AADIVAVRAM - Others

వినాయక వ్రతకల్పము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-శ్రీరస్తు-
(ముందుగా బొట్టు పెట్టుకొని, దీపారాధన చేసి, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించాలి)
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే॥
అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు
తదేవ లగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ,
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి॥
శ్లో॥ లాభస్తేషాం జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః॥
ఏషామిన్దీవర శ్యామో హృదయస్థో జనార్థ న ః॥
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్‌
(అని నమస్కరించుకుని ఆచమనం చేయాలి)
ఆచమ్య.. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా,
ఓం మాధవాయ స్వాహా
(మూడు సార్లు కుడిచేతిలోకి కొంచెం నీరు పోసుకొని చప్పుడు చేయకుండా తాగాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీ్ధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్థనాయ నమః, ఉపేన్ద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః.
(కుడి చేతిలో నీరు తీసుకొని కుడి చేతిమీదుగా ఎడమ వైపునకు చల్లాలి.)
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే,
ఓం భూః ఓం భువః ఓం జనః ఓం తపః, ఓగ్‌ంసత్యం, ఓం తత్సవి తుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ ఓమా పోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
ఓగ్‌ం సువః, ఓం మహః మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్యబ్రహ్మణః, ద్వితీయ పరార్ధే శే్వత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య..... ప్రదేశే కృష్ణా గోదావర్యౌః మధ్య దేశే.. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే చతుర్ధ్యాం తిథౌ, వాసరే, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్... గోత్ర... నామధేయః ధర్మపత్నీ సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య, శ్రీ సిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం, కల్పోక్త ప్రకారేణ యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. (నీళ్లను చేతితో తాకాలి)
తదంగకలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య.
(కలశమును నీళ్లతో ఉంచి అందులో పుష్పాలు, అక్షతలు, గంధమును వేసి కుడిచేతి ఉంగరపు వేలు అందులో మునిగేట్లుగా అరచేతితో మూయాలి)
కలశస్య ముఖేవిష్ణుః కంఠేరుద్రః స మాశ్రీతః,
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః,
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యుజుర్వేద స్పామవేదో హ్యథర్వణః,
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రీతాః,
ఓం... గంగేచైవ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య
(కలశంలోని జలాన్ని దేవునిపైనా, పూజాద్రవ్యాలపై చల్లాలి. తరువాత తమ మీద కొద్దిగా చల్లుకోవాలి. అనంతరం గణపతిని పూజించాలి.)
ఓం గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే
కవింక వీనా, ముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనశ్శృణ్వన్నూతిభిస్సీద సాధనమ్

శ్రీ మహా గణాధిపతయే నమః
ఏకదంతం శూర్ప కర్ణం గజవక్త్రం చతుర్భుజం,
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం,
భక్త్భాష్టప్రదం తస్మాత్ ధ్యాయే త్తం విఘ్న నాయకమ్!
(వినాయక ప్రతిమకు నమస్కరించాలి. పూజాక్షతలు తలపై వేసుకోవాలి).
ఆవాహయామి: శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః, ఆసనం సమర్పయామి, తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ :
వౌక్తికైః పుష్యరాగైశ్చ
నానా రత్నైర్విరాజితం,
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం
ప్రతి గృహ్యతాం (అక్షతలు వేయాలి)
అర్ఘ్యం: గౌరీ పుత్ర నమస్తేస్తు
శంకర ప్రియనందన,
గృహాణార్ఘ్యం మయాదత్తం
గంధ పుష్పాక్షతైర్యుతం!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.(ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)
పాద్యం: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణద్విరదానన!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి. (ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)
ఆచమనీయం: అనాథ నాథ సర్వజ్ఞ, గీర్వాణ పరిపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. (ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)
మధుపర్కం: దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక! అనాథ నాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి. (పాలు, తేనె, పంచదార, పెరుగు, నెయ్యి కలిపిన పంచామృతాన్ని సమర్పించాలి.)
స్నానం: గంగాది సర్వతీర్థ్భే్య అహ్నతైరమలైర్జలైః
స్నానం కరిష్యే భగవన్వుమా పుత్ర నమోస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
(ప్రతిమపై నీళ్లు చల్లాలి.)
వస్త్రం: రక్తవస్తద్వ్రయం చారు దేవయోగ్యం చ మంగళం
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః వస్తయ్రుగ్మం సమర్పయామి
(వస్తమ్రులు కానీ, లేదా పసుపుతో తడిపిన పత్తిని కానీ సమర్పించాలి)
యజ్ఞోపవీతం: రాజితం బ్రహ్మసూత్రం కాంచనం చోత్తరీయకం
గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానా మిష్టదాయక!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. (వినాయకునికి నమస్కరించి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
గంధం: చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతామ్!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.
