సబ్ ఫీచర్

స్వచ్ఛ భారత్‌కు దారేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘స్వచ్ఛ్భారత్’’ పదం దాదాపు సంవత్సర కాలంనుండి వింటున్నాం. పదం వినే దానికి స్వచ్ఛంగా, అందంగా వుంది. అమలుకు మాత్రం ఆమడదూరమన్నది అక్షర సత్యం. స్వచ్ఛ్భారత్ ముందుకు సాగలేక చతికిలపడిందెందుకు? అని మనం లోతుగా ఆలోచిస్తే, ‘కర్ణుని చావుకెన్నో కారణాలు’గా విఫల కారణాలు కనిపిస్తాయి. స్వచ్ఛ్భారత్ విషయంలో ఎవరికివారు నాకెందుకు అనేలా ప్రవర్తిస్తున్నారన్నది వాస్తవం. చిత్తశుద్ధి లోపం పుష్కలం. రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, సినీ కళాకారులు, వ్యాపారవేత్తలు అలా అందరూ మీడియా ముందు చిరునవ్వుతో తెగ కష్టపడుతున్నట్లు నటించడం అంటే చీపురు పట్టుకుని బుల్లితెరపై కనిపించే ప్రయత్నమే తప్ప మరోటి కాదు.
చీపురు లేదా గంప పట్టుకుని మాంచి భంగిమలో ఫొటోలు దిగడమే ‘స్వచ్ఛ్భారత్’కు స్వచ్ఛమైన అర్ధంగా భావించి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆరంభ శూరత్వమే తప్ప ఇందులో నిజాయితీ మచ్చుకైనా లేదన్నది వాస్తవం. మీడియావాళ్లు వచ్చేసరికి నాయకులు ఎ.సి.గదులలో హాయిగా వుండి, వారు రాగానే, ముందుగానే నాలుగు కాగితపు ముక్కలు, వారి ఆరగించి పారవేసిన అరటి తొక్కలు, బిస్కెట్ పాకెట్ కవర్లను పొరక పట్టుకుని పది సెకన్లు వూడ్చడం, మరో నాయకుడు వంగి అవి గంపలో వేయడంతో స్వచ్ఛ్భారత్‌గా క్లీన్ ఔతుందా? మా పనులు మాకుంటే ఈ ‘స్వచ్ఛ్భారత్’ గోలేంటి అనుకునేవారు కొందరు. కంపుకొట్టే చెత్తాచెదారం ఎలా ఊడ్చాలనేవారు మరికొందరూ, చిరునవ్వుతో పొరక ఫోజుపెట్టి ఫొటోదిగితే మన వెర్రి అభిమానులు, ప్రజలు నమ్మరా ఏంటి అనుకునేవారు కొందరు. అలా ఎవరికి తోచిన అభిప్రాయం వారికుంటే స్వచ్ఛ్భారత్ సాధ్యమేనా?
మరోవైపు ప్రభుత్వం ‘స్వచ్ఛ్భారత్’కు ప్రచారకర్త పలానావ్యక్తి అని ప్రకటించడం చూస్తుంటే నవ్వురాక మానదు. పాపం ఆ ప్రచారకర్త స్వచ్ఛ్భారత్‌కోసం అట్టహాసంగా బయలుదేరడం ఆలస్యం లేకుండా ‘రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు, అభిమానులు, పోలీసులు, మీడియా’వారు పరుగులతో వెళ్లడం, కరచాలనాలు, నమస్కారాలు, హస్తం (బైబైలా) కదలించడం లాంటి వాటిమధ్య చీపురు ఫొటోలు దిగి కారెక్కి వెళ్లడం చూస్తుంటే ప్రచారకర్త బాధ్యత యిదేనా అనిపిస్తుంది? స్వచ్ఛ్భారత్ విషయంలో ప్రజలకు అవగాహనంటూ లేదు. ఇల్లు- పరిసరాలు కంపుకొట్టడం కాల్వలోవేయడం లేదా రోడ్డుపైవేయడం చూస్తు న్నాం. నాలుగైదు నివాసాల మధ్య ఇల్లు నిర్మించని ఖాళీ స్థలముంటే చాలు చుట్టుప్రక్కల వారంతా ఆ స్థలాన్ని దిబ్బలా మార్చేస్తున్నారు. కాలువల్లో పిల్లలను మల విసర్జనకు కూర్చోబెడ్తున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే చాలు యూజ్ అండ్ త్రో ప్లేట్లు, గ్లాసులు, పొట్లాలు, అరటితొక్కలు సమస్తం కాల్వలోకే. నాలుగడుగులు వేసి మున్సిపల్‌వారు ఏర్పాటుచేసిన చెత్తకుండీ వరకు నడవరు. విజిల్ వేస్తూ వచ్చే పారిశుద్ధ్య కార్మికులు వచ్చేసరికి చెత్త నడి రోడ్డుపై పారవేసి వుంటారు. నగరాలలో నిజంగా సందుగొందుల వెంట వెళితే టన్నులకొద్ది చెత్తాచెదారం కనిపిస్తుంది. హోటళ్లు, ఆసుపత్రులు, ఆఫీసులు అలా ఎటుచూసినా చెత్త దర్శనమిస్తూనే వుంటుంది. మరి స్వచ్ఛ్భారత్ సాధ్యమేనా?
కొబ్బరి బొండాల వ్యాపారులు, కోడిమాంస విక్రయదారులు, పండ్ల వ్యాపారులు నగరాలను భ్రష్టుపట్టిస్తున్నారు. ఖర్చయిపోయిన కొబ్బరి బోండాలను చీకటి పడకానే ఎక్కడపడితే అక్కడ పారవేసి వెళ్తున్నారు. కోడి మాంస విక్రయదారులు చీకటి పడగానే మిగిలిన వ్యర్థాలను మూటలుకట్టి ఎక్కడ స్థలం కనిపిస్తే చాలు అక్కడ పారవేసి వెళ్తున్నారు. లారీలలో పండ్ల లోడు దించడం వున్న కొమ్మలు, రెమ్మలు, గడ్డి, ఆకుల చెత్తను వూరి పొలిమేరల్లో వదిలివెళ్తున్నారు. వివాహ మంటపాలవారు భోజన తంతు ముగిసిన వెంటనే ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, కవర్లు అలా అన్ని బయటపారవేస్తున్నారు. మరి మనకు స్వచ్ఛ్భారత్ వస్తుందంటారా? ఇది తప్ప అని మనం చెప్పం, చెప్పినా వినే బుద్ధిమంతులు లేరు. అసలు పర్యవేక్షకులంటూ ఎవరున్నారు? ఎవరికివారు మనకెందుకులే అని అనుకుంటున్నాము. అందుకే మనకు పుట్టెడు రోగాలు, అకాల మరణాలు. నిజాయితీగా ఎవరి బాధ్యతవారు నిర్వర్తిస్తే అప్పుడు మన దేశం స్వచ్ఛ్భారత్ ఔతుంది.

- మురహరి ఆనందరావు