ఈ వారం తార

మనసులో మాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ఆశలు.. మరెన్నో కోరికలు... ఇవీ వెండితెర మీద అడుగుపెట్టే ముందు బ్యూటీ హరిప్రియ మనసులో మెదిలిన కలలు. అడుగుపెట్టాక గ్లామర్ హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మాలనుకుంది. కానీ, కెరీర్ పరంగా ఒక్క సరైన హిట్ పడలేదు. అయినా రవ్వంత ఆశతో మనసులో బలంగా ముందుకు వెళ్లాలనుకుంది. ఎలాగైనా కెరీర్‌లో నిలదొక్కుకోవాలనుకుంది. ఆ మధ్య యువతరం క్రేజీ కథానాయకుడు నానితో చేసిన ‘పిల్ల జమీందార్’ తప్పితే మిగతా చిత్రాల పరిస్థితి అలాగే ఉంది. దాంతో తెలుగు చిత్రసీమలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇక లాభం లేదనుకున్న హరిప్రియ టాలీవుడ్‌ను వదిలి కన్నడంపై ఆశలు పెంచుకుంది. ఈ దశలో హరిప్రియ సంచలన కామెంట్స్ కూడా విసిరింది. తాజాగా ఓ ఇంటర్‌వ్యూలో మనసులోని భావాల్ని బట్టబయలు చేసింది. ‘‘నేను చాలా విషయాల్లో మోసపోయాను. నా దగ్గరకు వచ్చిన కథ విషయంవొ సినిమాల విషయంలో అద్భుతంగా చెప్పేవారు. కానీ దాన్ని తెరపై ఎక్కించేవారు కాదు. తీరా సినిమాలు విడుదలైన తర్వాత చూసుకుంటే ఎంతో షాక్‌కు గురయ్యేదాన్ని. ఇకపై కథలు చెప్పిన దర్శకుడు దాన్ని చెప్పిన విధంగానే తెరకెక్కిస్తాడా? లేదా? అన్న విషయాలను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంత వరకు నా పాత్ర గురించే ఆలోచించాను తప్ప.. సినిమా, యూనిట్ గురించి పట్టించుకోలేదు. ఇకపై అలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త వహిస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ హరిప్రియ మోసపోయిన విషయాలేంటో మాత్రం చెప్పలేదు.. ప్చ్..!