వీరాజీయం

అమెరికన్ కూల్‌డ్రింకులకు చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బ! ఎండాకాలం వచ్చేస్తోంది.. వచ్చేసింది..’’ అనకూడదు. కాస్త మాడ్రన్‌గా అనాలి అంటే- ‘‘ఓ గాడ్! సమ్మరొచ్చేసింది!’’ అనాలి. ఇకనేం? ‘‘వేస్కో కోకోకోలా!’’ అని ఒకడనగానే- ‘‘లేదు దానికి వేళాపాళా’’ అనాలి అతవలివాడు.
కోకోకోలాకీ, పెప్సీకి సినిమా స్టార్‌లు, క్రికెట్ నక్షత్రాలు వగైరాలు- కోర్టుల దెబ్బకి భయపడి దూరమైపోయారు. కోకోకోలా, పెప్సీలలోనే అమెరికాని చూసుకుని మురిసిపోయే కుర్రకారుకీ, పెద్దకారుకీ కూడా ‘కోక్’లోనే ‘ఓక్ డోక్’ వచ్చేస్తోందీమధ్య- దీనికో సోషల్ కాజ్‌కన్నా పర్సనల్ రీజన్ వుంది. ఇటీవల ఇంట్లో ‘‘ముఖప్రక్షాళనకై సంపు తగిలించిన గోడ గాజుపాత్ర’’, సారీ! బాత్‌రూమ్‌లో వాష్‌బేసిన్‌కి బిరడా పడిపోయింది. సదరు గొట్టానికి లోపల ఏదో అడ్డంపడిపోయింది. ‘‘ఆంఫట్ యూ ట్యూబ్ మహాశయా! ఏమి మార్గము?’’ అనడిగేసరికి- ఆరడుల పొడగరి అయిన ఓ అమెరికన్ వచ్చాడు. డ్రయినేజీ బ్లాకయిపోతే, కోక్ బాటిల్- అదే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బాపతు పెద్ద సీసా చేతబట్టిన ఆ పెద్దమనిషిని ఆశగా చూస్తే- ‘‘వ్యాఖ్యాన ప్రచవనం’’ మొదలెట్టాడు. కోక్‌బాటిల్ ‘మరబిరడా’ యిప్పి, దాన్ని అంటే బాటిల్‌ని ఏటవాలుగా వంచి- బేసిన్‌లోకి ‘లొడలొడా’ వొంపేశాడు. అమెరికన్స్ అంతే మరి- రిచ్‌ఫెల్లోస్ కదా? ఐతే లొడలొడా సదరు గులాబీ మెరపుగల నల్లద్రవం- లోపలికి పోకపోగా ఎదురుతన్నింది-
‘‘మేము టాయిలెట్ క్లీనింగ్ అనగా శుభ్రపరచుటకు యిదే వాడతాం’’అన్నాడు.
‘‘ఐసీ! ఓక్ డోక్’’ అంటూ వాష్‌బేసిన్‌మీద అద్దంలో మొహం చూసుకుంటే అది డబుల్ ఏక్షన్ చేస్తోంది. అలాగా కోకోకోలాతో డ్రయినేజీ పూడికని వదిలించి ‘డింగ్’మని పోయాడా అమెరికనుడు.
‘‘ఐతే, నాటినుంచీ నిన్నమొన్నటిదాకా మన ‘సెలిబ్రిటిస్’ అందరూ వారి వారి స్టంటులలోని విజయ రహస్యం చెబుతూ చెలరేగిపోయిందీ రుూ కోకోకోలా నాలా తీర్థానికా?’’ అనుకుంటూంటే- కూల్‌డ్రింకులమీద వాష్‌బేసిన్ వైరాగ్యం వచ్చేసింది. కానీ, రుూమధ్య కోకోకోలా, పెప్సీల మీద జల్లికట్టు వీరులకి కూడా మిక్కుటమగు ఆగ్రహం కలిగింది. కోకోకోలా, పెప్సీ కంపెనీలు అమెరికన్ కంపెనీలు! ఔనా? ‘ట్రంపు’మీద కోపం కూడా మిళాయించారో ఏమో? తెలియదుగానీ- మొన్న బుధవారం తమిళనాడులోని వర్తక సంఘం ఆధ్వర్యంలో కోకోకోలా, పెప్సీలను అమృతధారల పానాన్ని బాయ్‌కాట్ చేస్తున్నాం’’ అని వర్తకులలో ఎక్కువమంది ప్రకటించారు. ‘‘నో పెప్సీ, నో కోక్... ‘పెప్సీ ఇళ్లే’, ‘‘కోకోకోళా కడియాడు’’ అంటూ బోర్డులు పెట్టేశారు- రైతుబజారులో కూడా-
పాపం! పెప్సీ కంపెనీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీమతి ఇందిరా నూరుూ గారి సొంతవూరు- చెన్నై మహానగరమే. వ్యాపార ఉత్తేజకారక దోహద ప్రచారం కోసం ఆమె అమెరికానుంచి వచ్చి ఇండియాలో మకాం కూడా వేసి వున్నది.
