సబ్ ఫీచర్

ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా స్థానిక పరిస్థితులకు ఉద్యోగులకు ఉపయుక్తమైన సర్వీసు నిబంధనలను మార్చడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయి. బ్రిటీష్ పాలకులు తమ దమననీతితో, విభజించి పాలించడానికి తమకు వంతపాడే ఉద్యోగులను, అధికారులను అందలాలు ఎక్కిస్తూ అన్యాయాలను ప్రతిఘటించే ఉద్యోగులను, అధికారులను క్రమశిక్షణ కేసుల పేరుతో నిరంకుశంగా అణగదొక్కేవారు. మరి అప్పటి విధానాలతో నిరంకుశంగా రూపొందించబడి నేటికి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుత స్థానిక పరిపాలనా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేపట్టాలి.
ఒక్కో శాఖకు ఒక్కో సర్వీసురూల్స్ ఉన్నాయి. అన్ని శాఖల ఉద్యోగులకు కామన్ సర్వీసు రూల్సు వర్తింపజేయల్సిన అవసరముంది. విశ్రాంత ఉద్యోగుల పింఛను విధానంలో కూడా వారికి ఇబ్బందులు లేకుండా సంస్కరించాలి. ఉద్యోగుల సర్వీసు రూల్స్‌లో ముఖ్యమైన క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీలు రూల్స్ సీసీఏ నిబంధనల్లో మార్పులు చేయాలి. సబార్డినేట్ సర్వీసురూల్స్, గెజిటెడ్, సర్వీసు రూల్స్, లాస్ట్‌గ్రేడ్ సర్వీసు రూల్సు, ఫండమెంటల్ సర్వీస్ రూల్స్, లీవ్ రూల్సు, ఎల్.టి.సి, తదితర నిబంధనలన్నింటినీ మరింత సరళీకృతం చేయాలి. ఉద్యోగులకు ప్రస్తుతం 32 రకాల వేతన విధానాలు అమల్లో ఉన్నాయి. వీటన్నింటిని సవరించి క్యాడర్ వారీగా అన్ని శాఖల్లో ఒకే విధమైన వేతన విధానాన్ని అమలుచేయాలి. జాతీయ స్థాయిలో ఐ.ఎ.ఎస్, ఐ.ఆర్.ఎస్, ఐ.ఎఫ్.ఎస్. స్థాయి ఉద్యోగులకు ఒకే విధమైన నిబంధనలు అమలులో ఉన్నట్లుగానే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉద్యోగులందరికీ క్యాడర్‌వైజ్‌గా ఏకీకృత నిబంధనలను అందుబాటులోకి తేవాలి.
సర్వీసు రూల్స్‌లో అస్పష్ఠత, అసంబద్ధమైన అంశాలు, ఇతరత్రా ఉండడంతో కోర్టు కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. అత్యధిక శాఖల్లో పదోన్నతులు నిలిచిపోయాయి. క్రమశిక్షణ కేసులు ఏళ్ళతరబడి పరిష్కారం కాకపోవడంతో సంబంధిత ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతూ రోగాల బారినపడుతున్నారు. సర్వీసులో ఉన్నవారు పదోన్నతులు కోల్పోతుండగా, పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను సరళతరం చేస్తామంటూ ప్రకటించి 2015 జూన్ మాసంలోనే కొత్త సర్వీసు రూల్స్‌కోసం సీనియర్ ఐఎఎస్ అధికారి రాజేశ్వర్‌తివారీ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీచేసినప్పటికీ ఇంకా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఎలాంటి పురోగతి కానరావడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇకనైనా ఉద్యోగులందరికీ ఉపయుక్తమైన సర్వీస్ రూల్స్‌ను ప్రవేశపెట్టి, ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొనాలి. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను మార్చడం ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగింది. ఇరు రాష్ట్రాల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఐక్యతతో తమ సర్వీసురూల్సులో సంస్కరణలకోసం ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులను చైతన్యం చేయాల్సిన బాధ్యత ఉంది. దీనికోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలి.

- హరి అశోక్‌కుమార్ సెల్: 9440463498