అంతర్జాతీయం

ఎఫ్-16 దుర్వినియోగంపై పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: పూల్వామా ఉగ్రదాడి తరువాత భారత, పాకిస్థాన్ మధ్య గగనతల వైమానిక దాడులు జరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల మధ్య అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ ఉపయోగించిందని భారత వాయుసేన ప్రకటించింది. వాస్తవానికి ఈ యుద్ధ విమానాలను కేవలం స్వీయ రక్షణకు మాత్రమే ఉపయోగించాలని కొనుగోలు సమయంలో పాక్- అమెరికా మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ పేర్కొంటుంది. కాగా పాకిస్థాన్ దాడిచేసిన ఎఫ్-16 శకలాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని భారత్ పేర్కొంది. ఇదిలావుండగా ఎఫ్-16 ద్వారా మాత్రమే ప్రయోగించగలిగే ఆమ్రామ్ క్షిపణి శకలాలు లభించినట్లు భారత్ పేర్కొంది. పాక్ ఎఫ్-16 దుర్వినియోగంపై పరిశీలన జరుపుతున్నట్లు అమెరికాకు చెందిన అధికార ప్రతినిధి రాబర్ట్ పలాడినో వెల్లడించారు. ఈ గగనతల దాడుల్లో భారత్ మిగ్-21 విమానాలను వినయోగించింది. పాక్ మాత్రం తాము ఎఫ్-16 వాడలేదని బుకాయిస్తోంది. పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను భారత్ అమెరికాకు అందజేయటమే కాకుండా ఇప్పటికే మీడియా ముందు సైతం ప్రదర్శించింది.