ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**
నిర్వహణ: జి రాజేశ్వరరావు
**
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) మాలాశ్రీ నటించిన / అమలాపాల్ తెలుగులో పరిచయమైన చిత్రం పేరు ఒక్కటే! అదేంటి?
3) చారూ చారూ/ నా బంగారు చారూ... ఈ పాటలో నటించినవారు?
4) కమల్‌హాసన్, మాధవి, స్వప్న, రాధ-
ఈ కాంబినేషన్ సినిమా పేరు?
5) ఇది వౌనగీతం... ఒక మూగ రాగం/ జీవితం స్వప్న సాగర గీతం- గాయని?
6) వైజయంతీమాల పాడిన పల్లవి/ హెలెన్ పాడిన పల్లవి -మొదటి పదం?
7) మోహనరాగ మహా/మనసులోని కోరిక- పాటల్లో కనిపించే లలిత కళ?
8) నలదమయంతి/ సారంగధర- గుర్చొచ్చే నటి?
9) ఒకే పాటలో ఏఎన్నార్‌తో సూర్యకాంతం/ జయసుధ నృత్యం- ఆ పాట పల్లవి?
10) పక్క చిత్రంలోని స్టిల్ ఏ సినిమాలోది?
**
సమాధానాలు- 10

1) కంచె 2) రాసలీల వేళ
3) రోజారమణి 4) రుణానుబంధం
5) అనుష్క 6) ఎ కోదండరామిరెడ్డి
7) శర్వానంద్ 8) చక్రి 9) దేవదాసు
10) ప్రేమలు పెళ్లిళ్లు
**

సరైన సమాధానాలు రాసిన వారు

జయరాఘవ, ఖమ్మం
ఎన్‌ఎస్ స్వామి, బొబ్బిలి
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
జటంగి కృష్ణ, రాజాపురం
తిరుమల రామ్, నరసరావుపేట
వి గరుత్మంతుడు, మేదరమెట్ల
ఎం రవి, సంతమాగులూరు
వి రాఘవరావు, చిన్నగంజాం
ఆర్‌వి రాఘవ, శ్రీకాకుళం
పల్లె చక్రవర్తి, పిఠాపురం
అనంతకృష్ణ ఎస్, తుని
ఎం యాదవ్, సూర్యాపేట
కె హర్షవర్థన్, చీరాల
పిల్లా లక్ష్మి, ఆదిలాబాద్
నూతి రాజేశ్వరి, విజయవాడ
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు