్-తిరుపతి సూపర్‌ఫాస్ట్ రైలు, 26న తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ రైలు, 27న సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ మధ్య , 28న యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ మధ్య సువిధ సూపర్‌ఫాస్ట్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది.
సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ రవాణా ఖర్చు
ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే అభివృద్ధి చెందడం ద్వారా తక్కువ ఖర్చుతో రవాణా సదుపాయం కల్పించేందుకు వీలుంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అన్నారు. గురువారం నాడిక్కడ జోనల్ రైల్వేట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనీలకు వృత్తి నైపుణ్యంలో మెరుగైన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మెరుగైన శిక్షణ అందించాల్సి ఉంటుందని అన్నారు. వృత్తి నైపుణ్యాన్ని అందించేందుకు జడ్‌ఆర్‌టిఐ చేస్తున్న కృషిని అభినందించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడం ద్వారా ప్రగతి సాధించవచ్చని సూచించారు.