ఈ వారం తార

సమంత యు టర్న్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సమంత పెళ్లి తరువాత కాస్త సెలెక్టివ్‌గా సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఓ కన్నడ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్ధమైంది. కన్నడంలో సంచలన విజయం సాధించిన యు టర్న్ చిత్రాన్ని రీమేక్ చేయాలని, దానికి సంబంధించిన రీమేక్ హక్కులను కూడా తీసుకుంది. థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కే ఈ చిత్రంతో సమంత నటిగా మరోకోణాన్ని చూపించేందుకు సిద్ధమైంది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన పవన్‌కుమార్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ఉంటుందని, వచ్చే నెలలో సెట్స్‌పైకి రానున్నదట. ఈ సినిమాపై సమంత భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన్‌గా వెలుగొందిన సమంత నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది.