బిజినెస్

ప్రభుత్వ రంగ బ్యాంకులకు మున్ముందు సవాళ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబర్ 28: భారతీయ బ్యాంకుల పరిస్థితి నిలకడగా ఉందని, అయితే దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులకు మున్ముందు సవాళ్లు పొంచి ఉన్నాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది.
ప్రభుత్వరంగ బ్యాంకుల కోర్ క్యాపిటలైజేషన్ బలహీనంగా ఉందని, రుణాల వసూలు నెమ్మదిగా సాగుతోందని వివరించింది. భారతీయ బ్యాంకులకు మూలధనాన్ని పెంచుకోవడం అనేది ముఖ్యమైన అంశంగా ఉంటుందని పేర్కొంటూ పుంజుకునే స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) ఆధారంగా బ్యాంకులు తమ క్రెడిట్ గ్రోత్‌ను పునరుద్ధరించుకోవాలని చూస్తున్నాయని చెప్పింది. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన రుణాల విలువ చాలా హెచ్చు స్థాయిలో ఉందని, అందువల్ల వాటి వసూలు ద్వారా వచ్చే ఆదాయం నెమ్మదిగా ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొంది.
కాగా, బాసెల్-3 ప్రమాణాలను చేరుకోవాలంటే ప్రభుత్వరంగ బ్యాంకులకు 2018 నాటికి 2.40 లక్షల కోట్ల రూపాయల కోర్ క్యాపిటల్ అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం మార్చి నాటికి 5.20 శాతం ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తుల మొత్తం విలువ జూన్ నాటికి 6.03 శాతానికి పెరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకులు నిలకడైన వృద్ధిరేటును సాధించాలంటే తమ మూల ధనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది.