మెయిన్ ఫీచర్

ఫిష్ బౌల్‌లో పచ్చటి ప్రకృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిత కుండీలోని మట్టిని సరిచేసి తులసి మొక్కకు నీరు పోస్తుంది. తల్లి చేస్తున్న పని చూసిన ఎనిమిదేళ్ల అనుష్కా రివ్వున ఇంట్లోకి పరుగెత్తుకు వెళ్లి టీ తాగే పేపర్ గ్లాసులను తీసుకువచ్చి వాటిల్లో మట్టి వేసి పోపుల డబ్బాలో ఉన్న ఆవాల గింజలు వేసి నీళ్లు పోసింది. కూతురు చేస్తున్న పని చూసి మురిసిపోయిన ఆ తల్లి తనకెందుకు ఇలాంటి ఐడియా తట్టలేదు. ఇంట్లో పనికిరాని గాజు సీసాలు, జాడీలు, బౌల్స్ ఉన్నాయి. వాటిని పగిలిపోకుండా అటకమీద పెట్టి భద్రంగా కాపాడుతోంది. వాటిల్లో మట్టిపోసి చిన్న చిన్న మొక్కలు పెంచితే ఇల్లంతా పచ్చదనం తివాచీ పరిచినట్లుగా ఉంటుంది కదా! పచ్చటి ప్రకృతిని చూస్తే పరవశించని మనసు ఉంటుందా! పచ్చటి మొక్క చిన్నదైనా ఇంట్లో కనిపిస్తే చాలు అది ఎంత కనువిందు చేస్తుంది కదా! ఆలోచన రావటమే తరువాయి కిటికీ పక్కన ఎన్నాళ్ల నుంచో వృధాగా ఉంటున్న ఫిష్‌బౌల్‌ను చేతుల్లోకి తీసుకుంది. వెంటనే దాంట్లో మట్టి పోసి చిన్న మొక్కలు పెంచేందుకు ఉపక్రమించింది. ఓ చిన్నారి ఇచ్చిన ఐడియా ఇపుడు ఆ ఇంటినే పచ్చ పచ్చగా చేసింది. వాస్తవానికి చాలామంది ఫిష్ అక్వేరియం ఇంటికి అందంగా ఉంటుందని ఏర్పాటుచేసుకుంటారు. కాని దీనికన్నా టెర్రారియమ్ ఇనుమడించిన పచ్చటి అందాన్ని మీ ఇంటికి సొంతం చేస్తుంది. టెర్రారియమ్ పెంచటానికి పనికిరాని గాజు సీసాలు, మాడిపోయిన బల్బులు, జాడీలు, ఫిష్ బౌల్స్‌లాంటివి ఉపయోగపడతాయి. వీటిల్లో అందమైన గార్డెన్‌ను పెంచాలంటే కొన్ని రకాల మొక్కలు మాత్రమే పెరుగుతాయి. వాటిని మాత్రమే పెంచుకోవాలి.
ఎలాంటి మొక్కలు పెరుగుతాయి
మనీప్లాంట్, యారోహెడ్, ఫెర్న్స్, ఆఫ్రికన్ ఒయోలెట్స్, బెగానియస్, స్ట్రాబెర్రీ బెగానియా, డ్రాఫ్ట్ గోల్డెన్,. స్వీట్ ప్లాగ్, బేబీస్ టియర్స్ తదితర మొక్కలు పెంచుకోవచ్చు. అపార్ట్‌మెంట్స్‌లో నివశించేవారికి మొక్కలను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నా వారికి తగినంత స్థలం లేక కుండీలలో పెంచుకుంటారు. అదే సందర్భంలో ఇలాంటి బౌల్స్‌లో కూడా పెంచుకుంటే ఇంటికి ఎంతో అందం చేకూరుతోంది
కావల్సిన వస్తువులు
మట్టి, గులకరాళ్లు (చిన్నవి, పెద్దవి), కర్రబొగ్గు, నాచు, అందంగా అలంకరించటానికి చిన్నపాటి జంతువులు, కీటకాలకు సంబంధించిన ప్లాస్టిక్ బొమ్మలు ఉంటే చాలు.
ఎలా తయారుచేయాలి
గాలి చొరబడిని జార్ లేదా ఫిష్ బౌల్‌ను శుభ్రం చేయండి. అందులో కంకర పేర్చండి. దానిపై ప్లాస్టిక్ కవర్‌లాంటిదాన్ని పర్చండి. ప్లాస్టిక్ కవర్‌లాంటిదాన్ని పర్చటం వల్ల తడి మట్టి, కంకర పైకి రాకుండా బౌల్‌ను ఎల్లప్పుడూ డ్రైగా ఉంచుతుంది. తరువాత వేర్లు మునిగేలా మట్టితో ఉన్న మొక్కలను అందులో అందంగా అమర్చండి. మట్టిమీద నీటిని చుక్కలు చుక్కలుగా చల్లండి. అందమైన ఆకారంలో నాచును కట్‌చేసి బౌల్‌లో ఏర్పాటుచేయండి. అలాగే గులకరాళ్లతో పాటు మీకిష్టమైన ప్లాస్టిక్ బొమ్మలు అంటే డైనోసార్స్ లేదా గడ్డి మేసే ఆవు లేదా సీతాకోకచిలుకలు లాంటివి ఏర్పాటుచేయటం వల్ల పచ్చటి అందమైన అడవి చిన్న బౌల్‌లో రెడీ అవుతోంది. పచ్చటి నర్సరీని పెంచాలని ఉబలాటపడేవారికి, ఇంటిన పచ్చటి మొక్కలతో అందంగా తీర్చిదిద్దాలనే కళాప్రియులకు బౌల్స్‌లో మొక్కల పెంచుకోవటం వల్ల మానసిక సంతృప్తిని కలిగిస్తోంది.
మీ ఇంట్లో 2.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పుగల అక్వేరియం వృధాగా పడివుంటే అందులో దాదాపు 30 రకాల మొక్కలు పెంచుకోవచ్చు. రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. వారానికో లేదా నెలకొకసారి ఇంట్లో ఉండే చిన్నారులకు నీళ్లు చిలకరించే పని అప్పగిస్తే వారు ఆనందంగా చేస్తారు. వీటిమవ ప్రత్యేకంగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఆ మొక్కల నుంచి రాలిపడిన ఆకులే వాటికి ఉపకరిస్తాయి. బౌల్స్‌లో మొక్కల పెంపకం చేపట్టటం వల్ల ఇంట్లో తేమ వాతావరణం, నిరంతరం వర్షాలు కురిసే వర్షారణ్యాలు మీ ఇంట్లో ఉందనేలా భ్రమ కలుగుతోంది. పర్యావరణాన్ని కాపాడినవారవుతారు. మరింకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే ఇంట్లో పనికిరాని జాడీలు, సీసాలు, బల్బులు, బౌల్స్‌లో చిన్నపాటి గార్డెన్‌ను పెంచటానికి ఉపక్రమించండి.