తమిళనాడులో పారిశ్రామిక అభివృద్ధి వాడలో గత శతాబ్దంలోనే, చివరగా- కోకోకోలా, పెప్సీ కంపెనీలకి బోలెడన్ని ఎకరాల స్థలం- గవర్నమెంట్ ‘స్వల్ప’్ధలకి సుదీర్ఘకాల ప్రాతిపదికన ఇచ్చింది. అంతేనా? తిరునవ్వేళి, తుత్తుకుడి జిల్లాల్లో ప్రవహించే జీవనది ‘తామరబరణి’లోనుంచి పెప్సీ కంపెనీకి రోజుకో పదిహేను లక్షల లీటర్ల జీవజలాలు కోకోకోలా కంపెనీకి రోజుకో తొమ్మిది లక్షల లీటర్ల ‘సస్యామృతాలు’ అనదగ్గ మంచినీళ్లు ‘ఎత్తు’కోడానికి ధారాళంగా- అతి తక్కువ అంటే కారుచౌక ధరలకి ధారాదత్తం చేశారు త.నా. గవర్నమెంటువారు.
రైతుల గోల అప్పుడే మొదలైంది. కాటకం రానీ, నీటి ఎద్దడి రానీ, ‘తామరబరణి’ నదిలో నుంచి వో పెద్ద దిగుడుబావి తవ్వి మరీ నీళ్లు లాగించేసుకోవమన్నది గవర్నమెంట్. ఈ నదిలో నీళ్లు ఎండవు. ఎన్నో ఉపనదుల సంగమం ఆయకట్టు కూడా చాలా పెద్దది. కానీ, రైతులకి ఎగనాబం పెట్టి జనాలమీద కోకోకోలా, పెప్సీ మత్తుద్రవాల్ని జల్లి- సొమ్ములు కోట్ల రూపాయల లాభాలు చేసుకుంటున్నారు. కావున నదీమ తల్లి జలాల మీద ఆంక్షలు విధించాలి’’ అన్న ఆందోళన- దాని దారిన అది ప్రవహిస్తూనే వుంది. తామరబరణి నది 128 కిలోమీటర్ల మేర దాని మానాన అది ప్రవహిస్తూనే ఉంది. కానీ అటు రైతులు, యిటు వర్తకులు కూడా కోక్ ద్రవాల కంపెనీలమీద గుర్రుగానే వుంటున్నారు. ఈలోగా మొన్న గురువారంనాడు తమిళనాడు హైకోర్టు నీటి సరఫరామీద ఆంక్షని ఎత్తేసింది. ఇద్దరు గడుసు అడ్వొకేట్లు ‘పిల్’ కొట్టారు కానీ, క్రింది కోర్టు గత నవంబర్‌లో ఇచ్చిన తీర్పుని హైకోర్టు ధర్మాసనం ఎత్తేసింది. కోర్టు ముందు సర్వశాస్త్రాలు కేసుని సరిగ్గా వివరించలేదనీ, సాక్ష్యం సమగ్రంగా లేదనీ- చాలా కంపెనీలు నదీ జలాల్ని కొల్లగొట్టుతూ వుంటే, రుూ రెండు అమెరికన్ ద్రవాలేనా ......... అన్నది ఏలినవారి ప్రశ్న. అయినా లోకల్ కూల్‌డ్రింకులు కాస్తో, కూస్తో లాభాలు చేసుకుని సుఖపడాలన్న వాదంతో - వర్తక సంఘం ‘బాయ్‌కాట్’ ఉద్యమానికి దిగింది. డెబ్భైశాతంమంది వర్తకులు బాయ్‌కాట్‌కే మొగ్గుచూపెడుతున్నారు.
కోక్ కంపెనీలు ఒక ఐదు బాక్సులు సీసాలు తీసుకుంటే మరో ఐదు పెట్టెల కూల్‌డ్రింక్స్ ‘ఫ్రీ’ అంటున్నారు. విషం అయినా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ- అంటే ‘చిత్తం ఇలా పడేయండి’ అని పైసలు పైకి తీస్తున్న అమాయక వినియోగదారులున్న మాయదారి కాలం యిది.
కాకపోతే, ఈ రెండు డ్రింకుల పరిశ్రమలమీద త.నా.లో హిందుస్తాన్ కోకోకోలా, పెప్సీ కంపెనీలుగా ముంది విశేషణాలు తగిలించుకొని ‘రిజిస్టర్’ అయిన రుూ కంపెనీలుగా వున్నాయి. రెండువేలమందికి ప్రత్యక్షంగానూ ఉద్యోగాలు కల్పించి పరోక్షంగా మరో ఐదు వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి రుూ గ్రేట్స్ అన్నది ప్రధానమైన వాదన.
ఈ ‘కో-పె’ ద్రవాలకి- చిన్నా చితకా కలుపుకుని ఐదు లక్షలమంది అమ్మకందార్లున్నారు. 400 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు సాగుతున్నాయట సాలీనా. లోకల్‌గా ‘బోవోన్టో’, ‘ట్రయో’, ‘సోలో’, ‘ప్రూంటాంగ్’, ‘మాపిళ్లై’, ‘తోరిణ్’ లాంటి చోటా డ్రింకులు- పెళ్లిళ్ల సీజను, ఎండాకాలం కూడబలుక్కుంటాయి కనుక బాగా అమ్మకాలు పుంజుకుంటున్నాయి అని.. ఇప్పుడు ఈ బోయ్‌కాట్ ఉద్యమం ముందుకు సాగితే చెన్నైలోనే ‘బోయ్‌కాట్ కోక్’ ఆందోళన ఎక్కువగా రావడంతో డి.ఎమ్.కె, అన్నాడిఎంకెలు అంటే స్టాలిన్, శశికళలు ఏవైపు కమ్ముకొస్తారో- పోస్టర్లు వగైరా చూస్తేకానీ తెరియాదు. ట్రంప్‌గారి పేరెట్టి స్లోగన్స్ పేల్చితే ఇంకా బెటరేమో?
ఎనీవే.. ఎనీ టైమ్ రుూజ్ కూల్‌డ్రింక్స్ టైమ్ నౌ!
*