ఈ వారం తార

నా దారి నాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ఫదా’ సుందరి సాయిపల్లవి నా దారి నాదే అంటోంది. కథ నచ్చితేనే సినిమా. లేకపోతే లేదు అని గట్టిగానే చెబుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం.. ఇటీవల దిల్ రాజు సినిమా ఒకటి వస్తే.. అందులో నటించడానికి నో చెప్పేసిందట. అవును నిజంగా నిజమేనంటున్నారు సినీవర్గాలు. ఈ విషయం గురించి సాయిపల్లవిని కదిలిస్తే- ‘అవును.. నా కెరీరే నాకు ముఖ్యం. నాకు నచ్చిన సినిమాలే చేస్తాను. నచ్చకపోతే ఎవరు బలవంతం చేసినా చేయను. దిల్ రాజుగారి సినిమా కథ నన్ను ఆకట్టుకోలేదు. అందుకే ఆ చిత్రంలో నటించను అని చెప్పాను. అయితే ఈ సినిమాకి నాకు తక్కువ మొత్తం ఇస్తున్నారని కొందరు, లేదు లేదు చాలా ఎక్కువ ఆఫర్ చేసినా చేయనన్నానని ఇంకొందరు ఇలా ఎవరికి నచ్చింది వారు అనుకున్నారు. ఎవ్వరేమనుకున్నా నా దారి నాదే! మణిరత్నం గ్రేట్ దర్శకులు. అయితే కథ నచ్చలేదు. నాలాంటి వారికి ఆయన దర్శకత్వంలో నటించాలని ఎందుకు ఉండదు? దర్శకుడు గొప్ప వ్యక్తే కావొచ్చు. కథ నచ్చకపోతే ఎలా చేస్తాను? అలా చేస్తే నా క్యారెక్టర్‌కి తగిన న్యాయం చేయలేను. ఇవన్నీ ఆలోచించే మణిరత్నం గారికి చేయలేను అని చెప్పా. అలాగే విక్రమ్ సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ కథ నచ్చలేదు. ఆయన సరసన నటించాలంటే నేను చేసే క్యారెక్టర్‌లో దమ్ముండాలి.. ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అలా లేకపోతే ఆయన పక్కన కనిపించలేం. ఆయన ముందు మన పాత్ర తేలిపోతుంది అనిపించింది. అందుకే చేయడానికి ఒప్పుకోలేదు. ఈ రెండు సినిమాల విషయాల్లోనూ కోలీవుడ్‌లో చాలామంది నన్ను తప్పుపట్టారు. ఏదో ఒకటి, రెండు సక్సెస్‌లకే సాయిపల్లవికి పొగరెక్కిందనీ, ఎవరి మాటా వినదని అన్నారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా పంథాలో నేను పోతాను అంతే’ అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సాయి పల్లవికి పారితోషికం ఎక్కువ ఇస్తాం.. గ్లామర్‌గా కనిపించమంటున్నారట. ‘ముఖం మీద మొటిమలు ఉన్నా తెరమీద అందంగానే కనిపిస్తున్నాను కదా! గ్లామర్ అంటే అందంగా కనిపించడమే’ నంటోంది. కొందరి దృష్టి లో అందాల ఆరబోతనే గ్లామర్ అనుకుంటారు. అలా అనుకుని తన దగ్గరకు చాలా మంది వచ్చారని కూడా చెబుతోంది. అలాంటి వారి ఉద్దే శ్యం అర్థమయ్యే వారి సినిమాలు చేయలేదు. గ్లామర్ పేరుతో అం దాల ఆరబోత తనకు అస్సలు ఇష్టముండదట. అవే కండిషన్లు అనుకుంటే తను చెప్పగలిగేది ఏమీలేదు. మరి కొందరు వస్తారు. కథ చెప్పరు. హీరో ఫలా నా వ్యక్తి నటిస్తారా? అంటూ నేరుగా అడుగుతారట. అయితే తన దృష్టిలో కథనే హీరో. మిగతా వారంతా నటులే! ఆ కథ తెలుసుకోకుండా ఎలా ఓకే చెబుతాను. తన పక్కన ఎవరు చేస్తున్నారు? అన్నది అస్సలు పట్టించుకోదట. ఇవన్నీ చెబితే కండిషన్లంటారు. ఇక లిప్‌లాక్‌లు లాంటివి తన వల్ల కాదు. తను మధ్య తరగతి అమ్మాయిని. అలాంటి వాటికి తన పేరెంట్స్ అస్సలు అంగీకరించరు. తను సినిమాలు చేస్తానంటే వాళ్లు కొన్ని కండిషన్లు పెట్టారు. అందులో లిప్‌లాక్‌లు ఒకటి. కెరీర్ కోసం మనసు చంపుకోలేదు. ఇది మొదటి కారణం. ఏదో మొహమాటానికి పోయి సినిమాలు చేస్తే ప్రేక్షకులు నా మొహానే్న మరచిపోతారని కూడా చెబుతోంది. వాహ్.. సాయి పల్లవి దిగ్రేట్ కదా!

-దిల్