ఈ వారం తార

రీమేక్‌లోనూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపైకి మరో కొత్త అంద దూసుకొస్తోంది. మలయాళ ముద్దుగుమ్మ ఐమా సెబాస్టియన్ తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘పడయోత్తం’ మలయాళ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అటు గ్లామర్‌పరంగానూ, ఇటు యాక్షన్ పరంగానూ ఐమా సెబాస్టియన్‌కు మంచి మార్కులే పడ్డాయి. మలయాళంలో విజయవంతమైన ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో ఓ రకంగా ఐమా సెబాస్టియన్ వల్లనే విజయవంతంమైందన్న ఓ నమ్మకం ఉండడంతో తెలుగులో కూడా కథానాయికగా ఐమానే ఎంపిక చేశారు. తెలుగులో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. వినూ యజ్ఞ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. మలయాళంలో సూపర్‌హిట్ కొట్టిన ఐమా సెబాస్టియన్ తెలుగులో ఎంత ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.