ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. పక్కనున్న వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. ఎనె్నన్నో జన్మల బంధం.. పాటకు బాణీ కట్టిందెవరు?
3. ముత్యాలముగ్గు చిత్రంలో అల్లు రామలింగయ్య పాత్ర పేరు?
4. ‘తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో’ అన్న పంక్తి రాసిన వేటూరి ఏ పాట కోసం?
5. నాలుగక్షరాల ఇంటిపేరుతో పాపులరైన రాజనాల మూడక్షరాల దపేరు చెప్పండి?
6. గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కాజల్‌తోపాటు కనిపించిన మరో హీరోయిన్?
7. కీరవాణికి ముందున్న ఎంఎం అంటే?
8. మాటలు నేర్చిన మా నరజాతి మారణహోమం సృష్టించేను.. అంటూ రీతిని చెప్పిన కవి ఎవరు?
9. శృంగారతార షకీలా పూర్తి పేరు?
10. పక్క చిత్రంలోని ఒకప్పటి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?
*
సమాధానాలు- 104
*
1. హలో గురు ప్రేమకోసమే
2. సీనియర్ సముద్రాల
3. క్విక్ గన్ మురుగన్
4. మాయాలోకం
5. రోగ్
6. వౌనపోరాటం
7. వెలుగునీడలు
8. జావెద్ అలి
9. రావోయి చందమామ
10. నిత్యమీనన్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
బి చెంచురామయ్య, హైదరాబాద్
కె.మురళీకృష్ణ, చీరాల
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పీవీఎస్ ప్రసాదరావు, అద్దంకి
లతీఫొద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
కదిరి రాజు, మధిర
అంబటి సురేంద్ర, సామర్లకోట
బి కవిత, ముదునూరు
జెవి రాఘవ, బిట్రగుంట
మల్లెల సావిత్రి, పిఠాపురం
ఎస్పీ జనార్థన్, కాకినాడ
రంగరాజు కేసీ, తుని
ఆర్ సుమంత్, సికింద్రాబాద్
కె సుగుణ, పెనుకొండ
ఎల్వీఎస్ మధు, కాకినాడ
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్