ఫ్లాష్ బ్యాక్ @ 50

వీరాంజనేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెరుకూరి ప్రకాశరావు 22-04-1926న కృష్ణా జిల్లా ‘పెరిశేపల్లి’లో జన్మించారు. కొంతకాలం ఎగ్జిబిటర్‌గా పనిచేసి, మరికొంతకాలం నిర్మాత, దర్శకులు కె.ఎస్.ప్రకాశరావుగారి ‘్ఫలిం ఆర్ట్ పిక్చర్స్ పంపిణీ’ ఆఫీస్‌లో, తరువాత రేవతి పబ్లిసిటీస్ కొంతకాలం నడిపారు. 1957లో ‘వనంగాముడి’అనే తమిళ చిత్రాన్ని తెలుగులో, ‘తలవంచని వీరుని’గా డబ్బింగ్ చేశారు. కాట్రగడ్డ శ్రీనివాసరావు (నవయుగ అధినేత) సహకారంతో నిర్మాతగా ‘వీర సామ్రాజ్యం’అనే డబ్బింగ్ చిత్రం నిర్మించారు. మహిజా ఫిలిమ్స్ బేనర్‌పై 1966లో వీరాంజనేయ మొదలుపెట్టి 1968 ఏప్రిల్‌లో విడుదలచేశారు. 1975 ‘యశోదాకృష్ణ’ తరువాత కొన్ని కన్నడ చిత్రాలు నిర్మించారు.
కమలాకర కామేశ్వరరావు అక్టోబర్ 14, 1911లో బందరులో జన్మించారు. కృష్ణాపత్రికలో జర్నలిస్ట్‌గా వ్యవహరించి, హెచ్.ఎం.రెడ్డి పిలుపుతో మద్రాస్ చేరి, కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, మూలా నారాయణస్వామిల సాన్నిహిత్యంతో పురోగమించి ‘చంద్రహారం’తో దర్శకునిగా ప్రస్తావం మొదలుపెట్టి, పౌరాణిక చిత్రబ్రహ్మగా పేరుపొంది పలు తెలుగు, తమిళ, హిందీ (శ్రీరామవనవాస) చిత్రాలకు దర్శకత్వం వహించి, పలు అవార్డులు పొందారు. వీరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరాంజనేయ’. 5-04-1968 విడుదల.
వీరాంజనేయ చిత్రానికి రచన- మల్లాది రామకృష్ణశాస్ర్తీ, నృత్యం- పసుమర్తి కృష్ణమూర్తి, కళ- ఎస్.కృష్ణారావు, కూర్పు- బి.గోపాలరావు, స్టంట్స్- ఆర్.రాఘవులు అండ్ పార్టీ, సంగీతం- ఎస్.రాజేశ్వరరావు, ఫొటోగ్రఫీ- ఎస్.వెంకటరత్నం, దర్శకత్వం- కమలాకర కామేశ్వరరావు, నిర్మాత-సిహెచ్.ప్రకాశరావు.
శ్రీరామపట్ట్భాషేకం, బొమ్మలకు హారతినివ్వడం, చుట్టూ ఫ్రేములో రామాయణ ఘట్టాలు, సీతారాములను చూపుతూ, టైటిల్ ప్రారంభం కావటం, పార్వతిదేవి, ఈశ్వరుని (వల్లభనేని శివరాం)వద్దకు వెళ్ళి, వాయుదేవునికై తప మాచరించుచున్న అంజనాదేవికి ఈశ్వరాంశగల పుత్రుని ప్రసాదించమని కోరగా, వాయుదేవుని తేజం, ఈశ్వరాంశతో ఆంజనేయుడు జన్మిస్తాడు. సూర్యదేవుని పండుగా భ్రమించి నింగికెగిరి, ఇంద్రునిచే భంగపడి, తిరిగి ఆ ఆదిత్యుని వద్దనే సకల విద్యలు నేరుస్తాడు. ఆంజనేయుడు (అర్జా జనార్ధనరావు). గురువు ఆదేశంతో సుగ్రీవునితో చెలిమి. సీతాపహరణంతో రామాయణ అంశాలు మొదలై రామావతారం పరిపూర్తి. ఆంజనేయుని తపస్సు, ద్వాపరయుగంలో గరుత్మంతుని గర్వభంగం, శ్రీకృష్ణ, రుక్మిణిల సాక్షిగా నారద, తుంబుర వివాదం, ఆంజనేయుడు పరిష్కరించటం, అర్జునుడు(రామకృష్ణ) గర్వభంగం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జున రథంపై కేతనంలో హనుమ నిలవటం వరకూ చిత్రకథ సాగుతుంది. ఆపైన వీరాంజనేయుని ఆలయాలు జయజయ వీరాంజనేయ (ఘంటసాల బృందం) గీతంలో భక్తులు, వస్తాదులు స్వామిని పూజించటం, సాముగరిడీలు, కుస్తీ పోటీలను ఆంజనేయుని విగ్రహం సాక్షిగా జరపడం చూపుతూ చిత్రం ముగుస్తుంది.
