వీరాజీయం

భళారే చిత్రం! ఇంగ్లీష్ భాషే విచిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రపత్రిక ఉగాది సంచికకి వోసారి అప్పటి మన ఆస్థాన కవి- చెళ్లపిళ్ల వేంకట శాస్ర్తీగారిని వో వ్యాసం రాయమని శ్రీ శంభుప్రసాద్‌గారు అడిగారు.- ఆయన జవాబు యిస్తూ కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుగారి అల్లుడయిన శంభుప్రసాద్‌గారడిగారు కనుక ప్రయత్నం చేస్తాను గానీ రుూమధ్య తెలుగులో రాయడం లేదన్నాడుట. అంటే ఇంగ్లీష్‌లో రాశాడని కాదు అర్థం. గీర్వాణ భాషలోనే రాయడం అప్పటి ‘యిది.’
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారికీ వారి తండ్రిగారికీ మధ్య గొడవ అదే. నువ్వు యింట్లో కూడా తెలుగు మాట్లాడితే- ‘కర్రుచ్చుగుంటా’ ననేవాడట ఆయన. కానీ యివాళ? సాక్షాత్తూ శ్రీనాథకవి సార్వభౌముడే దిగివచ్చినా కూడా- ‘‘స్టాండప్ అండ్ గివ్ మీ సీట్’’- అంటాడు.
ఇంతకీ తెలుగు భాషకి ప్రాచీన భాషా హోదా వచ్చిందన్నారామధ్య. వచ్చెనో? లేదో? లేక యిప్పుడు ఏ తెలుగుకు? అది వర్తింస్తుందో? ఆంధ్రా తెలుగుకా లేక తెలంగాణా తెలుగుకా? దేనికీ హోదా? అన్న మీమాంస తల ఎత్తునా? అన్నదొక మీమాంస.
ఇంగ్లీషు భాష హోదా ఏమిటీ? అని కాస్సేపు- ‘లెటజ్‌సీ’. ఇందులో మళ్లీ మతలబు వుంది. ఇంగ్లీష్ మీడియమ్ అనగా ‘ఆంగ్ల మాథ్యమం’ అవసరమా? అని పృచ్ఛించుకుందాం. మన పిల్లలు దేశాలన్నీ తిరగాలి. కామనె్వల్తు ప్రపంచంలోనే కాదు అమెరికాలో కూడా కాసుల పంటలు పండించే ఉద్యోగాలు ఏలాలి. ఇంటికి అంటే ఇండియాలో యింటికి డాలర్లు పంపించాలీ అంటే ఏంకావాలి? మనతో కూడా దేశ విదేశాలకు పోతూ- వో ‘దుబాసీ’ని కూడా పట్టుకుపోలేంకదా? మన మేమన్నా మంత్రులమా? ఎంపీలమూ, ఎమ్‌ఎల్ల్యేలమూనా? సినిమా స్టార్స్‌కీ, సెలబ్రిటీలకీ కూడా ఇంగ్లీష్ రావాలి. ‘‘రైలుబండీ ఎక్కుదాం- దేశాలన్నీ తిరుగుదాం’’. అన్న పాట వొకటుంది- పిల్లకాయలపాట. రైలెక్కుతాం. సరే- ఎక్కిన దగ్గర్నుంచీ పొలిమేరలు దాటకుండానే బొట్లేరు యింగ్లీషు మాటలు రావాలి. కాఫీ, టీలు, కట్‌లెట్ ఆమ్లెట్ లాంటిదేంకావాలన్నా ఆ ‘‘టీ వెండార్’’కి ఏ ఆంగ్లభాషో, కన్నడం, మలయాళ భాషో తప్ప తెలుగు తెలీదు అంటాడు. వాడిదీ కాదు- మనదీ కాదు అయిన హిందీ భాష లాంటిది ఐనా అవసరం అవుతుంది. అదే యింగ్లీష్ అయితే, అది మనది అనుకుంటారంతా.
అదే ఇంగ్లీష్ భాషయొక్క తమాషా. ‘‘ఇంగ్లీషు భాషా- భలే తమాషా’- అంటూ వో చిన్న పిల్లల పాటలు- అనగా ‘రైమ్స్’సి.డి. విన్నానీమధ్య. ‘ఇంగ్లీషు భాషా భలే తమాషా’- అంటూ వెంటాడుతుందా సి.డి. అనగా ‘‘విద్యుత్ ధ్వని ముద్రా ఫలకం’’ అందామా? బాలేదా? సరే- సి.డి. అనే అందాం. సి.డి.లో ‘సి’అంటే ఏమిటో, ‘డి’ అంటే ఏందో తెలియకపోయినా - ‘‘ఎవ్విరిబొడీ నోస్ యిట్’’. ఆ యొక్క ఆంగ్లేయుల బాసలో, యాసలో వోమాదిరి రొమాన్స్ వుంది. అది ‘‘అయినింటి అమ్మడు.’’ జీన్ ప్యాంట్ ధరించినప్పుడు కలిగే ఆకర్షణ లాంటిది!
