వీరాజీయం

‘బే’కారుగాళ్లే నయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొంత కార్లున్న వాళ్లకి పార్కింగ్ సమస్య. సొంత కుక్కలున్న వాళ్లకి వాటి బార్కింగ్ సమస్య. మామూలు నగరాలకే రుూ సమస్య వుంటే- ఘనత వహించిన మన మహారాజధాని ఢిల్లీకి యిది సమస్య కాదా? అంటే మోటారు శకటాల రాపిడికి సంబంధించి- యిది యింకా చిక్కు సమస్య.
అలనాటి హస్తినాపురియే నేటి ఢిల్లీ మహానగరి. అది ప్రపంచంలో చైనా నగరం బీజింగ్‌ను కూడా మించిపోయిన ‘‘మహాకాలుష్య భయంకరం’’. మానభంగాలే కాదు ట్రాఫిక్ చిక్కులక్కూడా ప్రపంచ ప్రసిద్ధి. కార్లు ఒక దగ్గర ఆగిపోయాయనుకోండి- వాటి ‘టాపు’ల మీదనుంచి కాలు క్రిందపెట్టకుండా ‘మనం’(అంటే సాహసులు)- అవతలి వేపుకి వెళ్లిపోవచ్చును. అర్జంటు పనులకీ, ఆఫీసులకీ, సచివాలయానికీ కూడా కారున్నవాడికన్నా ‘బే’కారువాడే ముందు చేరుకుంటాడు.
అలాంటి డేంజరస్ స్మాగ్, ఫాగ్ ఫ్లస్ మోటారు శకట థూమం-అపారంగా వుంటున్న సదరు నగరంలో పాలన అంతా ‘క్రేజీవాల్’(సారీ మెలోప్రాపిజం-అంటారు దీన్ని) ‘కేజ్రీ’వాల్‌గారి బుర్రలో వుంటే పోలీసు బలగాలు మాత్రం- హోంమంత్రి రాజనాధ్‌గారి కనుసన్నలలో వుంటాయి.
అసలు నిన్నటికీ, యివాల్టికీ పాలనలో తేడా చూపెట్టగల అరవింద్‌గారు ఆధునిక స్టంటు సినిమా హీరోలాంటివాడు. ఒకేసారి ప్రయిమ్ మినిస్టర్‌గారితోనూ ఫైనాన్స్ మినిస్టర్‌గారితోనూ, ఐ.ఏ.ఎస్. బాబులతోనూ బాహాబాహీ, కచాకచీ పోరాటం చేయగలడు. నా దృష్టిలో హీరో- జనవరి ఫస్టునుంచి ఢిల్లీ కాలుష్యాన్ని కార్ల విడీవిడని చిక్కుల్నీ వొక్కదెబ్బతో పరిష్కరించాలీ అనుకున్నాడు అంతే! మహానగరం ఢిల్లీలో మోటారు శకటాలు (ద్విచక్ర వాహనములు కూడా) రోజువిడిచి రోజు మాత్రమే రోడ్డెక్కాలి. దీనికో తమాషా ఫార్ములా వుంది. అందులో మళ్లీ ‘మీ’కారు రిజిస్ట్రేషన్ నెంబరు చివరి రెండంకెలు కూడితే సరి సంఖ్య వస్తే మీరు సరిసంఖ్యగల వారంనాడు రోడ్డెక్కాలి. అలాకాకుండా రోడ్డెక్కావో రెండువేల రూపాయల జరిమానా కక్కాలి. ఈవిధంగా చేస్తే (బేసి, సరి ఫార్ములాతో) తొంభై లక్షల మోటారు శకటాలున్న ఈ గ్రేటర్ సిటీలో పదినుంచి పదిహేను లక్షల కాలుష్య రథాలకు విశ్రాంతి ఒక్కో రోజు లభిస్తుంది- ఈ పద్ధతిని 2008లోనే దారుణ మారణకాలుష్య నగరం బీజింగ్‌లో అమలుచేశారుట. దీనికో పేరుంది. ‘రోడ్డు స్పేసింగ్ రేషనింగ్’ అంటారుట. కాకపోతే అరవింద్ కేజ్రీవాల్‌గారి జీనియస్ ఐడియాలకి- ‘సరిరారు- ఎవ్వరూ రుూ ఇలన్- అని తెల్సుగా? వి.వి.ఐ.పి.లకు రుూ ‘‘రోజువారీ’’ రూలు వర్తించకపోయినా తాను, తన మంత్రివర్గం కూడా రుూ ‘‘ట్రాఫిక్ రోడ్డు రేషనింగ్’’ పాటించి జనాలకి ఆదర్శంగా నిలుస్తాం- అన్నాడు. ఆమ్‌ఆద్మీపార్టీ అంటే అదే కదా అర్థం! ముఖ్యమంత్రి ‘కారు పూలింగ్’ అంటే వంతులవారీగా ఓ కారుని నలుగురు పంచుకుని కార్యాలయాలకి జమిలిగా వెళ్తారు. స్టీలు సిటీ కాలనీలలో ఉద్యోగులు యిలా చేస్తారు.
