ఈ వారం తార

స్టార్‌డమ్‌కి దూరంగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెజీనా.. వెండితెరపై అడుగుపెట్టి అప్పుడే పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ పది సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో మలుపులు ఉన్నాయి. అవేవీ ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ స్థాయికి తీసుకెళ్లలేదనే చెప్పాలి. ఇంకా స్టార్‌డమ్‌కి దూరంగానే ఉంది. ఇవ్వాళ టాలీవుడ్‌లో నిన్నగాక మొన్న వచ్చిన బ్యూటీలు అప్పుడే అగ్ర స్థాయికి చేరుకొని స్టార్‌డమ్‌ని కైవసం చేసుకొని క్రేజీ భామలుగా పేరుతెచ్చుకుంటున్నారు. అయితే రెజీనా మాత్రం ఇనే్నళ్లయినా.. ఇంకా ఆ స్థాయిని చేరుకోలేకపోతోంది. కారణాలు ఏమైనా ఇంకా తనను తాను నిరూపించుకోవడానికి ఒకే ఒక్క అవకాశం కోసం ఇంకా ఎదురుచూస్తూనే వుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందనే ఆశపడుతోంది. ఎంతో ఇష్టంతో నటిగా మారింది. కెరీర్ ప్రారంభంలో తెలిసీ తెలియక కొన్ని తప్పుల కారణంగా స్టార్‌డమ్‌కి దూరంగానే ఉందనే విషయం ఆలస్యంగా తెలుసుకుంది. ఇక నుంచి కెరీర్ తప్ప మరో ఆలోచన చేయనంటోంది. కెరీర్ ప్రారంభంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ సమయంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులను గుర్తించే సరికి సమయం మించిపోయింది. ఇక ఇప్పుడు ప్రేమా, పెళ్లి జోలికి వెళ్లదలుచుకోలేదట. ఇంట్లో కూడా అదే చెప్పేసిందట. కొన్ని రోజుల వరకు పెళ్లి విషయంలో తన జోలికి రావద్దని అని కూడా గట్టిగానే చెప్పిందట. ఇప్పుడు తన దృష్టి అంతా కెరీర్‌పైనేనట. తెలుగు, తమిళం ఏ భాషలోనైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలి. తెలుగులో ‘అ’ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. కథలు వింటోంది అంతే! తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురుచూస్తోంది. 2017 గొప్ప సంవత్సరం కాదు. కానీ 2018 ఆశించిన స్థాయిలో ఉంటుందని మాత్రం అనుకుంటోంది. గత ఏడాది తమిళంలో మూడు సినిమాలు, తెలుగు రెండు సినిమాల్లో నటించింది. సందీప్‌కిషన్ సరసన ‘నక్షత్రం’, నారా రోహిత్‌కు జోడీగా నటించిన ‘బాలకృష్ణుడు’ చిత్రాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో గతేడాది ఎలా సాగిందనే ప్రశ్నకు రెజీనా స్పందిస్తూ- ‘ నిజంగా చెప్పాలంటే 2017 నా కెరీర్‌కు గొప్ప ఏడాది కాదు. నా సినిమాలు ఆశించిన ఫలితాన్విలేదు. కానీ 2018 ఆశించిన స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నా. ఈ ఏడాది నేను పనిచేసిన కొన్ని చిత్రాలు నటిగా నాలో పరిణతికి తోడ్డడ్డాయి. ఇప్పటి వరకు నేను పోషించిన పాత్రలతో పోల్చితే ఇప్పుడు చేస్తున్నవి చాలా విభిన్నంగా ఉంటాయి. నా పాత్రలు చూసిన తర్వాత ప్రేక్షకుల్లో వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నా. తెలుగు సినిమా ‘అ’లో నేను మాదక ద్రవ్యాలకు బానిసైన అమ్మాయిగా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం నా జుట్టును షార్ట్ కట్ చేసుకున్నా. ఇది నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

-దిల్