సబ్ ఫీచర్

సంస్కరణలు నిరంతర ఫ్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య సామాజిక ప్రక్రియ. సమాజంలో ప్రతి ఘడియన మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయ. ముఖ్యంగా సాంకేతిక యుగంలో నూతన ఆవిష్కరణలు ఎంతో వేగంగా వస్తున్నాయి. అవి ప్రజలకు అందుబాటులోకి వుండడానికి సాంకేతిక రంగం కూడా దానికన్నా ఎక్కువ వేగంగా వ్యాపించాలి. అప్పుడే అవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. విద్యారంగం ఒక ఎడతెగని ప్రవాహం. ప్రతి దేశంలో కూడా సంస్కరణలు అనేవి నిరంతరం జరిగే ప్రక్రియ. మార్పు రావడానికై ఉపాధ్యాయ వర్గాలు తరగతి గదిని ఎల్లవేళలా సిద్ధంగా ఉంచగలిగితేనే సమాజానికి సాంకేతిక విజ్ఞానం అందే అవకాశం ఉంటుంది.
తరగతి గది ఒక మాధ్యమం మాత్రమే. గత 50 సంవత్సరాల్లో విద్యామార్పు అంటేనే విద్యకు నిధులు కావాలనో, లేదా తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను తక్కువ చేయాలనో లేక పాఠశాలల సంఖ్య పెంచాలనో..అన్నవే సంస్కరణలుగా భావించబడుతూ వచ్చాయి. పైన ఉదహరించిన వాటిలో విద్యలో ప్రధాన పాత్రధారులైన ఉపాధ్యాయులు, పిల్లలు భాగస్వాములు కారు. రాజకీయ సంకల్పమే చర్చనీయాంశం అవుతు వచ్చింది. విద్యారంగంలో సంస్కరణలు అంటే తరగతి గది ప్రక్రియలో మార్పురావాలి. ఆ ప్రక్రియ లోపల ఉపాధ్యాయులు, విద్యార్థులు కీలక బాధ్యత వహించాలి. బోధనలో మార్పు రావాలి. ఉదాహరణకు ఒకనాడు పాఠ్యపుస్తకాలలోని విషయాన్ని పిల్లల నోట్‌బుక్‌లోకి మార్చడమే బోధన అనుకున్నాం. కానీ ఈనాడు విద్యార్థి పాఠ్యపుస్తకంలో వున్న విషయాన్ని మేం ఇంటి దగ్గర చదువుకుని వస్తాం కదా, ఎన్నో మాధ్యమాల ద్వారా పాఠ్యపుస్తకంలో వుండే అంశాన్ని చదువుకుని వస్తాం కాబట్టి ఉపాధ్యాయు డు పాఠం యొక్క విస్తరణ చేస్తే తరగతి గది రసవత్తరంగా ఉంటుంది కదా అంటున్నారు.
తరగతి గది పిల్లలకు ఒక సవాలుగా ఉండాలి అని కొందరు ఆశిస్తారు. అలాంటి వాతావరణానికి కావాల్సిన విద్యా సంస్కరణలు రావాలి. రాజకీయపరమైన సంస్కరణలకు ప్రచారం ఎక్కువ లభిస్తుంది. కానీ తరగతి గదిలో మాత్రం ఆ ప్రయత్నం కొఠారి చేసారు. దానికి ఆ రోజుల్లో సాధనాలు తక్కువగా ఉండేవి. ఈనాడు సాంకేతికమైన పరికరాలు వీడియోలు వచ్చాయి. నెట్‌లు వచ్చాయి. జపాన్ దేశంలో జరుగుతున్న బోధనను జర్మనీవారు చూసి తమ బోధనా పద్ధతులు మార్చుకున్నారు. సాంకేతిక యుగంతో పెట్టుబడిదారీ వ్యవస్థ బాగుపడ్డది కానీ పేదదేశాల్లో వున్న తరగతి గది ఇంకా మారలేదు. సంస్కరణలు తరగతి గది యొక్క మార్పునకు దోహదపడాలి. ఈనాడు నూతన విద్యా విధాన పాలసీలో కొత్త సంస్కరణలకు పూనుకున్నది కాబట్టి స్వాగతం. కానీ అది మాత్రమే సరిపోదు. ఉపాధ్యాయ సంఘాలు వీటిపై సీరియస్‌గా చర్చించాలి. ఉపాధ్యాయులు ఇందులో కీలక పాత్రధారులు కావాలి. అప్పుడే తరగతి గదిలో మార్పు వస్తుంది.
కానీ మార్పు అనేది ఏ ఒక్కరివల్లనో సాధ్యం కాదన్న సంగతి గుర్తెరగాలి. ప్రభుత్వం ఒక విధానాన్ని అందులోని మంచిచెడులను కూలం కషంగా చర్చించి తర్వాతనే రూపొందిస్తుంది. అయతే ఏ విధానం కూడా నూటికి నూరుపాళ్లు సత్ఫలితాలనివ్వదు. అత్యధిక ప్రయోజనాలనిచ్చే విధానం శ్రేయస్కరం. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులు కూర్చొని చర్చించి, విద్యార్థులకు అనుకూలమైన, తెలిగ్గా అర్థం చేసుకునే విధంగా పాఠ్యాం శాల రూపకల్పన జరగాలి. వర్తమాన ప్రపంచంలో అనుసరిస్తున్న ప్రమా ణాలకు అనుగుణ మైన విద్యను బోధించినప్పుడు మాత్రమే మన విద్యా ర్థులు కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడగలరు. దీన్ని గుర్తెరగాలి. అమ ల్లోకి తెచ్చే సంస్కరణలు భావిభారత పౌరులకు అన్ని విధాలుగా ప్రయోనకారిగా ఉండాలి.

- చుక్కా రామయ్య