ఈ వారం తార

దటీజ్..తాప్సీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోయిన్లు చిత్రసీమలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడేందుకు భయపడుతున్నారు’ అని తాప్సీ అంటోంది. తన ఆలోచనలను, భావాలను నిర్మొహమాటంగా చెప్పడంలో తాప్సీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటీవల చిత్ర పరిశ్రమలోని సంఘటనలపై ఆమె బహిరంగంగానే మాట్లాడుతోంది. తాజాగా తమ అనుభవాలను చెప్పేందుకు కథానాయికలు ముందుకు రాకపోవడానికి కారణమేంటి? ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు తాప్సీ సమాధానమిస్తూ - ‘కొందరు కథానాయికలు తమ స్వప్రయోజనాలకోసం ఇలాంటి దోపిడీపై మాట్లాడటం లేదు. ముఖ్యంగా ఎలాంటి సినీ నేపథ్యం లేని వారు అభద్రతాభావంతో భయపడుతున్నారు. మాట్లాడేందుకు వెనకడుగు వేస్తున్నారు. నాకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఇప్పటికే బహిరంగంగా మాట్లాడేదాన్ని. కొత్తల్లో దీని గురించి చాలామంది చెప్పారు. అందుకే ఆ విషయాలపై అవగాహనతో ఉన్నాను. కానీ నాకు చెప్పినవాళ్లే తమ అనుభవాలను పంచుకోలేకపోవడం బాధాకరం’ అని పేర్కొంది. ప్రస్తుతం బద్లా అనే చిత్రంలో అమితాబ్‌తో కలిసి నటిస్తోంది. సుజోరు ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ శక్తివంతమైన వ్యాపారవేత్తగా కనిపించనుందట. తన పాత్ర గురించి ఆమె తెలియజేస్తూ.. ఇందులో మరింత గ్లామరస్ పాత్రను పోషిస్తున్నాను. అయితే ఇది జుడ్వా-2 తరహా గ్లామర్ కాదు. ఈ సినిమా ఈనెల 14నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది అని వివరించింది. దటీజ్..తాప్సీ! *