ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-135

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. అనుపమను చూసి రామ్ ఏ సినిమాలో ఇలా సిగ్గుపడ్డాడు?
2. గుణశేఖర్ సినిమాలో మహేష్‌బాబు పాత పేరు చెరుకూరి సిథ్ధార్థ. సినిమా పేరు?
3. నందిని అందుకున్న చిరునవ్వుతో.. చిత్రానికి సంభాషణల రచయత?
4. సెవెంత్ సెన్స్ చిత్రంలో శృతిహాసన్ పాత్ర పేరు?
5. ‘నర్తనశాల’ చిత్ర సంగీత దర్శకుడు దక్షిణామూర్తి ఇంటి పేరు?
6. చిత్రలహరి చిత్రాన్ని నిర్మించిన సంస్థ?
7. ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా’ పాట ఏ సినిమాలోది?
8. ‘చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా’ అంటూ అనురాగదేవతలా పాడిన గాయని?
9. మైసమ్మ ఐపీఎస్‌లో టైటిల్ రోల్ పోషించిన నటి?
10. ఈ చందమామను గుర్తించండి.
*
సమాధానాలు- 133
*
1) జోఅచ్యుతానంద
2) జూ. ఎన్టీఆర్
3) వీటూరి
4) రాధాసలూజ
5) గుణశేఖర్
6) పాండవులు
7) అందరి బంధువయా
8) తకిట తకిట
9) బడి పంతులు
10) కత్రినా కైఫ్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
బి సుధాకర్ రావు, కావలి
లలితాప్రసాద్, శ్రీకాకుళం
ఆర్‌కె ప్రసన్నరాణి, సికింద్రాబాద్
ఎన్ యశ్వంత్, మచిలీపట్నం
డి మల్లిబాబు, పాలకొల్లు
ఆర్ బాబి, జిగిత్యాల
వరలక్ష్మి పి, మెహబూబ్‌నగర్
పి అశోక్‌కుమార్, కోలమూరు
జి రమణారావు, విజయవాడ
ఎస్వీఎన్ బ్రహ్మానందరావు, తుని
సి అనంత్, రాజమండ్రి
జిహెచ్ మునిరాజు, వరంగల్
అల్లాడ ప్రియ, అనకాపల్లి
పి మధుకర్, దుగరాజపట్నం
ఎస్వీ భీమరాజు, డి గన్నవరం
హరితప్రియ, కొమరగిరిపట్నం
పిజె భాస్కరనాయుడు, దుర్గి
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్