సబ్ ఫీచర్

శాస్ర్తీయ అవగాహన ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని సందర్భాలలో టీచింగ్ మాత్రమే ఉంటుంది. లెర్నింగ్ ఉండదు. కొన్ని సందర్భాలలో టీచింగ్, లెర్నింగ్ రెండు కూడా ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో లెర్నింగ్ మాత్రమే ఉంటుంది. పిల్లలు ఒక పువ్వును పరిశీలిస్తూ దానిలో రెక్కలు, వివిధ భాగాలను ఎవరి సహాయం లేకుండానే నేర్చుకుంటాడు. కొంతమంది సమాజంలో వున్న వివిధ ప్రక్రియలను పరిశీలించి నేర్చుకుంటారు. దీనే్న శాస్ర్తియ పరిణామమంటారు. పిల్లలు కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలలో వచ్చిన మార్పును గమనించి కొన్ని నిర్ణయాలకు వస్తారు. అదే మాదిరిగా కొంతమంది పుస్తకాన్ని చదివి సమాజం పోకడలను నేర్చుకుంటారు. అన్నింటిలో కూడా టీచింగ్ ఉండాల్సిన అవసరం లేదు. సైన్స్‌లో ఒక సంఘటననైనా, ఒక వస్తువునైనా విద్యార్థి చూసి నేర్చుకుంటాడు. కొన్నిసార్లు చేసి నేర్చుకుంటాడు. ఇలాంటి అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు అక్కడ ప్రేక్షకుడుగా మాత్రమే ఉంటాడు. ఇలాంటి జ్ఞానం మనిషిపైన ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కాబట్టి సైంటిఫిక్ పరిజ్ఞానం టీచింగ్‌కన్నా కూడా ఎక్కువ ప్రభావితం చేయగలుగు తుంది. అందుకే ప్రాథమిక స్కూలు దగ్గరి నుంచి ప్రయోగశాలలు ఏర్పాటుచేస్తారు. పిల్లలను మ్యూజియమ్స్‌కు తీసుకుపోతారు. అదే విధంగా విజ్ఞాన యాత్రలకు తీసుకుపోతారు.
తరగతి గది అనేది నాలుగు గోడలే కాదు, నాలుగు గోడలు లేని ఓపెన్ ప్లేస్ కూడా కావచ్చును. ఉపాధ్యాయుడు లేకున్నా కానీ అది తరగతి గదే. అందుకే అధ్యయనం జరిగినటువంటి ప్రదేశాన్ని తరగతి అంటాం. ప్రతి లైబ్రరరీ విద్యార్థికి తరగతి గదే. ప్రతి మ్యూజియం ఒక తరగతి గదే. కొన్నిసార్లు పరిసరాలే తరగతి గది. కొలంబస్‌కు సముద్రమే తరగతి గది. సైన్స్ వాస్తవాలను పరిశీలించే స్థలం చూపిస్తుంది. తరగతి గది అంటే నాలుగు గోడల ప్రదేశమే కాదు. అధ్యయనం అన్నది సెల్ఫ్ రీడింగ్ కావచ్చును. లేక వౌనంగా ఒక దృశ్యంపైన కేంద్రీకరించవచ్చును. యోగులు చేసే తపస్సు ఒక అనే్వషణ కాదా? సైన్స్‌కు హద్దులు లేవు. దానికుండే లక్షణం ఆసక్తి. ఎక్కడ ఆసక్తి ఉంటుందో, సత్యానే్వషణ ఎక్కడ ఉంటుందో అదే సైన్స్. సైన్స్ టీచర్‌కు విద్యార్థిలోపల ఆసక్తిని రగిలిస్తే చాలు. ఆ ఆసక్తి కొత్త జ్ఞానం ద్వారాలను తెరుస్తుంది. ఆసక్తిని పెంచటమే ఉపాధ్యాయుడు చేయాల్సిన పని.
ఒక్కొక్క విద్యార్థి తన ఆసక్తికి అనుగుణంగా పరిశీలన కొనసాగిస్తాడు, పాఠాలను అర్థం చేసుకోవడానికి యత్నిస్తాడు. అతడు కొనసాగించే ఈ యత్నాల్లో కొన్ని సందర్భాల్లో అతనికి సహాయం అవసరం కావచ్చు. మరికొన్ని సమయాల్లో అవసరపడకపోవచ్చు. కాని విద్యార్థి తన పరిశీలనను నిరంతరం కొనసాగించేందుకు తగిన ప్రోత్సాహం మనం కల్పించాలి. అప్పుడు మాత్రమే నూతన ఆవిష్కరణలకు మార్గమేర్పడు తుంది. నిజానికి విద్యార్థి అవగాహనాశక్తిని మరింత విస్తృతం చేసేందుకు ఈ పరిశీలనలు దోహదం చేస్తాయ. థియరీగా చదువుకొని రాయడానికి, పరిశీలించి, తాను పొందిన అనుభవం ద్వారా తెలుసుకున్న దాన్ని వివరిం చడానికి చాలా వ్యత్యాసముంటుంది. నిజానికి థియరీలోని విషయ వాస్తవికత విద్యార్థికి యథాతథంగా అర్థం కాకపోవచ్చు. అందుకు ఉపాద్యాయుడు సహకరించాలి. అంటే బోధించి, విశే్లషించాలి. విద్యార్థి అవగాహనా స్థాయకి దిగి అతనికి సక్రమ రీతిలో అవగాహన కలిగించాలి. అప్పుడు మాత్రమే విద్యార్థి వాస్తవ జ్ఞానాన్ని పొందుతాడు. అదే శాస్ర్తీయ దృక్పథంతో ముందుకెళ్లే విద్యార్థి, థియరీలోని వాస్తవికతను తాను అనుభవం ద్వారా తెలుసుకుంటాడు. ఈ విధంగా పొందిన జ్ఞానం శాశ్వతం. కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు దారి తీస్తుంది. ప్రస్తుతం మనకు కావలసింది ఇదే.

- చుక్కా రామయ్య