(స్వామిపై గంధం చల్లాలి)
అక్షతాభరణం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలు చల్లాలి)
పుష్పం: సుగంధాని సుపుష్పాణి జాజీ కుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే! శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పుష్పాణి పూజయామి. (జాజి, మల్లె వంటి 21 రకాల సుగంధ పుష్పాలతో పూజించాలి.)
అథాంగ పూజ:
(పాదముల నుంచి శిరస్సు వరకు సర్వాంగాలకు పూజ చేయవలెను.)
ఓం గణేశాయనమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజాయామి, శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి; విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి; ఆఖువాహనాయ నమః ఊరూం పూజయామి; హేరంబాయ నమః కటిం పూజయామి; లంబోదరాయ నమః ఉదరం పూజయామి; గణానాథాయనమః నాభిం పూజయామి; గణేశాయ నమః హృదయం పూజయామి; స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి; స్కంధాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి; పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి; గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి; విఘ్న హంత్రే నమః నేత్రే పూజయామి; శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి; ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి; సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి; విఘ్న రాజాయనమః సర్వాణ్యంగాణి పూజయామి.
ఏకవింశతి పత్రపూజ
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అథైక వింశతి పత్ర పూజాంచ కరిష్యే (21 రకాల ఆకులతో పూజించాలి.)
సుముఖాయనమః మాచీపత్రం పూజయామి (మాచీపత్రం)
గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి(వాకుడు)
ఉమాపుత్రాయనమః బిల్వపత్రం పూజయామి(మారేడు)
గజాననాయనమః దుర్వాయుగ్మం పూజయామి(గరిక)
హరసూనవేనమః దత్తూర పత్రం పూజయామి(ఉన్మత్త)
లంబోదరాయనమః బదరీపత్రం పూజయామి(రేగు)
గుహాగ్రజాయనమః అపా మార్గపత్రం పూజయామి(ఉత్తరేణి)
గజకర్ణాయనమః తులసీపత్రం పూజయామి(తులసి)
ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి(మామిడి)
వికటాయ నమః కరవీర పత్రం పూజయామి
భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి(విష్ణుక్రాంత)
వటవే నమః దాడిమీ పత్రం పూజయామి(దానిమ్మ)
సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి(దేవదారు)
ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి(మరువం)
హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః జాజీపత్రం పూజయామి(జాజి)
సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి(ఏనుగు చెవి)
ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి(జమ్మి)
వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి(రావి)
సుర సేవితాయ నమః అర్జున పత్రం పూజయామి(మద్ది)
కపిలాయ నమః అర్కపత్రం పూజయామి(జిల్లేడు)
శ్రీగణేశ్వరాయనమః ఏకవింశతి పత్రాణి పూజయామి.
(మిగిలిన పుష్పాలన్నీ వేసి నమస్కరించాలి)
దూర్వాయుగ్మ పూజ
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
సర్వసిద్ధి ప్రణాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి
ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి
ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి
శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ
ప్రతి నామమునకు మొదట ‘ఓం’ అని, చివర ‘నమః’ అని చదువుతూ పుష్పములతో, పత్రితో పూజ చేయాలి.
