సంపాదకీయం

హిందుత్వానికి ‘సుప్రీం’ భాష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందుత్వం భారత జాతీయ వౌలిక ఆస్తిత్వమన్న సనాతన వాస్తవాన్ని సర్వోన్నత న్యాయస్థానం ధ్రువీకరించినట్టయింది! ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా దేవాలయాలలో అర్చకులను నియమించడం ‘సమానత్వ’ సూత్రానికి భంగకరమా? కాదా? అన్న వివాదంపై బుధవారం తీర్పు చెప్పిన సర్వోన్నత న్యాయమూర్తులు రంజన్ గగోయి, ఎన్.వి.రమణ హిందుత్వం గురించి ఇచ్చిన వివరణ చారిత్రక వాస్తవాలకు అనుగుణంగా ఉంది! ఈ దేశంలో శతాబ్దుల తరబడి వికసించిన సమష్టి విజ్ఞానం, సమష్టి ప్రేరణ హిందుత్వమన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రస్తావించారు! హిందుత్వ సనాతన-శాశ్వత-తత్త్వాన్ని న్యాయమూర్తులు ఉటంకించడం హిందుత్వం గురించి జరుగుతున్న వక్రీకరణలను, భ్రమలను, భ్రాంతులను దూరం చేయడానికి దోహదం చేయవచ్చు! హిందుత్వం సర్వమతాల సంపుటమన్నది ఈ దేశపు జాతీయతా వికాసక్రమానికి భూమిక! హిందుత్వ భూమికపై యుగయుగాలుగా అనేకానేక వైవిధ్యాలు వికసించాయి. హిందూ జీవన సమష్టి స్వభావంలో ఈ వైవిధ్యాలన్నీ భాగమయ్యాయి! మత వైవిధ్యాలు, భాషా వైవిధ్యాలు, సంప్రదాయ వైవిధ్యాలు, విజ్ఞాన వైవిధ్యాలు, ఆలోచనా వైవిధ్యాలు-ఇలా అసంఖ్యాక వైవిధ్యాలు హిందుత్వ వికాసంలో ప్రస్ఫుటించడం జాతీయ చరిత్ర! హిందుత్వం ఏ వైవిధ్యాన్ని కూడ బహిష్కరించలేదు, వ్యతిరేకించలేదు, సమష్టి సమాజం నుండి విడగొట్టలేదు! అన్ని వైవిధ్యాలను అనాదిగా తనలో ఇముడ్చుకుని పెంపొందించిన జాతీయ వౌలిక అస్తిత్వం హిందుత్వం! న్యాయమూర్తులు తమ తీర్పులో హిం దుత్వం గురించి చేసిన స్పష్టీకరణ ఈ వౌలిక అస్తిత్వానికి మరో భాష్యం.... ‘‘హిందు త్వం... అన్ని వైవిధ్య విశ్వాసాలను తనలో ఇముడ్చుకుని ఉంది, ఓ పక్క విశ్వాసాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలని కాని, ఓ పక్క విశ్వాసాన్ని కాని తొలగించాలని కాని హిందుత్వం నిర్దేశించడం లేదు..’’ అన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మాటలు హిందుత్వ వైవిధ్య పరిరక్షక స్వభావానికి ప్రతిబింబాలు! ‘సుప్రీం’ ధర్మాసనం వారు విచారించి తీర్పు చెప్పిన వివాదం తమిళనాడులో ఆలయంలో అర్చకుల నియామకాల పద్ధతికి విధి విధానాలకు సంబంధించింది. కానీ ఈ తీర్పునకు ప్రాతిపదికగా విస్తృత హిందుత్వ వైవిధ్య స్వభావాన్ని న్యాయమూర్తులు నిర్ధారించడం అనేక సమకాలీన సందేహాలకు, వక్రీకరణలకు ప్రామాణికమైన సమాధానం! ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా మాత్రమే అర్చకులను నియమించడం రాజ్యాంగం నిర్దేశిస్తున్న సమానత్వానికి, వివక్ష రాహిత్యానికి వ్యతిరేకం కాదన్నది సుప్రీంకోర్టు బుధవారం చేసిన నిర్ణయం! నియామకాల వివాద పరిష్కారం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. కానీ విస్తృత హిందుత్వంపై న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన స్పష్టీకరణలు మొత్తం దేశానికి సంబంధించినవి, తరతరాల జాతీయ జీవన విధానానికి సంబంధించినవి! హిందుత్వం సనాతనం...‘సనాతనం’ అని అంటే ‘పాతది’ అన్న అర్ధం లేదు! సనాతనం అంటే శాశ్వతమైనది అని అర్ధం.