దర్శకులు శ్రీకామేశ్వరరావు సన్నివేశాలను తొలుత ఆంజనేయుడు రెండు కొండల నడుమ మధ్య నదీప్రవాహపైన అటుఇటు రెండు కాళ్ళు వుంచి నిలవటం. లంకకు నాగకన్య సులోచన (కాంచన)ను మేఘనాథుడు (జగ్గయ్య) పరిణయమాడి లేవటం, మండోదరి (జి.వరలక్ష్మి) హారతి నిస్తుండగా సీతను లంకకు తేవటంవల్ల హారతి ఆరిపోటం, రావణాసురుడు, శూర్పణఖ విగ్రహంముందు, మనోనిశ్చయం వెల్లడించటం. మేఘనాథుడు, సులోచనల ప్రణయగీతం ‘ఇంతకన్నా మధురమైన’ (పి.బి.శ్రీనివాస్, పి.సుశీల- సి.నా.రె రచన) ఆ పాటను మేఘనాథుడు యుద్ధంలో మరణించాక అతని శిరసు వచ్చి సులోచన వద్ద శెలవుకోరటం, వారిరువురు పాములుగా మారి వాటిపైన మరో చరణం ‘వీడిపోదు మనబంధం విలయవేళలనైనా’ రిపీట్ కావటం. సీతాదేవి (అంజలిదేవి) అశోకవనం నుంచి, శ్రీరాముడు (కాంతారావు) ఋష్యమూకంవద్ద వుండగా ఆలపించే విరహవేదన గీతం తెలుపుమా చందమామా స్వామితో ఈ దీన ఆవేదన (పి.సుశీల- సముద్రాల సీనియర్) సీత జాడకోసం వెతుకుతూ ఆంజనేయుడు గంధర్వకన్య స్వయంప్రభు (నాగరత్నం) బారిపడడం, ఆమెతో ఆమె చెలులతో గీతం ‘వచ్చావా జతకాడా (ఎల్.ఆర్.ఈశ్వరి బృందం-కొసరాజు) దానికి తగ్గ నృత్యం, వారిని తప్పించుకుని తమాషాగా మరల చిన్న కోతిగా ఆంజనేయుని రియాక్షన్, అక్కడే సంపాతి వచ్చి ఆంజనేయుని భక్షించబోయి నిజం తెలిసి, సీత జాడ తెలియచేయటం. సముద్రాన్ని లంఘించే హనుమను జాంబవంతాదులు స్తుతించగా, అతడు బలోపేతుడై వారధి లంఘించటం, దారిలో నోటిలో ప్రవేశించి బయటకురావటం. లంకిణిలో తోకతో పోరు, చిన్న కోతిగా కంటి బొమ్మనుంచి లంకలో ప్రవేశించటం. అశోకవనంలోని, రాల్చిన పండ్లు బాలలందరికి అందటం. సులోచన అన్నగారైన అహిమహి రావణుడు (ముక్కామల) అతని సోదరుడు, జ్వాలముఖీదేవి వద్ద రామలక్ష్మణులను వధించబోవటం ఓ భక్తి నృత్యగీతం (మమ్మేలుమా తల్లి మాంకాళి- ఎల్.ఆర్.ఈశ్వరి బృందం) తండ్రి వాయుదేవుని (ప్రభాకరరెడ్డి)తో హనుమయుద్ధం, గాలిలో ఎగురుతున్న అహిమహి రావణుతో ప్రాణులు(5 చిన్న పురుగులను) పట్టి సంహరించటం- సీతాదేవి రామపట్ట్భాషేకం అయ్యాక హనుమకిచ్చిన హారం ‘రామా, రామా’ అని పలకటం ద్వాపర యుగంలో గరుత్మంతుని(సత్యనారాయణ) తన రోమంతో ఆంజనేయుడు బంధించటం, పరమేశ్వరి ప్రసాదించిన కనక వీణకై నరద (శోభన్‌బాబు) తుంబురుడు (వల్లం నరసింహారావు)ల వివాదం వీణ హనుమ ప్రారంభంలో చంద్రశిలా వేదికలో చిక్కుకోవటం, నారద, తుంబురుల నవ రాగే సాగేనులే (మంగళంపల్లి, పి.బి.శ్రీనివాస్- రచన సి.నా.రె) గానానికి శిల కరగకపోగా హనుమంతునిగానం ‘నయనాభిరామా నా తండ్రి రామా’ (ఘంటసాల, రచన సి.నా.