ముఖ్యమంత్రిగారు- ‘‘మంత్రులు గోపాల్‌రాయ్, సత్యేంద్ర జైన్‌లతో కలిసి ఒకే కారు ఎక్కి కార్యాలయం చేరుకుంటాను’’అన్నారు. (ప్రోటోకాల్ గోవిందా!) అలాగే కేజ్రీవాల్ కారు నెంబరు ‘బేసి’ సంఖ్య గలది కనుక ఆయన శుక్రవారంనాడు- ఆ యిద్దరు మంత్రులకి ‘లిఫ్ట్’ యివ్వడంతో హ్యాపీ న్యూయియర్ మొదలుపెట్టాడు.-
ఇతనికన్నా ఘనులున్నారు ఆయన మంత్రివర్గంలో. సాంస్కృతిక శాఖామాత్యుడు కపిల్ మిశ్రాగారు- ‘‘సైకిల్ ఎక్కగలనూ- దానిపై ఆఫీసుకి చేరగలనూ’’ అన్నాడు. ‘‘నాకు సైక్లింగ్ రాదు, నేను ‘‘ఆటోమేఁజావూంగా’’- అన్నాడు పర్యావరణ మంత్రి- ఇమ్రాన్‌హుస్సయిన్‌జీ. ‘‘లాభం లేదు- నేను బస్సులో పోతాను లెండి’’- అన్నాడు మరో మంత్రివర్యుడు- సందీప్‌కుమార్.-
ఐతే, ఒంటరిగా కారు తోలుకుంటూ పోయే మహిళామణులకీ, అంబూలెన్సులకీ ‘మినహాయింపు’వుంది. అంటే లేడీ డ్రయివర్లని పెట్టుకోవచ్చా? అనకండి. ఈ రూల్సు అమలుచేయడానికి అదనపు బలగాల్ని వారికి తోడుగా- 7,500 మంది సుశిక్షితులయిన వాలంటీర్లని కూడా పెట్టారు. అసలు రుూ పొల్యూషన్‌కి కారణమైనవి పాత కార్లు- వాటిని పాత సామానుల క్రింద (స్క్రాప్) డొక్కుకార్ల అమ్మేసెయ్యమన్నారు. ఏలినవారు.
ఢిల్లీ నగరం పట్టపగలే- ‘‘కారుమేఘాల’’తో నిండి వుంటుంది- అంటే హైద్రాబాదీయులు నమ్ముతారు. మన రేపటి విశ్వనగరంలో కూడా ఆటోలు గమనించండి. బుస్సు బుస్సున తోకల్లోనుంచి పొగలుక్రక్కే త్రిచక్ర వాహనాలు మన ముక్కులు మూయించేస్తూనే వుంటాయి. (నో ఆస్కర్ నో, టెల్లర్) మరి హైబాకే యింత ‘‘పొ’’గరుంటే- మరి ఢిల్లీకి యింకెంత ‘‘పవ’’రుండాలి?
పెట్రోలు బంకులవాళ్లు గోల, ధర్నాలు, బంద్‌లు మొదలు గానీ కేజ్రీవాల్‌గారి దగ్గర ఆ పప్పులుడకవ్. తానే బంకుల ముందు- ముందరి కాళ్లకి బంధంగా ప్రదర్శనలిస్తాడు బివేర్!
పొల్యూషన్‌కి సొల్యూషన్‌గా తంటాలు పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రికి కేంద్రం సాయంచేస్తుంది. లేకపోతే, ‘పిల్’కోర్టులో కొట్టేస్తుందా? కాకపోతే రుూ మనకంటే ఘనులున్నారు బిహార్ మంత్రివర్గంలో- ఇంకెవరుంటారు? లల్లూప్రసాద్‌యాదవ్‌గారి తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవుడున్నాడు ఆరోగ్యమంత్రిగా. ‘‘కాలుష్యం కోరలు’’ పీకేస్తాను. ఆఫీసుకి గుఱ్ఱంమీద నేను వెళ్తాను’’- అంటూ పాట్నా రోడ్లమీద అశ్వారూఢుడై విజృంభిస్తున్నాడు. పోనీ, ‘‘సైకిల్ ఎక్కవయ్యా!’’అంటే- ‘‘అమ్మో! అది మరో పార్టీ సింబల్. దానె్నలా వాడుకుంటాం?’’ అంటున్నాడుట.
వైనాట్ రోడ్ రేషనింగ్ ఫర్ హైద్రాబాద్?