సంపాదకీయం

తొలగని ‘తోడేలు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనపడని శత్రువుతో ఎలా యుద్ధం చేయాలన్న విషయమై మన ప్రభుత్వం ఇప్పుడైనా గుణపాఠాలు నేర్చుకోవడం జాతిహితకరమైన చర్య కాగలదు! పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ తోడేళ్లు కనబడని శత్రువులు! ఫిబ్రవరి 20వ తేదీనుండి కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలోని సుమపురం-సెంపోరా-పాంపోరా-లో ప్రభుత్వ భవనంలో ఈ కనబడని శత్రువులు మళ్లీ చెలరేగుతున్నారు! సోమవారం కూడ ఈ బీభత్సకాండ కొనసాగుతుండడం ప్రణాళికాబద్ధమైన జిహాదీల దాడికి మరోసాక్ష్యం! ఇలా ప్రణాళికా బద్ధంగా జిహాదీలు దాడులు చేయడానికి కారణం ఈ దుండగులు పాకిస్తాన్ సైన్యంలో శిక్షణను పొందినవారు కావడం! లష్కర్ ఎ తయ్యబా ఉగ్రవాదులకు ఇతర జిహాదీ ముఠాల ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం శిక్షణ ఇస్తోందని ఇటీవల డేవిడ్‌కాలెన్ హెడ్లీ అమెరికాలోని జైలునుండి ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించడం సరికొత్త సాక్ష్యం. హెడ్లీ సాక్ష్యం మరో ధ్రువీకరణ మాత్రమే! మన దేశంలోకి చొరబడుతున్న జిహాదీలను పాకిస్తానీ ప్రభుత్వ బీభత్స విభాగమైన ఐఎస్‌ఐ నడిపిస్తోందన్నది అంతర్జాతీయ సమాజానికి దశాబ్దులకు ముందే తెలిసిన వాస్తవం! పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స వ్యవస్థ అన్నది జగమెరిగిన సత్యం! అందువల్ల జిహాదీలను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులను పట్టుకుని అంతర్జాతీయ నేర విచారణ మండలి-ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ ఎదుట నిలబెట్టడానికి మాత్ర మే మన ప్రభుత్వం కృషి చేయాలి! బీభత్సకారులుగా ధ్రువపడిన దేశాధినేతలను, ప్రభుత్వాధినేతలను ఇంటర్‌పోల్ ద్వారా కాని, ఇతర మాధ్యమాల ద్వారా కాని, పట్టుకొని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిల బెట్టడానికి వీలుంది. ఇందుకు పూర్వరంగంగా పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులు ఉగ్రవాదులను ధ్రువీకరించగల ప్రక్రియను ఐక్యరాజ్యసమితిలోను, అంతర్జాతీయ న్యాయస్థానంలోను మన ప్రభుత్వం చేపట్టవలసి ఉంది! ఈ పని మానేసిన మన ప్రభుత్వం టెర్రరిస్టులు నిర్వహిస్తున్న పాకిస్తాన్‌లో ప్రభుత్వంతో చర్చలు జరపడం, జరపడానికి యత్నించడం జాతీయ వైపరీత్యం! కశ్మీర్‌లో శనివారంనాడు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు చేస్తుండిన సమయంలోనే మరో వార్త వెలువడింది. పంజాబ్‌లోని పఠాన్‌కోటలోని వైమానిక దళం స్థావరంపై జనవరిలో జరిగిన దాడుల గురించి దర్యాప్తు చేయడానికై పాకిస్తాన్ ప్రభుత్వ ప్రత్యేక బృందం మనదేశానికి మార్చిలో వస్తోందన్నది ఆ వార్త.
పఠాన్‌కోటపై దాడి చేసిన జిహాదీలు కూడ పాకిస్తాన్ ప్రభుత్వ శిక్షితులు, పాకిస్తాన్ సైన్యం ఉసికొల్పిన తోడేళ్లు! పఠాన్‌కోటపై దాడి చేయించిన పాకిస్తాన్ ప్రభుత్వం పఠాన్‌కోటకు వచ్చి దర్యాప్తు చేయడం ఏమిటి? నేరం గురించి హంతకుడు దర్యాప్తు జరపడాన్ని మన దేశ ప్రజలు హర్షిస్తారా? కానీ పాకిస్తాన్ ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్-ఇక్కడికి వచ్చి పఠాన్‌కోట వైమానిక దళ కేంద్రంలోకి చొరబడి పరిశోధన జరుపుతుందట! గత నెలలో పాకిస్తానీ పెత్తందారులు చేసిన ఈ ప్రతిపాదనను మన ప్రభుత్వం వెంటనే అంగీకరించింది. ఆతరువాత అలాంటి పాకిస్తానీ దర్యాప్తు బృందాన్ని మన దేశంలోకి అనుమతించే ప్రశ్న లేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. మన దేశ ప్రజలు సంతోషించారు. కానీ పాకిస్తానీ సిట్‌ను అనుమతించడానికే మన ప్రభుత్వం నిశ్చయంచినట్టు మళ్లీ ఇప్పుడు ప్రచారమైంది. ఇలా అనుమతించడం శత్రువునకు మన ఇంటి రహస్యాలను అందచేయడం మాత్రమే కాగలదు! పాకిస్తాన్ ప్రభుత్వం వారు భారత వ్యతిరేక జిహాదీ ఉగ్రవాదులను శిక్షించాలని కోరడం కూడ వాస్తవాలకు అనుగుణంగా లేని చర్య! దర్యాప్తు జరపవలసింది పాకిస్తాన్ ప్రభుత్వం కాదు, పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులకు వ్యతిరేకంగా దర్యాప్తు జరగాలి! శిక్షను అనుభవించవలసిన పాకిస్తాన్ నిర్వాహకులను నాగరికులుగా భావించడం వల్లనే ఉగ్రవాదం మరింతగా విస్తరించి పోతోంది! తమ దేశంపై దాడులను జరిపిస్తున్న దేశాల ప్రభుత్వాలతో మన ప్రభుత్వం వలె చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడైనా ఉందా?