రె) వీణ బయటకు రావటం, అర్జునుని ప్రతిజ్ఞ నిల్పటంకోసం, అతడు నిర్మించిన వారధిపై హనుమభారాన్ని కూర్మావతారంగా శ్రీకృష్ణుడు భరించటం. ఇలా ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆకట్టుకునేలా భక్తిని రక్తిని, కలగలపి అనురక్తితో తీర్చిదిద్దటం భావగంభీరతతో సరళతో, భక్త్భివనతో నిండిన, మల్లాది రామకృష్ణ వారిని రచన పరిపూర్ణత కలిగించటం. దీనికి మధన్‌మోహన్‌ల స్పెషల్ అఫెక్ట్స్ వెంకటరత్నం ట్రిక్ ఫొటోగ్రఫి అదనపు సొబగులు అద్దటం. లబ్దప్రతిష్టులైన గీత రచయితల లలిత, మనోజ్ఞ, భక్త్భివ పద సంపదకు స్వరాలూరు రాజేశ్వరరావు, మధుర స్వర సంధానం ఒక చక్కని జోడింపుతోగా వీనులకింపుగా, ఆనందోల్లాసాలను చేకూర్చటం ‘వీరాంజనేయ’ చిత్రానికి

ఈ చిత్రంలో రావణాసురునిగా గంభీర నట చక్రవర్తిగా పేరొందిన ఎస్.వి.రంగారావు తన ధీర, గంభీర సహజ నటనతో అటు సీతాదేవితో లాలస, బెదిరింపు మండోదరితో ప్రేమ, భర్తగా అధికారం, అక్షయ కుమారుడు, మేఘనాధుని మృతికి విచారం. తన స్వశక్తిపై నమ్మకం 10 తలలతో ఆత్మావలోకనం, స్థిరనిశ్చయం. సన్నివేశానుగుణంగా పాత్రోచితంగా పరిపూర్ణమైన భావప్రకటన చేశారు.
నటప్రపూర్ణ కాంతారావు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా స్వాతికతను, కొద్దిపాటి చతురత (శ్రీకృష్ణునిగా) రెంటిని ఒకే చిత్రంలో వైవిధ్యభరితంగా ఆకట్టుకునేలా సహజసిద్ధంగా ప్రదర్శించారు. వీరికితోడుగా అంజలిదేవి సీతాదేవిగా, రుక్మిణిదేవిగా ఆయా పాత్రల ఔన్నత్యాన్ని నిలిపేలా చక్కగా ఒప్పించారు. ఇక లక్ష్మణునిగా రాఘవయ్య విభీషణునిగా మిక్కిలినేని, సత్యభామగా జయంతి, అర్జునునిగా రామకృష్ణ, గంధర్వకన్య స్వయప్రభగా నాగరత్నం, ఇంకా యయాతిగా జూ.సుబ్బరావు, సూర్యకళ తదితరులు నటించారు.
‘వీరాంజనేయ’చిత్రంలో రావణుని ముందు నర్తకీమణులు పాడే గీతం ‘మనసైన దాననురా’ (పి.లీల, పి.సుశీల రచన -ఆరుద్ర) ఈ చిత్రంలోని ఇతర మధుర భక్తిగీతాలు టైటిల్స్‌ముందు గీతం ‘శ్రీరామ రామరామ జనకజా’ (ఘంటసాల బృందం- మల్లాది) రామనామమే మధురం (ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, రమణ, సరోజిని (రచన సినారె) రామ నీ నామముభయతారకమయ్యా (ఘంటసాల- సినారె) ‘అహో రామకథ హనుమజనమమ్ (ఘంటసాల, మల్లాది రచన) శ్రీకృష్ణ, కృష్ణ కృష్ణ (ఘంటసాల, మంగళంపల్లి, పి.బి.శ్రీనివాస్-సముద్రాల సీనియర్).
ఈ చిత్రంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పద్యం, దండకం, ‘హనుమా పావన రుద్రతేజమున’(ఆరుద్ర), ‘శ్రీమన్మహామేరు గాంభీర్యమే’ (మల్లాది).
‘వీరాంజనేయ’ చిత్రం గీతాలు సంగీతపరంగా, సాహిత్యపరంగా జన రంజకంగా రూపొందించటం, నేటికీ అవి చిరస్మరణీయ గీతాలుగా భక్తి పాటలునిలవటం, గాయకులు, రచయితలు, నిర్మాత, దర్శకుల కృషికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ‘వీరాంజనేయ’ చిత్రం, విజయవంతంగా ప్రదర్శింపబడి ప్రేక్షకాదరణ పొందటం నేటికీ పర్వదినాలలో ఆ చిత్ర ప్రదర్శన జరుపుకోవటం అభినందింపతగ్గ విషయం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి