సబ్ ఫీచర్

స్వదేశీ పరిజ్ఞానమే శ్రేష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ పెట్టుబడులుకోసం నేడు భారత్ ఎదురుచూస్తోంది. నేటి ప్రభుత్వం వివిధ దేశాల బహుళ కంపెనీలు భారత్‌కు రావాలని ఆశిస్తోంది. కేంద్రం దారిలోనే తెలుగు రాష్ట్రాలు విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇదంతా చూస్తుంటే 150 సంవత్సరాల క్రితం చరిత్ర పునరావృతానికి దారితీస్తోందనిపిస్తోంది. దేశం అభివృద్ధి చెందాలి. నిరుద్యోగ సమస్య తొలగాలి. అందరికీ విద్య అందాలి. రైతులో ఉత్సాహం పెంపొందించాలి. మేక్ ఇన్ ఇండియాలోకి అడుగుపెట్టాలి. మార్గాలు అనే్వషిస్తే చాలా దొరుకుతాయి. ఇందులో భాగమే విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి రావాలి. వివిధ దేశాల కంపెనీలకు ప్రభుత్వాలు దాసోహం అన్నాయ. భారత్‌లో వివిధ రకాల నూతన కంపెనీలకు దేశీయ పారిశ్రామికవేత్తలు లేరా? అరి ప్రశ్నిస్తే లేరని మన ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇంటిని చక్కదిద్దడానికి పరాయివాడికి పెత్తనం ఇచ్చినట్లుగా ఉంది.
పరాయి కంపెనీలు దేశంలో విస్తరిస్తే అవి మరింతగా చొచ్చుకుపోతాయి. వారు చెప్పిందే వేదం. ఇది ఇప్పుడే కాదు. మరో ఇరవై ముప్పయి సంవత్సరాల తరువాత మాట. కొత్తగా ఇండియాలోకి వచ్చే కంపెనీలకు అన్నిరకాల సదుపాయాలు, తక్కువ ధరకే భూములు ఇవ్వాలి. వాళ్ల కాళ్లకు చెప్పులా మనం నడుచుకోవాలి. ఇంటికి కొత్త అల్లుడు వస్తే చేసే మర్యాదలకన్నా వీరికి ఇంకా ఎక్కువచేయాలి. విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీలతో పోటీపడతాయి. దేశీయ కంపెనీలపై చావుదెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఆధిపత్యపోరు ప్రారంభవౌతుంది. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఆసియాలోని అన్ని దేశాలకు స్వాగతం పలుకుతోంది. విడిపోయిన తెలుగు రాష్ట్ధ్రాపతులు కూడా మోదీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. వీరు కూడా స్వయంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. టాటా, బిర్లావంటి పారిశ్రామికవేత్తలు మన దేశంలో కోకొల్లలున్నారు. భారత్‌లో ప్రతి రాష్ట్రాల్లో బహుముఖ ప్రజ్ఞావంతులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. దేశం అభివృద్ధి చెందటానికి స్థానిక పారిశ్రామికవేత్తలకు ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు. అమెరికా, చైనా, జపా న్, లండన్ వంటి దేశాలు అభివృద్ధి చెందటానికి దేహీ అంటూ మన దేశంలాగ వివిధ దేశాలపై ఆధారపడలేదు కదా. జపాన్, చైనాలాంటి దేశాల్లో స్వదేశీ పారిశ్రామికవేత్తల సహకారంతోనే అభివృద్ధి చెందాయి. నేటి అభివృద్ధి చెందిన దేశాల్లో స్వయంప్రతిపత్తితోనే అభివృద్ధిబాట వేసాయి.
భారత్ బడుగుదేశం కాదు. సహజవనరులు సహజ సంపతి, విజ్ఞాన కోవిదులు, పారిశ్రామికవేత్తలు నైపుణ్యంగల కార్మిక వ్యవస్థలున్నాయి. మన ఇండ్లు, మన రోడ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నామా? పరాయివాడి కాళ్లుపట్టుకొని ప్రాకులాడే దుస్థితికి ఎందుకు దిగజారిపోతున్నాము. నేడు కొత్త కంపెనీలు భారత్‌లోకి రావచ్చు. పాత కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. భారత్ కంపెనీ కార్మికులు ఒక రీతిలో పనిచేస్తుంటారు. ఇటువంటి విదేశీ కంపెనీలో కార్మికులు మరో రకంగా వారి చెప్పుచేతల్లో పనిచేయవలసి వస్తుంది. విదేశీ కంపెనీలు వారి ఆధిపత్యపోరు నడిపిస్తే స్వదేశీ కంపెనీలు చిత్తయి మూసివేసే పరిస్థితులు తప్పకవస్తాయి. దేశంలో అప్పుడు విదేశీ ఆధిపత్యం పెరుగుతుంది. చదువుకున్న విద్యార్థులు బానిసలుగా విదేశీ కంపెనీల అడుగుజాడల్లో నడవవలసి వస్తుంది. ఇదిలా కొనసాగితే భారత్ పరాయి దేశాల అదుపుఆజ్ఞలలో చిక్కుకుపోతుంది. భవిష్యత్ దేశ ముఖంవైపు రాజకీయ పార్టీలు ఎందుకు చూడటం లేదు. తాత్కాలిక రంగుల చిత్రం ప్రజలకి చూపిస్తున్నారు.