ఓం గజాననాయ నమః, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ, వినాయకాయ, ద్వైమాతురాయ, ప్రజ్ఞనిధయే, ద్విముఖాయ, ప్రముఖాయ, సుముఖాయ, కృతినే, సుప్రదీపాయ, భవాత్మజాయ, శృంగారిణే, ఆశ్రీతవత్సలాయ, శ్రీఘ్రకారిణే, శాశ్వతాయ, బ్రహ్మచారిణే, సురాధ్యక్షాయ, విశ్వదృశే, విశ్వరక్షాకృతే, మహా బలాయ, పూష్ణే, హేరంబాయ, లంబజఠరాయ, హ్రస్వగ్రీవాయ, మహావీరాయ, దన్తినే, మంగళస్వరాయ, ప్రమదాయ, విఘ్నకర్త్రే, విఘ్నహన్రే్త, విశ్వనేత్రే, విరాట్పతయే, అవ్యక్తాయ, కుంజరాసుర భంజనాయ, ప్రమోదాత్తాననాయ, మోదకప్రియాయ, శాంతిమతే, ధృతిమతే, కృతిమతే, కామినే, కపిత్థ్ఫలప్రియాయ, అప్రాకృతపరాక్రమాయ, సత్య దర్శినే, సంసారామ్బునిధయే, అగ్రగణ్యాయ, అగ్రగామినే, అగ్రపూజ్యాయ, మంత్రకృతే, చామీకరప్రదాయ, సర్వయన్రే్త, సర్వోపన్యాసాయ, సర్వవిద్యప్రదాయ, సర్వనేత్రే, సర్వసిద్ధి ప్రదాయకాయ, సర్వసిద్ధయే, పంచహస్తాయ, మహోదరాయ, మదోత్కటాయ, కుమారగురవే, అక్షోభ్యాయ, శ్రీపతయే, పార్వతీనందనాయ, ప్రభవే, పతయే, మహేశాయ, మణికింకిణీ మేఖలాయ, దివ్యాంగాయ, సమస్తదేవతామూర్తయే, సహిష్ణవే, సతతోత్థితాయ, విభూతికారిణే, జిష్ణవే, విష్ణవే, బ్రహ్మరూపిణే, విష్ణుప్రియాయ, భక్తజీవితాయ, జితమన్మథాయ, ఐశ్వర్యకారణాయ, జ్ఞాననిధయే, యక్షకిన్నర సేవితాయ, గౌరీసుతాయ, బలాయ, బలోత్థితాయ, గణాధిపాయ, గంభీరనినదాయ, సఖ్యై, వటవే, అభీష్టవరదాయ, భక్తనిధయే, భావగమ్యాయ, మంగళప్రదాయ, కళ్యాణగురవే, ఉన్మత్తవేషాయ, పరజితే, శత్రుజితే, సమస్త జగదాధారాయ, సర్వైశ్వర్యప్రదాయ, పురాణపురుషాయ, అక్రాంతచిదచిత్ప్రభవే, శ్రీవిఘ్నేశ్వరాయ, భక్తపారిజాతాయ, విఘ్నేశాయ, శ్రీసిద్ధివినాయకాయ, శ్రీమహాగణాధిపతయే నమః
ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్త్భ్యుం గృహాణ వరదోభవ
శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.
(గణపతికి ధూపము వేయాలి)
దీపం: సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాజ్యోతితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామిదేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాద్దివ్య జ్యోతిర్నమోస్తుతే!
శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః దీపం దర్శయామి. (దీపం చూపించాలి.) (

నైవేద్యం: సుగంధాన్ సుకృతాం శ్చైవమోదకాన్ ఘృత పాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవచ గణముద్గైః ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయ మేవచ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక
శ్రీ సిద్ధి వినాయక స్వామినేనమః, నైవేద్యం సమర్పయామి.
(నైవేద్యం సమర్పించాలి.
ఓం ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, (నైవేద్యాన్ని స్వామికి చేయి చూపుతూ సమర్పించాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి,
ఉత్తరాపోశనం సమర్పయామి,
హస్తౌ ప్రక్షాళయామి,
పాదౌ ప్రక్షాళయామి,
శుద్ధం ఆచమనీయం సమర్పయామి
(తాగుటకు, చేతులు కడుగుకొనుటకు నీళ్లు ఉద్ధరిణితో సమర్పించి, పళ్లెములో వదలాలి)
తాంబూలం: పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః, తాంబూలం సమర్పయామి.
( తాంబూలం ప్రతిమ దగ్గర ఉంచాలి.)
నీరాజనం: సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే
లక్ష్మీరాష్టస్య్ర యాముఖేతయా మాసంగ్‌ం సృజామహి
హిరణ్యపాత్రం మథోః పూర్ణందధాతి
మథవ్యో సానీతీ ఏకథా బ్రహ్మణ ఉపహరతి
ఏకథైవ యాజమాన ఆయుస్తేజో దధాతి
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి (హారతి ఇవ్వాలి)
మంత్రపుష్పం:
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన
వినాయకేశతనయ సర్వ సిద్ధిప్రదాయక
ఏకదంతైక వదన తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిమ్.
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.
అర్ఘ్యం: గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక
గంధ పుష్పాక్షతై ర్యుక్తం పాత్రస్థం పాపనాశనం.
శ్రీసిద్ధి వినాయక స్వామినే నమః పునరర్ఘ్యం సమర్పయామి.(నీళ్లు చల్లాలి)
ప్రదక్షిణ: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే..
పాపోహం పాపం కర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల
అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్షి గణాధిప
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
(మూడు సార్లు ప్రదక్షిణం చేసి స్వామివారికి నమస్కరించాలి)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
శ్రీ సిద్ధి వినాయక స్సుప్రీతస్సుప్రసన్నో వరదోభవతు.
