Others

తండ్రితో పోరాడి పరీక్షలు రాసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏ చదువులూ వద్దు.. పరీక్షలు రాయనక్కర్లేదు..’ అంటూ ఆంక్షలు విధించిన కన్నతండ్రిపైనే ఆ బాలిక జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి చివరికి తన పంతం నెగ్గించుకుంది. ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆమె వార్షిక పరీక్షలు రాసింది. గుజరాత్‌లోని జిల్లా కేంద్రమైన పాలన్పూర్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ పేద కుటుంబంలో పుట్టిన గీత (పేరు మార్చాం)కు చదువు విషయంలో చిన్నప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. మిగతా పిల్లల్లా బడికి వెళ్తానంటే ఆమె కుటుంబ సభ్యులు అంతగా ఇష్టపడలేదు. ఇంటిపనుల్లో సాయపడుతూ ఎలాగోలా ప్లస్ టూ (ఇంటర్) వరకూ నెట్టుకొచ్చింది. ఇంతవరకూ చదివింది చాలని, ఇక ఏ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఆమెను ఇంటినుంచి బయటకు పంపేందుకు తండ్రి ఒప్పుకోలేదు. పరీక్షకు సమయం దగ్గరవడంతో ఆ బాలిక ‘చైల్డ్ హెల్ప్‌లైన్’కు ఫోన్ చేసి తన సమస్యను మొరపెట్టుకుంది. బాలిక తండ్రి హోంగార్డుగా పనిచేసి పదవీ విరమణ చేశాడని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆమెను పనిలోకి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నీరజ్ బద్గుజార్ తెలిపారు. అధికారులు, పోలీసులు కౌనె్సలింగ్ చేయడంతో బాలిక తండ్రిలో చివరికి మార్పు వచ్చింది. తన కుమార్తెను పరీక్షాకేంద్రానికి పంపేందుకు అతను అంగీకరించడంతో కథ సుఖాంతమైంది.