వీరాజీయం

అమ్మ మాట: దీదీ బాట: భాజపా కూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంబరాలు సమసాయి. సంతాపాలు సద్దుమణిగా యి. మంత్రివర్గం ఏర్పాట్ల మల్లగుల్లాలు సాగుతున్నాయి. దేశం అంతటా నారీమణుల పరిపాలన పురివిప్పిన నెమలిగా భాసిస్తూ వున్నది. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి దాకా- రాజస్థాన్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా, గుజరాత్‌ని కూడా కలుపుకుని- ఐదుగురు మహిళామణులు పరిపాలనా పగ్గాలు ధరించి ప్రజాస్వామ్య రథాలను తోలుతున్నారు. అందులో ముగ్గురు యిప్పటికే కొలువుదీరి వున్నారు గానీ- యిప్పుడు ఎన్నికల్లో మొయిలు దారంట ఇనబింబ సదృశంగా చెలరేగి జయపతాక నెగురవేసిన యిద్దరికీ జేజేలు చెప్పడం మన సంతోషం.
దక్షిణాదిన అమ్మ జయలలితమ్మ- పశ్చిమ బెంగాల్‌లో దీదీ బెనర్జీ మమతాదీదీ-రుూ యిద్దరూ వాళ్లు నిభాయించే పార్టీలకన్నా మిన్న. పార్టీ వారిలో ప్రకాశించాలి, జీవించాలి. కానీ, పార్టీ గంపక్రింద కోడిపెట్టలు కారు వాళ్లు. పార్టీలే ఆ యిద్దరమ్మలలో వొదిగి రాణిస్తున్నాయి.
ఆ వైనం అట్లుండనిండు. 2014నుంచి దేశ రాజకీయ చిత్రపటం- కలైడోస్కోపు రీతి రంగులు మారిపోతూ వచ్చింది. దెబ్బమీద దెబ్బ తింటూనే వుంది- సోనియాగాంధీగారి కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ, హర్యాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లలో కుదేలయిపోయింది. ఇక బీహార్‌లో ఆర్.జె.డీ.; జెడియూల రథానికి తోకలాగా బండిలాగిస్తున్నది. ఏదో సామెత చెబుతారే- ‘‘కొండ మీద వాడు గుడిమీద- గుడిమీదవాడు అరుగుమీద- అరుగుమీది వాడు నేలమీద పడ్డాడు-’’అన్నట్లు, అయిన కాంగ్రెస్ పార్టీ ఆకురాలు కాలంలో మహావృక్షం లాగా అయిపోతోంది.
ఇవాళ దేశం యిదివరకటి స్థితితో పోలిస్తే యించుమించు కాంగ్రెస్ రహిత ప్రాంతంగా మారిపోతున్నదేమో అనిపిస్తోంది. ఈశాన్య కోటలో ఎట్టకేలకు పాగావేసిన భాజపా- కేరళలో కూడా బోణీ చేసింది. ఒక అమ్మాయి అంటోంది- ‘‘కాంగ్రెస్ హస్తం ఎక్కడ పడితే అక్కడ ‘ఐరన్ లెగ్గే’ అయిందని. ఏమంటాం? ఐదుగురు అమ్మలు గద్దెమీద కూర్చుని వున్న సువిశాల భారతంలో ఆడువారిని ఏమయినా అని- మనగలమా? ఓకే అంటాం... అంతే!
