ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-160

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) మంగమ్మగారి మనవడులో భానుమతి కూతురిగా చేసిన నటి?
3) ఉత్తమ రచయతగా తొలి నంది అందుకున్న గొల్లపూడి సినిమా కథ?
4) జననీ జన్మభూమి/ వేములవాడ భీమకవి- కథానాయకుడెవరు?
5) కోడి రామకృష్ణ మూడో చిత్రంలోని హీరోయన్ ఎవరు?
6) విజేత చిత్రంలో హీరో చిరంజీవి పాత్ర పేరేంటి?
7) మామా మామా.... పట్టుకుంటే/ పాపాయి నవ్వాలి పండగే రావాలి- పాటల సంగీత దర్శకుడు?
8) సితారగా భానుప్రియను అద్భుతంగా చూపించిన కెమెరామెన్ ఎవరు?
9) శరత్‌బాబు రెండో చిత్రం.. మొదటి తమిళ చిత్రం?
10) పక్కచిత్రంలో హీరోయన్ ఎవరు?
*
సమాధానాలు- 158
*
1) నక్షత్రం 2) రాక్షసుడు 3) ఊపిరి
4) నికీషాపటేల్ 5) తెలుగు వీరలేవరా 6) ఎల్ విజయలక్ష్మి 7) మొరటోడు
8) నీ కౌగిలిలో తలదాచి
9) కన్యాశుల్కం 10) మన్నారా చోప్రా
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఆర్ నాగేశ్వర రావు, శ్రీకాకుళం
ఎం కృష్ణ, కాకినాడ
ఆర్‌కె శివస్వామి, మధిర
ఏపీవీ జగదీష్, హైదరాబాద్
సిహెచ్‌ఎన్ రావ్, బాగ్ అంబర్‌పేట
పి వల్లభ, జి రాజవరం
ఎల్ రామారావు, భీమునిపట్నం
హెచ్ లలిత, తెనాలి
ఎన్ శ్రీనివాస రావు, తుని
వి రాఘవరావు, ఐ పోలవరం
ఎన్వీ కరుణ, సికింద్రాబాద్
ఎన్ తాడిబాబు, గన్నవరం
మాబు సుభాని, ఆదోని
ఎస్ సువర్చల, పెదకాకాని
హరినారాయణ, గురజాల
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్