ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-143

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2. వరుణ్‌తేజ్ వాల్మీకిలో కనిపించబోతున్న డబ్‌స్మాష్ స్పెషలిస్ట్ బ్యూటీ?
3. గులేబకావళి కథకు సినిమాటోగ్రాఫర్ ?
4. కృష్ణ గూఢచారి 116 చిత్రానికి దర్శకుడు?
5. ఆర్ నాగేశ్వర రావు, ఆర్ కాళేశ్వర రావు.. ఈ పాత నటుల ఇంటిపేరు?
6. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో బ్రహ్మానందం పాత్ర పేరు?
7. దుల్కర్ సల్మాన్ ఓకే బంగారం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎవరు?
8. జబర్దస్త్ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు?
9. సినిమా ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వర రావు ఎన్నిసార్లు నంది అందుకున్నారు?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?

సమాధానాలు- 141

1. అభినేత్రి
2. అర్జున్
3. విఎన్ ఆదిత్య
4. మందరమాల
5. ఏవీ సుబ్బారావు
6. బంగారు గాజులు
7. శ్రీమణి
8. తాళ్లూరి రామేశ్వరి
9. వంశీ
10. నేహా దేశ్‌పాండే

సరైన సమాధానాలు రాసిన వారు

ఎస్ అహ్మద్, హైదరాబాద్
జీసీఎంకె, రాజోలు
కర్రి సత్యం, సత్తెన్నపల్లి
బిఎస్ దినేష్‌రెడ్డి, నెల్లూరు
కె మురళీకృష్ణ, చీరాల
ఎన్ లక్ష్మీరామం, ఐపోలవరం
ఎస్ పార్వతి, బిట్రగుంట
ఎండి ప్రసాద్ రెడ్డి, వరంగల్
పి రామకృష్ణ, ఆదోని
సిహెచ్‌ఎన్ రావు, విశాఖ
పివిఎస్ రాజు, పాలకొల్లు
కెకె చక్రవర్తి, తుని
బి కమల, పిఠాపురం
ఎస్ వేణుకుమార్, రాజమండ్రి
పిఎన్ సుందరం, చెన్నై

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్