ఈ సనాతన తత్త్వాన్ని సర్వోన్నత న్యాయమూర్తులు తమ తీర్పు ద్వారా మరోసారి వివరించారు! గతంలో ఉండినది, వర్తమానంలో ఉంటున్నది, భవిష్యత్తులో ఉండబోయేది సనాతనతత్త్వం! ఆద్యంత రహితమైన ఈ తత్త్వం సనాతన ధర్మం! హిందుత్వపు ఈ సనాతన ధార్మిక స్వభావాన్ని సర్వోన్నత న్యాయస్థానం వారు ఇలా మరోసారి పుష్టీకరించారు. ‘‘ఇది ఏ ఒక్కరు కాని స్థాపించినది కాదు, హిందుత్వం ఒకే ధర్మగ్రంథానికి కాని, ఒకే శాస్త్రానికి కాని, ఒకే ఆగమానికి కాని పరిమితం కాదు, ఒకే ఆలోచన రీతికి సంబంధించిన ప్రబోధానికి నిబద్ధమై లేదు. దీన్ని సనాతన ధర్మమని అభివర్ణించారు. అంటే శాశ్వతమైన ధర్మం! శతాబ్దుల తరబడి వికసించిన విజ్ఞాన రీతుల, ప్రేరణల సమష్టి సమాహారం ఇది. ఈ ‘సమాహారం’ హిందుత్వంగా ప్రచారమైంది, విస్తరించింది...’’ ఈ వివరణ ద్వారా న్యాయమూర్తులు యుగయుగాల సనాతన వాస్తవాన్ని పునరుద్ఘాటించినట్టయింది! ఎందుకంటే వైవిధ్యాలు హిందుత్వపు వివిధ భంగిమలు. హిందుత్వంలో వైవిధ్యాలు నిహితమై ఉన్నాయి. వైవిధ్యాల పరిరక్షక తత్వమే హిందుత్వం! ఇది సహస్రాబ్దుల భారత జాతీయ చరిత్ర నిరూపించిన వాస్తవం!
హిందుత్వాన్ని ఎవ్వరూ ప్రారంభించకపోవడం ఈ చరిత్ర! హిందుత్వం కేవలం ఒక మతం కాదని అది ఈ దేశపు జీవన విధానమని గతంలో కూడ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసి ఉంది! ఇప్పుడు ‘ఏ ఒక్కరో ప్రారంభించలేదని’ సుప్రీంకోర్టు చెప్పడం కూడ హిందుత్వం ఏ ఒక్క మతం పరిధిలోనో ఇమడి లేదన్న వాస్తవానికి అనుగుణం! ఒకరు ప్రారంభించడం, ఒక గ్రంథానికి లేదా ఒక గ్రాంథిక నిబంధనావళికి పరిమితం కావడం మతానికి లక్షణమన్నది ప్రపంచ వ్యాప్తమైన విశ్వాసం! ఒక గ్రంథానికి పరిమితం కాని ‘హిందుత్వం’అందువల్ల కేవలం ఒక ‘మతం’ కాజాలదు! ‘‘సమష్టి విజ్ఞాన ప్రేరణల సమాహారం’’ అన్న సుప్రీం భాష్యం వివిధ మతాలను స్ఫురింపచేస్తోంది, వివిధ భాషలను స్ఫురింపచేస్తోంది! అసంఖ్యాకమైన వైవిధ్యాలను స్ఫురింపచేస్తోంది! వీటన్నింటికీ అతీతంగాను, అన్నింటినీ ఇముడ్చుకుంటునూ ఈ దేశపు వౌలిక అస్తిత్వం వేల ఏళ్లుగా పరిఢవిల్లుతోంది! ఈ అస్తిత్వం హిందుత్వం! ఈ అస్తిత్వ వికాసక్రమంలో మతాలు, భాషలు, ఇతర వైవిధ్యాలు భాగమయ్యాయి! అంతేకాదు పాత మతాలు కొన్ని కనుమరుగయ్యాయి, భాషలు కూడ! కొత్తమతాలు భాషలు పుట్టుకొచ్చాయి. అనాదిగా ఉన్న కొన్ని భాషలు, కొన్ని మతాలు అలాగే ఉన్నాయి, కొన్ని లేవు. వైవిధ్యాలన్నింటికీ వర్తించే చారిత్రక పరిణామ క్రమం ఇదంతా! కానీ ఈ మతాలు, భాషలు ఇతర వైవిధ్యాలు వనంలోని వైవిధ్య వృక్షజాలం వలె హిందుత్వంలో నిహితం కావడం చారిత్రక వాస్తవం! సుప్రీం న్యాయమూర్తుల తీర్పులో ఈ వాస్తవం ప్రస్ఫుటిస్తోంది! ఒక్కదానికి మాత్రమే హిందుత్వం పరిమితం కాదు. శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, స్కాంధ, బౌద్ధ, జైన, శిక్కు, ఆర్య సమాజం వంటి వైవిధ్యాలు ఈ సనాతన జాతీయ ప్రస్థాన గతిలో ప్రస్ఫుటించడం చరిత్ర!!
హిందుత్వ నిహితమైన ఈ వైవిధ్య పరిరక్షక ప్రవృత్తి కారణంగానే మనదేశంలోకి విదేశాలనుండి కొత్త మతాలు వ్యాపించగలిగాయి! ఇస్లాం, క్రైస్తవం, యూదు, పారశీక మతాలవంటివి విదేశాలనుంచి వచ్చి వేళ్లూని విస్తరించగలిగాయి! శతాబ్దుల చరిత్ర ఇందుకు సాక్ష్యం! అన్ని విశ్వాసాలకు, నమ్మకాలకు ఆలవాలమైన హిందుత్వం ఏ ఒక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ధ్వంసం చేయలేదు, వమ్ము చేయలేదు. ఈ వైవిధ్య పరిరక్షక స్వభావంలోని ఒక భంగిమ సర్వమత సమభావం! మరో భంగిమ సర్వ భాషా సమభావం...సకల వైవిధ్య సమభావం సనాతన తత్త్వం! ఈ సనాతన హిందుత్వాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు మరోసారి ప్రస్తావించింది! భారత రాజ్యాంగం ఈ వైవిధ్య సమాన స్వభావానికి ధ్రువీకరణ...