నేటి భారతంలో భాజపాకి తొమ్మిది రాష్ట్రాలున్నాయి. మరో నాలుగు రాజ్యాలు యితర పార్టీల అలయెన్సుతో వున్నాయి. కాగా, కాం.పా.కి ఆరు రాష్ట్రాలు- అవీ ‘నామ్‌కే వాస్తే స్టేట్స్’గానీ, బడా రాష్ట్రాలు కావు. నిజానికి ప్రాంతీయ పార్టీలదే ‘హవా’. తొమ్మిది ప్రాంతాలలో నాన్ కాం.పా. అండ్ నాన్ భాజపా.- జెండాలు ధగధగ లాడుతున్నాయి. కేరళాలో షరామామూలే అన్నట్లుగా వుంది గాని- రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాలకు కాం.పా. తిలోదకాలు యిచ్చుకుంది. అదీ పరిస్థితి. ఇక కేరళాలో మామూలే- రైట్ లెఫ్ట్; లెఫ్ట్ రైట్ అగైన్ లెఫ్ట్ అన్నట్లుగా- కలకత్తాలో చోటు దొరకని ఎర్రజెండా అక్కడ బ్రతుకు జీవుడా అని ఎగురుతోంది- వైవిధ్యం, విభిన్నత్వం వగైరా మాటలు భారతావనికే కాదు - మన వోటరు యొక్క తత్వంలో కూడా ప్రతిఫలిస్తోంది. - ‘‘మేం యింకా కష్టపడతాం- ఎక్కడ వున్నదో లోపం తెలుసుకుంటాం’’-అని తల్లీ, కుమారుడూ అన్నారు. కానీ, కాం.పా.కి మాత్రం నాయకత్వ లోపం దినదిన ప్రవర్ధమానంగా ప్రస్ఫుటమవుతోంది. ‘ఇంత యిదిగా ఫెయలయిన అబ్బాయికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలిచ్చి- సోనియాగాంధీని ప్రక్కనబెడితే ఏదో వొరుగుతుందీ అన్న భ్రమ వుండడం, ఆశ్చర్యమే! పైగా ఆ పార్టీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లో కూడా యిప్పుడే చెల్లుచీటీ రాసేసుకుంటున్నట్లు- ప్రియాంకాగాంధీని ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థినిగా బరిలోకి దింపాలంటున్నారు. ‘‘అదే శవపేటిక మీద దిగేసిన ఆఖరి మేకు అవుతుంది. తథాస్తు!’’అంటున్నాడో భాజపా కార్యకర్త.
ఇప్పుడింక జయలలిత గెలుపు దగ్గరికి వద్దాం. వరుసగా గెల్చిన రికార్డు ఆమెది. వోట్ల లెక్కింపుకి రెండ్రోజులు ముందు కంచి సాములు- జయేంద్ర సరస్వతిగారిని ఇంటర్‌వ్యూ చేశారో యిద్దరు భక్తులు. ‘‘తమిళనాడులో జయలలిత గెలుస్తుంది. మంత్రివర్గం ఏర్పాటుచేస్తుంది’’- అన్నాడా ‘బ్రాహ్మడు’. ఆయన మీద కేసులు బనాయించి, జైలుకు పంపిన సంగతిని గుర్తుచేసిన సాములవారామాటే అన్నాడు. ‘‘అభియోగాలు పటాపంచలయినాయిగా?’’అని మాత్రం అన్నారాయన. నల్ల కళ్లద్దాల కరుణానిధి కూడా జయమ్మకన్నా ఎక్కువే వరాలు ఏకరువు పెట్టాడు కానీ- ‘అమ్మని’ ‘అమ్మనీ’అంటూ మాతృవాత్సల్యం కురిపించి వోటర్‌లను మురిపించిన జయమ్మ గెలిచింది- అసలు అన్నాదురైగారే నాస్తికుడు కాదు. ‘ఒకడే దేవుఁడు, ఒకటే కులం’ అన్నాడాయన- అంటూ కరణ్‌థాపర్‌ని ఎడాపెడా వాయించేసింది (బిబిసి ఇంటర్‌వ్యూలో) వెయిట్ అండ్ సీ అన్నది.
ఒక్క సుబ్రమణ్యస్వామికి తప్ప- జయమ్మ యింకెవరికీ ఉలకదు. ఇప్పుడదీ పోయింది. కానీ సోనియాగాంధీగారికి- ‘‘’స్వామి ఫోబియా’’ పట్టుకుంది. ఇవాళ కొత్త గెలుపును సాధించిన భా.జ.పా.కూడా ఎగిరిగెంతు వేయనక్కరలేదు- చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీలాగే అనేక దేశీయ సంక్షేమ సిద్ధాంతాలకు సంబంధించి- అంతర్మధనం చేసుకోవాల్సి వుంటుంది. ఒకనాడు ఉల్లిపాయ దెబ్బకి గవర్నమెంటు మట్టిగరిచిన సంగతి ఎవరూ మరిచిపోకూడదు. కూడూ- గూడూ- గుడ్డా- తరువాతనే ఎవరికైనా పార్టీ ‘సిద్ధాంతం- రాద్ధాంతం’. రూపాయి విలువ పడిపోయి, తిండి గింజల ధరలు పెరిగిపోయిన దేశంలో ఉత్కర్షకి స్వోత్కర్షకీ కూడా చోటులేదు. కాగా, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ రాహిత్యం ఏర్పడిపోయింది. ముందా సమస్యని పరిష్కరించుకోవాలి. నెహ్రూ వంశంపోతే - భారతదేశం పోలేదు. ఇంచక్కా వుంది. అలాగే ఈ గాంధీలు పోతే కాంగ్రెస్సూ పోదు... యింకా బ్రతుకుతుందేమో?!
‘దట్స్ ద అండర్‌లైన్ ఫర్ దిస్ హ్యాపీ నోట్!’