తెలంగాణ

తన్నుకున్న ఎల్లంపల్లి గుత్తేదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ , డిసెంబర్ 21: ఎల్లంపల్లి నిర్మాణ గుత్తేదారులు వీధి రౌడీలయ్యారు. గుత్తేదారులు, ఉపగుత్తేదారులు ఇరువర్గాలుగా మారి ప్రధాన రహదారిపైనే గుద్దులాటకు దిగారు. ఒకరిపై ఒకరు పోటీపడి పిడిగుద్దులు కురిపించుకోవడం మల్లయుద్ధాన్ని తలపించింది. వీరిని ఆపేందుకు పోలీసులు కూడా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ సంఘటన కరీంనగర్ పట్టణంలోని రహదారులు, భవనాల శాఖ అతిధిగృహం ఎదుట సోమవారం జరిగింది. ఘటనను దారివెంట వెళ్తున్న వారి చూసి హతాశయులు కాగా, పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించడంతోగొడవ సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో భాగంగా ఎల్లంపల్లి నుంచి శుక్రవారంపేట వరకు రూ.102 కోట్లతో, మల్హర్ మండలంలోని వల్లంకుంట మానేరుపై రూ.5.94 కోట్లతో పనులు చేపట్టిన గుత్తేదారు మురళి వీటిని రెండేళ్ళ క్రితం ఉపగుత్తేదారులకు అప్పగించారు. అయితే, వీటిని నిర్ణీత గడువులోగా పూర్తిచేసిన ఉపగుత్తేదారులు ప్రధాన గుత్తేదారును బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులు ఏడాది క్రితమే విడుదల చేయగా, ఇందుకు కేటాయించిన మొత్తాన్ని గుత్తేదారు మురళి విడిపించుకున్నాడని, తమకు మాత్రం ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పుతున్నాడని ఉపగుత్తేదారులు ఆరోపించారు. పలుమార్లు హైదరాబాద్‌కు పిలిపించి, బెదిరింపులకు గురిచేశాడని తాము మంత్రి ఈటెలకు ఫిర్యాదు చేశామన్నారు. అయతే, గుత్తేదారును మందలించి డబ్బులు చెల్లించాలని చెప్పగా, కరీంనగర్‌లో మాట్లాడుకుందామని చెప్పి తమను పిలిపించి, తమపైనే దాడికి దిగాడంటూ ఉపగుత్తేదారులు వాపోయారు. రూ.30 లక్షల పనులకు సంబంధించి బిల్లులు ఏడాదిన్నరగా చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులపాలవుతున్నామని మొరపెట్టుకున్నా కనికరించకుండా తన అనుచరులచే భౌతికదాడులకు దిగి, మంత్రిని బద్‌నామ్ చేస్తున్నాడంటూ ఉపగుత్తేదారులు మొరపెట్టుకోవడంతో ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.