ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-127

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. కృష్ణవంశీ దర్శకత్వంలో రెజీనా చుక్కలా మెరిసింది. సినిమా?
3. ఇస్మార్ట్ శంకర్ అవతారం ఎత్తిస్తున్నాడు రామ్‌చేత. ఏ దర్శకుడు?
4. ‘అంతస్తులు’లో తెల్లచీర కట్టుకున్నదెవరి కోసమో అని అడిగిందెవరు?
5. ‘ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య’ నిర్మాత?
6. ‘సిరిమల్లే నీవే విరిజల్లు కావే’ పాట ఏ సినిమాలోది?
7. ముత్యాలముగ్గు కోసం ‘నిదురించే తోటలోకి’ పాటను పిలిచిన కవి?
8. ‘బంగారు కళ్ల బుచ్చెమ్మా/ చెంగావి చెంపలచ్చమ్మో’ మురారి చిత్రంలోని పాట పాడిన గాయకుడు?
9. తమిళ సినిమా సెల్వంధన్. మరి మాతృక తెలుగు సినిమా ఏమిటో?
10. ఫొటోలోని నటి ఎవరు?
*
సమాధానాలు- 125
*
1) ఫిదా
2) బాల
3) చార్మీ
4) రక్షరేఖ
5) ఆడబ్రతుకు
6) దాసరి నారాయణరావు
7) త్రిష
8) అర్చన
9) రాఘవ లారెన్స్
10) అంజలా జవేరి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పి రాజేశ్వర్, గొర్తి
ఎస్‌విఎస్ వౌలి, సికింద్రాబాద్
బి హరగోపాల్, తుని
కె మణి, శ్రీకాకుళం
జివీ హర్ష, ఏలూరు
సి ప్రణవీ రాజేష్, కందుకూరు
ఎం దుర్గాప్రసాద్, ఉండి
డీవీఎస్ గోపీనాథ్, కర్నూలు
మచ్చిలి భాను, అనంతపురం
హెచ్ రంగనాథ శర్మ, భీమవరం
బల్ల గురునాథం, బ్రాహ్మణచెర్వు
జె శ్రీనివాస్, ద్వారకాతిరుమల
పి లక్ష్మీవర్థిని, శ్రీకాళహస్తి
ఎంవీవీ స్వాతి, పెనుకొండ
ఎ అర్చన, ఐ పోలవరం
దాడి ఆంజనేయుడు, బిక్కవోలు
వై రామరాజు, సికింద్రాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్