ఈ వారం తార

స్పీడ్ పెంచేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అనతి కాలంలో స్టార్ హీరోలతో చిత్రాలు చేసే అవకాశం లభించింది. ఇది నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. పరిశ్రమకొచ్చిన అతి తక్కువ సమయంలోనే నాకు ఇలాంటి అవకాశాలు రావడం అంతకంటే ఆనందమేముంటుంది? ఒకసారి కలిసి పని చేసిన దర్శకుడు రెండోసారి పిలవడం అనేది గొప్ప గౌరవం. అటువంటి అవకాశం తెలుగులో నాకు ఇంకా రాలేదు. భవిష్యత్తులో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. కెరీర్ ఆరంభంలో మలయాళంలో నాకు ఇటువంటి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. తాజాగా నేను చేస్తున్న చిత్రాలు చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. టాలీవుడ్ ప్రోత్సాహం, తెలుగు ప్రేక్షకుల ఆదరణ నేను ఎన్నటికీ మరచిపోలేను’’
తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఎవ్వరినోటా విన్నా అందాలభామ అను ఇమ్మాన్యుయేల్ గురించే. చూస్తుండగానే ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన చేరిపోయింది. గ్లామర్‌తో పాటు నటనలోనూ మెరుపులు కురిపిస్తూ అటు చిత్రసీమను, ఇటు ప్రేక్షకులను తన వైపునకు మళ్లేలా చేసుకుంది. వస్తున్న అవకాశాల్లో తనకు నచ్చినవి ఎంచుకుంటూ కెరీర్‌లో మెరుపు వేగంతో దూసుకువెళుతోంది. అంతేకాదు, స్టార్ హీరోల చిత్రాలు చేస్తూ స్పీడ్ పెంచేసి అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తోంది. మంచి అవకాశాలను అందుకుంటూ కెరీర్ రేస్‌లో తిరుగులేని తారగా పేరుతెచ్చుకుంటోంది. స్టార్ హీరోల సరసన నటించడం తన అదృష్టమని కూడా చెబుతోంది. కెరీర్ ఎలా ఉంది? అని అనును కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అనతి కాలంలో స్టార్ హీరోలతో చిత్రాలు చేసే అవకాశం లభించింది. ఇది నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. పరిశ్రమకొచ్చిన అతి తక్కువ సమయంలోనే నాకు ఇలాంటి అవకాశాలు రావడం అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి? తాజాగా నేను చేస్తున్న చిత్రాలు చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. టాలీవుడ్ ప్రోత్సాహం, తెలుగు ప్రేక్షకుల ఆదరణ నేను ఎన్నటికీ మరచిపోలేను’’అంటూ ఎంతో సంతోషంగా చెబుతున్న అను ఇమ్మాన్యుయేల్ తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అజ్ఞాతవాసి’లో నటించింది. ఈ చిత్రం ఈ సంక్రాంతికే ప్రేక్షకుల మందుకొచ్చింది. చిత్రం ఎలా వున్నా, గ్లామర్ తారగా ఈ బ్యూటీకి మంచి క్రేజే ఏర్పడింది. ఈ చిత్రంతో పాటు మరో నాలుగు సినిమాల్లోనూ యువతరం క్రేజీ స్టార్‌తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అక్కినేని నాగచైతన్యకు జోడీగా నటించే ఓ చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది. మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది కూడా. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది, మారుతి-నాగచైతన్యల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకోనుందట. ఇందులో అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. సో.. 2018 ఆరంభమే అనుకు అదిరిపోయేలా అదృష్టం కలిసొచ్చిం దన్నమాట! ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోనూ మంచి అవకాశా లను అంది పుచ్చుకుంటోంది. రాబోయే సీజన్ అంతా తనదేనంటూ ఎంతో హుషారుగా గట్టి నమ్మకంతో చెబుతోంది.