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు లోకాస్సమస్తాస్సుఖినోభవంతు.
శ్రీ సిద్ధి వినాయక దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి.

విఘ్నేశ్వరుని కథ
సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరో త్పత్తియు, చంద్రదర్శన దోష కారణంబును తన్నివారణమును చెప్పసాగెను.
పూర్వము గజ రూపము గల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, ‘స్వామీ! నీ వెల్లప్పుడు నా యుదరమందే వసించి యండు’మని కోరెను. భక్తసులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కె దీర్ప గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంబుననుండెను.
కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగులననే్వషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్తుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, ‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి. ఇప్పుడు కూడా నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము’ అని విలపింప, శ్రీహరి యా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాది దేవతలందరి చేతను తలకొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసుర పురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా, గజాసురుండు విని, వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందునాడింప నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబులబోరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానంద భరితుడై ‘మీకేమి కావలయునో కోరుకొనుండు ఒసంగెద’ ననిన, హరి వానిని సమీపించి ‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనగొనుటకై వచ్చె. కావున శివునొసంగు’ మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడుగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయ మనకొనుచు తన గర్భస్తుండగు పరమేశ్వరుని ‘శిరస్సు త్రిలోక పూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’ మని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము దెలుప నాతడు నందిని ప్రేరేపించును. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా హరి ‘దుష్టాత్ముల కిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’ నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాను వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కి కైలాసంబున కతివేగంబున జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుపిండితో ఒక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నంది నారోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోనికేగెను.
అంత పార్వతీదేవి భర్తంగాంచి, ఎదురేగి, అర్ఘ్య పాద్యాదులచే పూజించె. వారిరువురును పరమానందమున ప్రియ భాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చె. అంతనమ్మహేశ్వరుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణంబు నొసంగి ‘గజాననుడు’ అని నామం బొసగె. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనియెను.
కొంత కాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అతడు మహా బలశాలి. అతని వాహనరాజము నెమలి. అతడు దేవతల సేవా నాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.
విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆ యాధిపత్యము తన కొసగుమనియు, ‘గజాననుడు మరుగుజ్జువాడు. అనర్హుడు. అసమర్థుడు గనుక ఇయ్యాధిపత్యము తన కొసంగు’ మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి.
శివుడు ఆకుమారులను జూసి, ‘మీలో నెవ్వరు ముల్లోకము లందలి పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యం బొసంగుదు’నని పరమేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబు నెక్కి వాయువేగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి,

ప్రణమిల్లి ‘అయ్యా నా అసమర్థత తామెరింగియు నిట్లానతీయ దగునే! మీ పాద సేవకుడను. నా యందు కటాక్షముంచి తగు నుపాయంబు దెల్పి రక్షింపవే’ యని ప్రార్థింప, మహేశ్వరుడు దయాళుడై, ‘సకృత్ నారాయణేత్యు క్త్యాపుమాన్ కల్ప శతత్రయం గంగానది సర్వ తీర్థేషు స్నాతో భవతి పుత్రక’ - ‘కుమారా! ఒకసారి నారాయణ మంత్రంబు పఠించు’ మనగా, గజాననుడు సంతసించి, అత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.
అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడు కోట్ల ఏబది లక్షల నదులలో కూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపముందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని, ‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు’ మని ప్రార్థించెను.
అంత నప్పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునకు విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వ దేశస్తులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, పాలు, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్ఠుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యె. బలవంతంబుగ చేతు లానిన చరణంబు లాకాశంబు జూచె. ఇట్లు దండప్రణామంబు సేయ గడు శ్రమ నొందు చుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె. అంత రాజదృష్టి సోకి రాలు కూడ నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లడల దొర్లెను. అతండును మృతుండయ్యె. పార్వతి శోకించుచు చంద్రుని జూచి, ‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుండు మరణించెను గాన, నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాపనిందల నొందుదురు గాక’ అని శపించెను.
ఋషిపత్నులకు నీలాపనిందలు
ఆ సమయంబున సప్త మహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్ని దేవుడు ఋషిపత్నులను చూచి మోహించి, శాప భయంబున అశక్తుడై క్షీణించుచుండగా, నయ్యది అగ్ని భార్య యగు స్వాహాదేవి గ్రహించి, అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషి పత్నుల రూపంబులు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె. ఋషులద్దానింగనుగొని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలే యని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషి పత్నులు చంద్రుని చూచుటచే వారి కట్టి నీలాపనింద కలిగినది.