భారత్‌లో స్వయంప్రతిపత్తిగా గుర్తింపుతెచ్చుకున్న సంస్థ ఇస్రో. స్వర్గీయ మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలాం వంటి శాస్తవ్రేత్తల నడుమ ఇస్రో ఎనె్నన్నో ప్రయోగాలు చేస్తూ భారత్‌కున్న సత్తువ నిరూపించింది. అవకాశం ఇస్తే భారత్‌లో చాలామంది శాస్తవ్రేత్తలు మేక్ ఇన్ ఇండియా చూపించగలరు. విదేశీయుల కంపెనీలపై మనం ఆధారపడనక్కరలేదు. అమరావతి రాష్ట్రంలో ప్రవేశించడానికి డచ్ దేశపు కంపెనీలు తిరిగి ముందుకు వస్తున్నాయి. నౌకాయాన రంగం ద్వారా గతంలో భారత్‌ని కొల్లగొట్టింది. వారు నిర్వహించిన వ్యాపార చిహ్నంగా అప్పట్లో నిర్మించిన కట్టడం నేడు భీమిలి (విశాఖ జిల్లా) వద్ద కూలిపోతున్న దశలో ఉంది. ఇటువంటి దేశాల కంపెనీలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతించడం దురదృష్టకరం. అమరావతిని అభివృద్ధిచేస్తే ప్రజలు ఆనందిస్తారు.
దేశ అభివృద్ధికి కృషిచేస్తే మంచిదే. స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి భారత్ రష్యాని నమ్ముకుని మందుకుసాగింది. నేటి ప్రభుత్వం అమెరికా, జపాన్, చైనా ఏదో ఒకరిని నమ్ముకొని దేశాభివృద్ధికి కృషిచేస్తే మంచిదే. ఆసియా ఖండపు దేశాలన్నీ సహాయంకోరితే చివరకు భారత్‌నే వారికి అప్పగించే పరిస్థితి వస్తుంది. నేటి ప్రభుత్వాలు పెట్టుబడులకు ఇతర దేశాల ముంగిటచేరుతున్న విషయం యదార్థం. భవిష్యత్‌లో కొత్త ప్రభుత్వాలు రావచ్చు కదా. మీరు తప్పుడు నిర్ణయాలతో పరుగులుతీస్తే భవిష్యత్‌లో సమస్యలు ఎదుర్కోక తప్పదు. గతంలో కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల కారణంగానే ప్రజలు బుద్ధిచెప్పారు. ఇలాంటి పరిస్థితి రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొనే ముందు బాగా ఆలోచించాలి. దీనికి సంబంధించి ఆచితూచి అడుగులువేయాలి. కొత్త కంపెనీలకు ఇస్తున్న అవకాశాల్లో అక్రమార్గాలు అనుసరించవద్దు. సొంత లాభం కొంత మానుకుంటే భవిష్యత్‌లో విచారణలకు గురికాకుండా ఉండవచ్చు. లాభార్జనే ధ్యేయంకాకుండా సహకార నిష్పత్తి కొత్త కంపెనీలు రావాలి.
విదేశాలనుంచే వచ్చే పరిశ్రమలు దోపిడీకి పాల్పడకుండా పరివేక్షణ ఉండాలి. కొత్త టెక్నాలజీ అందిస్తే ఆనందమే. విదేశీ కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహం భారత పారిశ్రామికవేత్తలకు కూడా ఇవ్వాలి. స్వదేశీ విదేశీ పోటీతత్వం రాకుండాచూడాలి. కొత్త పారిశ్రామిక రంగం ఉద్యోగ భద్రత పాటించాలి. దీనిపై ప్రభుత్వం నిఘా ఉంచాలి. దేశీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలపై ప్రజల్లో మోజుపెరగకుండా చూడాలి. జీతభత్యాల విషయంలో వ్యత్యాసాలు పొడచూపకుండా చూడాలి. కొత్త కొత్త టెక్నాలజీ అన్ని రంగాల్లో తెలుసుకోవడంలో తప్పులేదు. దేశీయ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు సహకరించాలి. విదేశీ కంపెనీలతో అభివృద్ధికి బాటవేశామని భావించడం మంచిది కాదు. స్వదేశీ పరిజ్ఞానంతో అడుగుముందుకేసి దేశాభివృద్ధికి అడుగులువేస్తేనే మేక్ ఇన్ ఇండియాని స్వాగతించినట్లు అవుతుంది.

- మూలా అప్పారావు