ఈ వారం తార

క్రేజీ ఛాన్స్ కొట్టేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ముకుంద, ఒక లైలాకోసం సినిమాలు చేసినప్పటికీ పూజా హెగ్డే కెరీర్ ఊపందుకోలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘మొహెంజొదారో’ చిత్రంతో అడుగుపెట్టింది. ఈ సినిమా తీవ్ర నిరాశపర్చడంతో టాలీవుడ్‌కే వచ్చేసింది. ఈసారి గ్లామర్ డోస్ పెంచింది. దువ్వాడ జగన్నాథంలో బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది. ఇక రంగస్థలంలో ‘జిగేల్ రాణి’ అంటూ ఓ ఊపు ఊపింది. దీంతో వరుసగా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్‌లతో కలిసి నటించే అవకాశం అందుకుంది. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్ నుంచి కూడా పిలుపు అందుకుంది. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న హౌస్‌ఫుల్-4లో పూజా హీరోయిన్‌గా ఖరారు అయింది. ఇంత బిజీగా వున్న ఈమెకు కొన్ని కోరికలు అలాగే ఉండిపోయాయి. అవి ఏమిటంటే కమర్షియల్ చిత్రాలతోపాటు బయోపిక్ సినిమాల్లో కూడా నటించాలనుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. బయోపిక్ సినిమాల్లో నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ముఖ్యంగా క్రీడాకారిణుల నిజ జీవిత పాత్రల్లో నటించాలని ఉంది. సానియా మీర్జా, మిథాలీ రాజ్ బయోపిక్‌ల్లో కనిపించాలని ఉంది. అథ్లెట్‌ల పాత్రల్లో కనిపించేందుకు నా బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నాను అని చెప్పింది.