తెలంగాణ

దిశ నిందితులు ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన యువ వైద్యురాలు దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నలుగురు నిందితులు పారిపోవటానికి ప్రయత్నించగా ఈ రోజు తెల్లవారుజామున వీరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. దిశను సజీవ దహనం చేసిన చటాన్‌పల్లి ప్రాంతానికి కేవలం 300 మీటర్ల దూరంలో వీరు హతమవ్వటం జరిగింది. పోలీసులు నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తీసుకురాగా అక్కడ చీకటిగా ఉండటంతో నిందితులు పోరిపోయేందుకు ప్రయత్నించారు. నిందితులను రాత్రి 12 గంటల మధ్య చర్లపల్లి జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. పోలీసు స్టేషన్‌లోనూ వారిని హైసెక్యూరిటీ మధ్య ఉంచటం జరిగింది. దిశను దహనం చేసిన ప్రాంతాన్ని తీసుకువచ్చి దిశ ఫోన్‌ను పాతిపెట్టిన ప్రాంతంలో డీసీపీ సందీప్‌రావు నేతృత్వంలో పోలీసులు విచారణ జరుపుతుండగా నిందితులు తమకు తెలిసిన ప్రాంతం కావటంతో పోలీసులపై దాడికి దిగారు. ముందు ఆరిఫ్ దాడికి దిగాడు తరువాత మిగతా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు. నిందితులు తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించారు. అది వీలుకాకపోవడంతో రాళ్లదాడి చేస్తూ పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. నిందితుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఘటనా స్థలానికి చేరుకుని ఎన్‌కౌంటర్ పై విచారణ చేపట్టారు.