ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. నిర్మాత దిల్ రాజు స్టెప్పులేస్తున్నది ఏ సినిమా ఫంక్షన్లో?
2. నర్తనశాల చిత్రం కోసం నరవరా ఓ కురువరా పాట రాసిన కవి?
3. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన హాలీవుడ్ చిత్రం?
4. హాస్యనటుడు పద్మనాభం తెలుగు తెరకు పరిచయమైన చిత్రం?
5. తండ్రి పూరివద్ద ఆకాశ్ పూరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సినిమా?
6. గాయని ఎస్.జానకి సంగీత దర్శకత్వం వహించిన ఉషా కిరణ్ మూవీస్ చిత్రం?
7. స్క్రీన్‌మీద నాగార్జున కనిపించిన మొట్టమొదటి సినిమా?
8. గోవిందుడు అందరివాడేలే చిత్రంలో -గులాబి కళ్లు రెండు ముళ్లు చేసి పాట పాడిన గాయకుడు?
9. అందగత్తె ఐశ్యర్యరాయ్ తెలుగు స్క్రీన్‌మీద అతిధి పాత్రలో కనిపించిన చిత్రం?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 102
*
1. గరుడవేగ
2. గంటా
3. ఆచార్య ఆత్రేయ
4. కొండవీటి వేంకటకవి
5. నేహా శర్మ
6. శ్రీ లక్ష్మమ్మ కథ
7. గోపీసుందర్
8. ఉండమ్మా.. బొట్టుపెడతా
9. కనక
10. సురభి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పీపీ కుమార్, అంపోలు
ఆర్ నాగలక్ష్మి, శ్రీకాకుళం
యన్‌ఎస్ స్వామి, బొబ్బిలి
సిహెచ్ గాయత్రి, హైదరాబాద్
సాయిమనస్విత, హైదరాబాద్
జెవీ రాజు, రాజానగరం
బి దుర్గ, పెందుర్తి
టి రామలక్ష్మి, తుని
కెవీ కృష్ణ, పెద్దాపురం
ఎస్ మను, సికింద్రాబాద్
ఎల్ రామం, గుడివాడ
ఆర్ విశ్వం, కందుకూరు
జనార్థన్, శృంగవరం
కలాపి సుందర్, భీమడోలు
ఎన్ తాజుద్దీన్, కర్నూలు
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్