సబ్ ఫీచర్

ర్యాగింగ్.. ఓ ఎగతాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ర్యాగింగ్ అనేది ఒక ఎగతాళి. వేధింపు. ఇది స్కూల్లో, కాలేజీల్లో మాత్రమే చేసేది కాదు. ఇది పుట్టుకతోనే మొదలౌతుంది! ఎవరైనా, ఆడ లేక మగ బిడ్డను ప్రసవించినట్లైతే ఆ బిడ్డను చూసిన తమ వాళ్ళే, అయ్యో! బిడ్డ కర్రిగా వుందనో, కళ్ళు సరిగాలేవనో, ముక్కునోరు సరిగాలేవనో రకరకాలుగా వంకలు పెడుతూ..ఎగతాళి చేస్తారు. వారేదో రతీమన్మథుల లాగ వున్నట్లు! కన్నతల్లి మాత్రం ఎవ్వరు ఎన్ని విధాలుగా వంకలు పెట్టినా, అంగవైకల్యంతో పుట్టినా, తనకు తన బిడ్డముద్దే! అక్కున చేర్చుకొని పాలు పడుతుంది. అది మాతృత్వపు మమకారం!
చిన్న పిల్లలు ఎదిగేకొద్ది వాళ్ళ నడతనుబట్టి ఇరుగు, పొరుగువారు వారికి మారుపేర్లు పెట్టి పిలుస్తూ ఎగతాళి చేస్తుంటారు. వేధించుకు తింటారు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు తోటి పిల్లలు కూడా ఒకరిని ఒకరు ఏదో రకంగా ఏడిపిస్తూ ఎగతాళి చేసుకుంటూ వుంటారు. ఎన్నో రకాలుగా వేధించుకుంటున్నారు.
సినీ తారల కుటుంబ జీవితాలను కూడా ఎన్నో పత్రికలు, టీవీ చానల్స్ వార్తలుగా ప్రచారం చేస్తుంటారు. ఎగతాళి చేస్తూ వుంటారు. వారు మాత్రం ఆ వార్తలను ఏమాత్రం పట్టించుకోరు. ఎవరి మనసైనా ఆ వార్తలతో నొచ్చుకుంటే వెంటనే ఖండిస్తారు తప్ప వారిమీద ఎలాంటి చర్యలు తీసుకోరు.
ఇలా సంఘంలో వున్న వారిపైన ఎప్పుడు ఏదో రకంగా హేళనలు, వేధింపులు జరుగుతూనే వుంటాయి. కొందరికి శిక్షలు పడుతూనే వుంటాయి. ఈ ఎగతాళి, వేధింపులు, మానవుల్లోనే కాదు. దేవదానవుల్లో కూడా నాడు వున్నాయి. త్రిమూర్తుల భార్యలు సరస్వతీ, లక్ష్మీ, పార్వతీ సతీఅనసూయ పాతివ్రత్యం శంకించడానికి వారి భర్తలతో ఆమెను ఎగతాళి చేసి వేధించాలనుకుంటారు. కాని త్రిమూర్తులు, ముగ్గురమ్మాయిలు అనసూయ చేతిలో భంగపడిపోయి క్షమాపణలతో బయటపడి వస్తారు. సతీఅనసూయ ముందు ముగ్గురమ్మాయిల పాతివ్రత్యం నీరుకారిపోయింది. కారణం సతీఅనసూయలో వున్న సచ్చీలత! ధర్మగుణం!
వినాయకుడి రూపాన్ని చూసి ఎగతాళిగా నవ్విన చంద్రుడు కూడా సిగ్గుతో తలదించుకోలేదా? బోళా శంకరుడిగా పేరుగాంచిన శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చి, వాడి చేతనే వేధించబడలేదా? శనీశ్వరుడితో శపథం చేసి, అతనికి భయపడిపోయిన శివుడు చెట్టుతొఱ్ఱలో దాగిపోయి శనీశ్వరుని ముందు సిగ్గుతో తలదించుకో లేదా?
లోక సంచారియైన నారద మహర్షి ఎన్నో గొడవలు సృష్టిస్తూ ఇరువర్గాలవారు తన్నుకొని చస్తుంటే హేళనగా పగలబడి నవ్వలేదా?
సీతమ్మను అపహరించిన రావణాసురుడు ఆమెను ఎన్నివిధాలుగా ఎగతాళి చేసి వేధించలేదు. తుదకు వాడి పరిస్థితి ఏమైపోయింది. నిండు సభలో ద్రౌపదిని వేధించి, ఎగతాళి చెయ్యలేదా? చివరికి వారంతా ఆమె కోపానికి మట్టికరువలేదా?
నాడు ప్రతి స్ర్తి ఎన్నో వేధింపులకు, ఎగతాళికి గురియైనా గుండె నిబ్బరంతో భరించి పిదప వారిని సమయం చూసి శిక్షించారు. విజయంతో తలెత్తుకు నిలిచారు.
ర్యాగింగ్‌కు గురి అయ్యేవారు ఏమాత్రం కలత చెందక, అధైర్య పడక, కుమిలి, కుమిలి ఒంటరిగా ఏడ్వక ధైర్యంతో తిరగబడాలి. లాగి గూబగుయ్యిమనేలా రెండు చెంపలు చెప్పుతో వాయించాలి. అప్పుడే వారి ఆటకట్టవుతుంది. అవసరమైతే శిక్షలుపడేలా చూడాలి.
అంతేకాని, వారికి భయపడిపోయి మీ నిండునూరేళ్ళ జీవితాన్ని తృణప్రాయంగా ఎందుకు తీసుకుంటారు? ‘్ధర్యేసాహసే లక్ష్మీ’అన్నారు కదా! ఇక ఆలస్యమెందుకు ధైర్యంతో ముందడుగువేసి, ర్యాగింగ్‌ని అరికట్టండి.

- ఆకుల రాఘవ