ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. 1978లోనే భలెభలె మగాడివోయ్ అనిపించుకున్న హీరో ఎవరు?
3. తండ్రి దేవదాసు. కొడుకు...? హలోబ్రదర్‌దీ అదే పేరు?
4. స్క్రీన్‌మీద పేరు తప్పుపడటంతో జీవితాంతం అదే పేరు భరించిన సంగీత చక్రవర్తి అసలు పేరు?
5. తెలుగు సూపర్ కమెడియన్‌గా ఏ సినిమాతో అలీ ఫిలింఫేర్ అందుకున్నాడు? ప్రశ్నలోనే ఆన్సర్..
6. భారతీరాజా ‘సీతాకోక చిలుక’ చిత్రంలో ముచ్చెర్ల అరుణ పాత్ర పేరు? అక్షరం మారిందంతే..
7. నాన్నకు ప్రేమతో.. అని పాడుకున్న జూ.ఎన్టీఆర్ పాత్ర పేరు?
8. 1967లో సునీల్‌దత్ సినిమా ‘మిలాన్’తో బెస్ట్ సపోర్టింగ్ యాక్రెస్ ఫిలింఫేర్ అందుకున్న తెలుగు నటి?
9. ఎన్టీఆర్ ‘రక్తసంబంధం’ చిత్రంలో చందురుని మించు పాట రచయత?
10. మేకప్‌లేని ఈ హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 96
*
1 బాడీగార్డ్
2. పి.సాంబశివరావు
3. అంబిక
4. కె.ఎస్ ప్రకాశరావు
5. ఆత్రేయ
6. జానకిరాముడు (1988)
7. ఆత్రేయ
8. కె.వి. మహదేవన్
9. సావిత్రి
10. అంజలి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
బండి సునీత, రాజమండ్రి
ఏవీ నళినీకాంత్, కొత్తూరు
డిఎస్ పార్వతి, విజయవాడ
కెవి ప్రశాంతి, ఆదుర్తి
బీవీకె నీరజకుమార్, పెనుకొండ
అల్లాడి రఘురామ్, భీమిలి
సుధాకర్ వి, శ్రీశైలం
అల్లంకి రమణారావు, కాకినాడ
కెవీఎస్ శ్రీధర్, గుంతకల్లు
ఆర్వీ రాజా, సికింద్రాబాద్
ఎం గంగారత్నం, వరంగల్
భుజంగరావ్ కె, సికింద్రాబాద్
వి కన్నబాబు, హైదరాబాద్
జెవిఎల్ కుమారి, అనకాపల్లి
ఎల్ ప్రశాంత్, కాకినాడ
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్