ఈ వారం తార

గ్లామర్‌కు దూరంగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలో ఇప్పుడున్న క్రేజీ కథానాయికల్లో బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తొలి చిత్రం నుంచి నేటి ‘తేజ్..ఐ లవ్‌యూ’ వరకు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. కెరీర్‌లో ఎలా నిలదొక్కుకోవాలో కూడా అనుపమకు బాగానే తెలిసినట్టుంది. అందుకే ఆమె ఎంపిక చేసుకుంటున్న చిత్రాలు.. ఆయా చిత్రాల్లో ఆమె పోషిస్తున్న పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొస్తున్న కుర్రతరం భామల్లో అనుపమకు మంచి క్రేజ్ ఉంది. యువతరం కథానాయకులు సైతం తమ చిత్రాల్లో అనుపమ ఉండేలా చూసుకుంటున్నారు. ఫలితంగా ఆమెకు అవకాశాలకు కొదువే లేకుండా పోయింది. నాలుగైదు చిత్రాలతో యమబిజీగా వున్న ఈ బ్యూటీ గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటూ వస్తోంది. ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఈ విషయం గురించి ఆమెను కదిలిస్తే- ‘‘గ్లామర్ పాత్రలంటూ వేరుగా ఏం ఉండవు. మనం ఎంపిక చేసుకునే పాత్రల్లోనే గ్లామర్ ఉట్టిపడేలా చూసుకోవాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్‌పోజింగ్ జోలికి వెళ్లను. గ్లామర్‌గా కనిపించడంలో తప్పులేదు. ఏదైనా అసభ్యంగా ఉండనంతవరకు అయితే ఓకే! నన్ను అందరూ అడుగుతున్నారు.. గ్లామర్‌కు దూరంగా ఉంటున్నారెందుకు? అని. నాకు వస్తున్న అవకాశాల్లో మంచివి అనుకున్నవి మాత్రమే ఒప్పుకుంటున్నాను. అది గ్లామరా? వైవిధ్యమైనదా? అని నేను చూడడం లేదు’’అంటూ చెప్పుకొచ్చింది ఎంతో తెలివిగా. దటీజ్.. అనుపమ!