ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన పుణ్యమూర్తుల అప్పలరాజు స్క్రీన్ నేమ్?
3. చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది -ఈ పాటవున్న సినిమాకు సంభాషణల రచయిత?
4. ప్రేమ అనేది ఎవడికి వాడికి సెపరేట్ క్వొశ్చన్ పేపర్. నీ ఆన్సర్ నాకు, నా ఆన్సర్ నీకు పనికిరాదు-
ఈ డైలాగ్ ఏ సినిమాలోది?
5. అమలాపాల్ మొదటి తెలుగు సినిమా?
6. సామర్లకోట ఊరి పేరులోని మొదటి మూడు అక్షరాలు ఓ గొప్ప నటుడి ఇంటి పేరు? ఎవరాయన?
7. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘వీరాంజనేయ’లో టైటిల్ పాత్రధారి?
8. మాటేరాని చిన్నదాని -అంటూ ఎస్పీ బాలు గుక్క తిప్పుకోకుండా పాడింది ఏ సినిమాలో?
9. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. -అంటూ వేటూరి పాటతో కన్నీరు పెట్టించిన గాత్రం ఎవరిది?
10. ఒకప్పటి ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

సమాధానాలు- 101

1. భరత్ అను నేను
2. మణికందన్
3. సాయిచంద్
4. ఎం రత్నం
5. శ్రీశ్రీ
6. కదిరి వెంకటరెడ్డి
7. వరుమాయన్ నిరం సిరప్పు
8. అలెగ్జాండర్
9. ఎస్ రాజేశ్వర రావు
10. భూమిక

సరైన సమాధానాలు రాసిన వారు

ఎస్ నాగశే్వత, బెంగళూరు
కెవియస్‌యన్ మూర్తి, విశాఖపట్నం
ఎన్ శృతికీర్తి, బొబ్బిలి
బి వరలక్ష్మి, విశాఖపట్నం
సిహెచ్‌ఎన్ రావ్, హైదరాబాద్
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
పి ప్రశాంత్‌కుమార్, అంపోలు
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
కె శివానందరావు, కర్నూలు
జీవీఎం మోహన్, ముచ్చుమిల్లి
కె మురళీకృష్ణ, చీరాల
ఎస్ గాయత్రి, హైదరాబాద్
సాయిమనస్విత, హైదరాబాద్
ఎంజి అప్పాజీ, నర్సాపురం
పి విశ్వమిత్ర, తుని

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్