నిరాయుధులైన భారతీయులను హత్య చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కిరాయ హంతకులకు శిక్షణ ఇచ్చి జిహాదీలుగా మార్చి ఉసిగొల్పుతోంది. కాశ్మీరులోయలో హిందువులు మిగిలి ఉన్నంతవరకు ఆ నిరాయుధులను ఇలాంటి పాకిస్తానీ జిహాదీలు హత్య చేశారు. 1991 తర్వాత కశ్మీర్ లోయ ప్రాంతంలో హిందువులు మిగలలేదు. హత్యలకు గురికాగా మిగిలిన హిందువులు లోయ నుండి పారిపోయారు. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ హత్యాకాండను కొనసాగిస్తూనే ఉంది. అయితే హిందువులు లేని ప్రాంతాలలో ఎవరిని హత్య చేయాలి? అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం వ్యూహం మార్చింది. పంజాబ్‌లోను, కశ్మీర్‌లోను, పోలీస్ ఠాణాల మీద సైనిక స్థావరాల మీద ప్రభుత్వ భవనాల మీద దాడులు చేయ డం మొదలైంది. సైనికులను హత్య చేస్తున్నారు. సెంపోరాలో ఎనిమిది వేల చదరపు అడుగుల స్థలం లో కట్టిన ఏడంతస్తుల ప్రభుత్వ భవనాన్ని దుండగులు ఆక్రమించడం ఈ మారిన వ్యూహంలో భాగం! ఈ వ్యూహాన్ని అమలు జరపడానికి మామూలు కిరాయ జిహా దీ హంతకులు చాలరు. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం సైనికులను సైనిక దళాలలో శిక్షణ పొందిన వారిని రంగంలోకి దించింది! నిరాయుధులైన ప్రజలను హత్య చేయడం వలె మన సైనికులను కేంద్ర రిజర్వు పోలీసులను ఇతర అనుబంధ సైనిక దళాలను హత్య చేయడం తేలిక కాదు. ఇందుకు ప్రణాళికా బద్ధమైన దీర్ఘకాల వ్యూహం అవసరం. అందువల్లనే ఒకసైనిక స్థావరంపై దాడి జరగడానికి, మరో సైనిక పటాలంపై దాడి జరగడానికి మధ్య ఎక్కువ సమయం పడుతోంది! పఠాన్‌కోటపై దాడి చేసిన వారు కాని, ఇప్పుడు సుమపురంపై దాడిని కొనసాగిస్తున్న వారు కాని సైనికేతర జిహాదీలు కాదు, పాకిస్తానీ సైనికులు...
అధీన రేఖ వద్ద పాకిస్తాన్ రేంజర్లు మన జవానులను దొంగచాటుగా హత్య చేయడం ఈ ప్రచ్ఛన్న బీభత్సంలో భాగం! ఇప్పుడు జిహాదీల ముసుగుతో సెంపోరా భవనంలో చొరబడి ఉన్న వారు కూడ పాకిస్తాన్ సైనికులేనన్నది అతార్కికం కాజాలదు. మన సైనిక అధికారులు, రక్షణ వ్యవహారాల విశే్లషకులు చెపుతున్న సంగతులు దీన్ని ధ్రువపరిచాయి. మన కెప్టన్‌లు పవన్‌కుమార్, తుషార్ మహాజన్ వంటి యుద్ధవీరులు మరో ముగ్గురు సైనికులు పోలీసులు, ఇద్దరు పౌరులు అమరులయ్యారు. ఇలా మన రక్షకులను పొట్టనపెట్టుకున్న తోడేళ్లను ఉసికొల్పిన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇప్పుడైనా మన ప్రభుత్వం బీభత్స వ్యవస్థ-టెర్రర్ రిజీమ్‌గా ప్రకటించాలి! నిరసనల వల్ల, చర్చల వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం తన ఉగ్ర కలాపాలకు స్వస్తి చెప్పబోదు! ప్రతి దాడిలోను హతులైన జిహాదీలకంటె అమరులైపోతున్న మన రక్షకుల సంఖ్య ఎక్కువ...