ఈ వారం తార

ప్చ్.. చందమామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంటో.. అన్నీ కాజల్‌లే ఇలా జరుగుతున్నాయ. బిగ్ స్టార్‌గానే వెలుగొందుతున్నా.. చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు చేతిలో లేక తెగ ఇబ్బంది పడుతుంటే, అందుకు తగ్గట్టే పరిణామాలూ అన్నీ వ్యతిరేకం అవుతున్నాయట. ఆమధ్య బాలీవుడ్‌లో రణదీప్ హుడాతో అందాల చందమామ కాజల్ చేసిన లిప్‌లాక్ గూర్చి గుసగుసలు వినిపించాయ. గతంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో సడన్‌గా హీరోయిన్‌కి లిప్‌లాక్ ముద్దు పెట్టేశాడని, అందువల్ల అలిగిన కాజల్ షూటింగ్ నుండి వెళ్లిపోయిందని ప్రచారం జరిగింది. దాంతో ఆ చిత్రానికి సంబంధించిన ప్రచారం బాగా జరిగింది. ఇంత హైప్ తీసుకొచ్చిన దర్శక నిర్మాతలకు బాగానే వున్నా, కాజల్‌కు మాత్రం ఇది ఇబ్బందికర పరిణామంగా తయారైంది. ఎక్కడికి వెళ్లినా అలా లిప్‌లాక్ కిస్ పెడితే ఎలా ఊరుకున్నారని అందరూ అడగడంతో చిర్రెత్తుకొచ్చింది ఆమెకు. ఇక లాభం లేదనుకుని ఉన్న నిజాన్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పేసింది. ఆ ముద్దుసీన్ స్క్రిప్ట్‌లో ఉన్నదేనని, అంధురాలైన అమ్మాయి తన ప్రేమను చెప్పడానికి స్పర్శ మాత్రమే ఆధారం కనుక ఆ ముద్దు పెట్టడంకంటే వేరే దారి లేదు కనుక అలా స్క్రిప్ట్‌లో ఉన్న ప్రకారం చేశానని చెప్పుకొచ్చింది. లిప్‌లాక్ కిస్ ఉంటుందని తనకు ముందే తెలుసని అంది.
ఇప్పుడు తాజాగా విడుదలైన బ్రెహ్మోత్సవంలో అందాల చందమామ పెదవి విరిచేలా చేసిందన్న టాక్ కాజల్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. ముగ్గురు హీరోయన్లున్న ఈ సినిమాలో కాజల్‌ది ప్రధాన పాత్రే అయనా, అటు నటనలో కానీ ఇటు గ్లామర్‌లో కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయందని టాలీవుడ్‌లో దుమారం రేగుతోంది. కాజల్‌ని చూస్తే ఉన్న అందం అంతా పోయి సన్నటి పుల్లలా కనిపించిందని, అసలు ఆమె సినిమాలో కనిపించిన తొలి సీనే ప్రేక్షకులకు షాక్ ఇచ్చిందని అంటున్నారు. దానికి తగ్గట్టు ఆమె పాత్రలో ఎటువంటి విషయం లేకపోడంతో తేలిపోయింది. కాజల్ గ్లామర్ సినిమాకు ఏమాత్రం వర్కవుట్ అయ్యేలా లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పాపం.. కాజల్‌కే ఇలా ఎందుకు జరుగుతుంది?