ఈ వారం తార

మలయాళంపై ఫోకస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమా తరువాత అనుష్క క్రేజ్ తగ్గినట్టుంది. ఈ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించిన అనుష్క ఆమధ్య రెండు చిత్రాలను మాత్రమే చేసింది. ప్రస్తుతం ‘్భగమతి’ చిత్రంలో నటిస్తున్న అనుష్కకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడంలేదు. దాంతో ఆమె ఫోకస్ మలయాళంపై పడింది. తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుండడంతో మలయాళంలో ప్రయత్నాలు మొదలుపెట్టిందట. నిజానికి మలయాళంలో మంచి కథాబలం వున్న చిత్రాలు వస్తాయని ఈ విషయాన్ని చాలా రోజులకు తెలుసుకున్నానని చెబుతోంది. అందుకే అక్కడ మంచి స్క్రిప్ట్ వస్తే చేయడానికి సిద్ధమని హీరో, బ్యానర్ లాంటి విషయాలను పట్టించుకోనని చెబుతోంది. మొత్తానికి ఇక్కడ అవకాశాలు తగ్గడంవల్లే మలయాళంపై ఫోకస్ పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ 151వ చిత్రంలో నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. మరోవైపు జీరో సైజ్ సినిమా సమయంలో విపరీతంగా లావు పెరిగిన అనుష్క ఇప్పుడు స్లిమ్‌గా మారే ప్రయత్నాల్లో ఉంది.