నేను పేర్కొన్న ‘రైమ్స్’లో నాలుగు చరణాలున్నాయి. భలేగా వున్నాయి. ఉంటంకిస్తాను. ‘‘ఇంగ్లీషుభాషా ‘్భలే తమాషా!’ ‘సాల్ట్’ అంటే ఉప్పు ఫాల్ట్ అంటే తప్పు. ఇంగ్లీషు భాషా ఎంతో తమాషా ‘క్రో’ అంటే ‘కాకి’. ‘కాక్’ అంటే పుంజు. ఇంగ్లీషు భాషా ఎంతో తమాషా. ‘షూ’ అంటే బూటు/ షో అంటే చూపు/ గుడ్డు అంటే గుడ్డు కాదు. బెడ్ అంటే బెడ్డు కాదు./ ఇంగ్లీషు భాషా/ ఎంతో తమాషా... ఇలా సాగే రుూ భాషా రొమాంస్‌ని- ‘‘పియుటి’’ ‘‘పుట్’’ అనగలమే గానీ సియుటి ‘‘కుట్’’అనలేం. అరవై ఏళ్లయింది- మన అస్థినంటుకుపోయిందీ ‘‘లింకు భాష’’. దీన్ని తెల్గిష్‌గా మనం ‘ఓన్’చేసుకున్నాం. ఎందుకంటే- ఆదినే సంస్కృతాన్ని ఒదులుకున్నం- మునిగిపోయాం... హిందీ వొద్దన్నాం... ఇక మన పిల్లలు ఇంటర్నేషనల్‌గా రాణించాలీ అంటే. అమ్మ తెలుగుకావాలి. రైలుబండీ ఎక్కుదాం- దేశాలన్నీ చుట్టుదాం’- అంటే దానికి, రెండు పట్టాలుండాలి. ఒక పట్టా ‘టెల్గూ’ మరోపట్టా ఆంగ్లమూ- ఇక ఏలినవారి భాషగా వచ్చిన- ఉర్దూ భాషలోని కొన్ని వందల ధాతువులు తెలుగులో- / పాలూ, నీళ్లుగా/ కలిసిపోయి మన జీవితమీద ‘‘అజ్మాయిషీ’’ చేస్తూన్నాయి కదా-
చిన్నాభిన్నమయిన మన దేశ భాగాలని అతికే ‘‘టంకం’’ యివాళ ఇంగ్లీషు భాషే. మన పిల్లలు కాంపిటీటివ్ పరీక్షల్లో ర్యాంకులు మోసుకొస్తున్నారు. దేశ విదేశాలలో రూపాయల మూటలుకట్టుకుని వస్తున్నారు. అక్కడికి పోయి కూడా తెలుగుతల్లిని పూజిస్తున్నారు. కానీ మనంమాత్రం ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నాం.
బోలెడు సర్వేలు చేశారు. కార్పొరేట్ స్కూళ్ల ధాటికి మన స్కూళ్లు తట్టుకోవాలీ అంటే ఆంగ్లమాధ్యమం కూడా ప్రక్కప్రక్కనే ఉండాలీ అన్న మాట సర్వేశ్వరులు నొక్కివక్కాణిస్తున్నారు. మన/ సిటీల్లో/ ఎక్స్‌క్యూజ్‌మీ, ధాంక్యూ, సారీ, ప్లీజ్ లాంటి మ్యానర్స్ లేకపోతే మనం బతకలేం.
ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ‘‘డోన్ట్ స్పీక్ టెల్గూ’’అన్న బోర్డులు తీయించేయండి. మాల్స్‌లో హోటల్స్‌లో, సూపర్ స్పెషాలిటీస్‌లో తెలుగు బోర్డులకి చోటిప్పించండి. అది మన ప్రతిష్ఠకి సంబంధించినది.
వెనుకటికి సరస్వతీదేవి తెనాలి రామలింగ కవికి అర్జెంట్‌గా ప్రత్యక్షం అయి- ‘‘అబ్బీ! రామకృష్ణా! ఈ ముంతలో పాలూ- రుూ కుండలో పెరుగూ వున్నాయి. ఏదో ఒక ‘కుండ’తీసుకోవాలి’- అన్నదిట. తె.రా. వెంటనే రెండు కుండలూ తీసుకుని - తిరగా మరగా కలిపేసి, త్రాగేసి- ‘‘అమ్మా! ఒక్క ముంతలోనే, రెండూ త్రాగాను’- అన్నాట్ట. నాలో కూడా వికట కవి టెంపర్మెంటుంది. అమ్మ జాగాలో ‘అమ్మా’- తెలుగు ఉండాలి- సహచరుడూ, స్నేహితుడూ సచివుడు, బంధువూ, గురువూ, లఘువూ వగైరాలన్నింటా అన్ని జాగాల్లోనూ కలిపి ఇంగ్లీష్ వుంటేనే- బాగు.
లెట్ ఇంగ్లీష్ కల్చర్ గో అండ్ ఇంగ్లీష్ స్టే!