ఈ వారం తార

భాగమతి తర్వాత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనుష్క తాజాగా నటించిన ‘్భగమతి’ విడుదలై సంచలనం రేపుతోంది. భారీ ఓపెనింగ్స్‌తో ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్‌ని తెచ్చుకున్న ‘్భగమతి’ సినిమాలో అనుష్క అభినయానికి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అనుష్క మరే సినిమాకు ఓకే చెప్పకపోవడం షాక్ కలిగిస్తుంది. ఈ విషయం గురించి ఓ ఇంటర్‌వ్యూలో అనుష్క మాట్లాడుతూ = బాహుబలి తర్వాత ఏ సినిమాకు సైన్ చేయలేదని, బాహుబలి సినిమా విజయానే్న ఇంకా ఆస్వాదిస్తున్నామని తెలిసింది. ‘బాహుబలి’ సినిమా కోసం చాలా కష్టపడ్డామని, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తున్నామని తెలిపిన అనుష్క, ‘్భగమతి’ సినిమా కూడా ‘బాహుబలి’కి ముందు ఒప్పుకున్న కథే అని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని గాయాలు అయ్యాయని అవి మానే వరకు రెస్ట్ తీసుకుంటున్నానని, అలాగే బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్నా అని తెలిపింది. ఇప్పటికే పలు కథలు వింటున్నానని, కానీ ఏవీ నచ్చడం లేదని చెప్పింది. సో.. అనుష్క మరో సినిమా చేయడానికి చాలా టైం పట్టేలా ఉందన్న విషయం అర్థం అవుతోంది.