దేవతలును, మునులను ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్ని హోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్త ఋషులను సమాధానపరచె. వారితో కూడ బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె.
అంత దేవాదులు, ‘ఓ పార్వతీ దేవీ! నీ శాపంబు లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు’ మని ప్రార్థింప, పార్వతి సంతసించి, ‘ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాద’ని శాపావకాశంబు నొసంగె. అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.
శమంతకోపాఖ్యానము
ద్వాపరయుగంబున ద్వారకావాసి యగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు, స్వామీ! సాయం సమయమయ్యె, ఈనాడు వినాయక చతుర్థి, పార్వతీదేవి శాపంబుచే చంద్రుని జూడరాదు గాన నిజ గృహంబున కేగెద శెలవిండు!’ అని పూర్వ వృత్తాంత మంతయు శ్రీకృష్ణునికి తెల్పి, నారదుడు స్వర్గ లోకమున కేగెను.
అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరూ చూడరాదని పురంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుండుగాన, తాను మింటి వంక చూడక గోష్టమునకు బోయి పాలు పితుకుచు, పాలలో చంద్రుని ప్రతిబింబమును జూచి, ‘ఆహా! ఇక నా కెట్టి యపనింద రానున్నదో’ యని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి, ద్వారక పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చెను. శ్రీకృష్ణుడాతనిని మర్యాద చేసి ‘ఆ మణిని మన రాజునకి’మ్మనెను. అతడది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిది. ఇట్టి మణిని ఏ మందమతియైన నివ్వడనిన, పోనిమ్మని శ్రీకృష్ణు డూరకొనెను.
అంత నొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి జనిన నొక సింహమా మణిని మాంసఖండమని భ్రమించి, వాని జంపి యా మణిని గొనిపోవుచుండగా, నొక భల్లూక మా సింగమును దునిమి యా మణిని గొనిపోయి తమ కుమార్తె కాటవస్తువుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి నాలించి, ‘కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి, రత్నమపహరించె’ నని నగరమున చాటె. కృష్ణుడది విని నాడు క్షీరమున చంద్ర బింబమును జూచిన దోష ఫలంబని ఎంచి దాని బాపుకొన బంధుసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా, నొక్కచోట ప్రసేన కళేబరంబును, సింగపు కాలి జాడలును పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను. ఆ దారి పట్టి బోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబు జూచి, పరివారంబు నచట విడిచి, కృష్ణుండు గుహ లోపలికేగి అచట బాలిక ఉయ్యాలపై కట్టబడి వున్న మణిని జూచి అచటకు బోయి, ఆ మణి చేతపుచ్చుకుని వచ్చుచున్నంత ఉయ్యాలలోని బాలిక యేడ్వదొడంగెను. అంత దాది, వింత మానిసి వచ్చెననుచు కేకలువేసెను. అంతట జాంబవంతుడు రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, నఖంబున గ్రుచ్చుచు, కోరల గొఱకుచు, ఘోరముగా యుద్ధము చేయ, కృష్ణుడు వానింబడద్రోసి, వృక్షముల చేతను, రాళ్ల చేతను, తుదకు ముష్ఠి ఘాతముల చేతను రాత్రింబవళ్లు ఎడతెగక ఇరువ దెనిమిది దినంబుల యుద్ధ మొనర్చ జాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి జెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారి యగు శ్రీరామచంద్రునిగా నెఱింగెను. ‘ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరమని ఆజ్ఞ మొసంగ నా బుద్ధి మాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలెనని కోరుకుంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితిరి. ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యెను. ప్రాణములు కడబట్టె. జీవితేచ్ఛ నశించె. నా అపరాధములు క్షమించి కాపాడుమ’ని ప్రార్థింప, శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపి, ‘్భల్లూకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుగొన నిటు వచ్చితిని గాన మణి నొసంగుము. నే నేగెద’నని జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తమ కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించి, కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి, పిన్న పెద్దలను జేర్చి యావద్వృత్తాంతమును చెప్పి శమంతకమణి నొసగిన నా సత్రాజిత్తు ‘అయ్యో! లేని పోని నింద మోపి దోషంబునకు పాల్పడితి’నని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపుమని వేడుకొనెను. శ్రీ కృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు శుభ ముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, ‘మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి’ యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై, ‘్భద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదంబున చంద్ర దర్శన మయ్యెనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతక మణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనింద నొందకుండెదరు గాక!’ అని ఆనతీయ, దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగిరి. ఇట్లు సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష ప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.
‘సర్వేజనాస్సుఖినోభవంతు!’ *