వీరాజీయం

తన డాబా మీదనే హెలీప్యాడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదువా?’’ అన్నది పాత సామెత. రాజులు లేరు. మంత్రులున్నారు. వీళ్లే రాజులు వోడిపోయేదాకా- సార్వభౌములున్నూ వారే! అంచేత ముఖ్యమంత్రులు- అందులోకీ హైటెక్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి లాంటి ‘‘స్పీడు మాస్టర్’’ తల్చుకుంటే వెలగపూడి గ్రామం తాత్కాలికంగా అమరావతిగా భాసిల్లదా?
అమరావతి అంటే స్వర్గంలో వుండే అమరావతి జ్ఞాపకం వస్తోందందరికీ. ఇది మాత్రం ఇంద్రుడి హెడ్ క్వార్టర్స్‌కేం తీసిపోతుంది? దీనికోసం దేశాన్ని చుట్టిచుట్టి- మట్టి- ‘సారీ! మృత్తిక’అనాలి- మరియు పవిత్ర జలాలు నాయుడుగారు తెప్పించగా- సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్రమోదీగారు- పార్లమెంటు ప్రాంగణంనుంచి పిడికెడు ‘మృత్తిక’ను ఎంతో పదిలంగా తేలేదా? కానీ సదరు అద్భుత అలౌకిక ఆంధ్రా ప్రజల రా.్ధ.నగరం చైనా, జపాన్, సింగపూర్ వగైరా నిపుణుల కాల్‌షీట్స్ అడ్జెస్ట్‌కాంగానే కదా, కదులుతుంది?
ఈలోగా మొన్న బుధవారం 17న నారావారు ‘‘అందాకా అమరావతి’’గా విరాజిల్లే తాత్కాలిక రాజధాని సచివాలయాది భవనములకు- సుముహూర్త ఘడియలు దాటిపోకుండా- 8 గంటల 23 నిమిషాలకి శంఖుస్థాపన శాస్త్రోక్తంగా చేశాడు. దీంతో ఒక రాజధానీ నిర్మాణ శకం ఆరంభమయింది. ఐతే, అక్కడున్న జనాల గుండెల్లో రాయిపడే వార్త కూడా ఆం.ప్ర.ముఖ్యమంత్రీజీ చెప్పారు. 2019దాకా మన రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ మందం అనగా లావుగా కాదు- మందకొడిగా ‘‘లోటు’’గా కొనసాగుతుందని- యిదంతా రాష్ట్ర విభజన మూలకంగా ఏర్పడ్డ విపత్తేననీ అన్నారు. మొత్తంమీద యావదాంధ్రావనీ (ఐమీన్ కోస్తాంధ్రా ప్లస్ రాయలసీమ)కి. ‘అమ్మయ్య! పీర్లు గుండాన పడ్డాయి- టెంపరరీ క్యాపిటల్ (క్యాపిటల్‌ను కేంద్రం యివ్వాలి) వొకటి- ‘‘అదివో...అల్లదివో వెలగపూడిలో వెలయుచున్నదీ’’అనుకుని ఉద్దేలమయి పోయారు ఆంధ్రులంతా.
-‘‘ఔనండీ! ఔను. వెనుకటికి కర్నూలులో ‘‘డేరాలు’’ వేసుకుని మనం పరిపాలన లాగించుకోలేదా? అటువంటిదె యిప్పుడు నాయుడుగారు ఒక ‘మిరకిల్’ కాంప్లెక్స్ యివ్వబోతున్నాడు. అంటే ఆయన కాడ అల్లాఉద్దీన్ అద్భుత దీపంలాంటిది ఉన్నది అనుకోవద్దు. వజ్ర సంకల్పబలం చాలు కదా! ఆరు లక్షల చదరపుటడుగులు మొత్తం 28 ఎకరాల భూమీద ఆం.ప్ర.రా.్ధ.ని నాలుగుమాసాల వ్యవధిలో కట్టియిచ్చేయకపోతే? అంటూ ఆయన తర్జని చూపెట్టాడు.
ఈ విధంగా బాబూజీ ఆదేశాలందుకున్న ఎల్.అండ్.టి మరియు షాపోంజీపల్లొన్‌జీ కంపెనీలు ‘‘జూన్ 15నాటికి- సి.ఎమ్‌గారి ఛాంబర్స్‌తో సహా వాసయోగ్యంగా నిర్మించేస్తాం’’అన్నారు. తతిమ్మా పార్కులు, రోడ్లు వగైరాలకి కూడా యింకో 17 ఎకరాల జాగా అట్టేపెట్టేరండోయ్! అక్కడ కూడా హెలికాప్టర్ దిగొచ్చును గానీ, కోస్తాంధ్రాలోనే తొలి సూర్యోదయం జరుగుతుంది. కనుక అక్కడికి మన సి.ఎమ్.గారు వెలగపూడి నుంచి ఎగిరి చేరాలి.
హెలికాప్టర్ ఎలాగూ వుంటుంది. దాని దాకా తన ఛాంబర్స్‌నుంచి- లాన్స్, గేట్‌లు, ఫౌంటేన్‌లు వగైరాలు దాటి నడవడానికి టైమ్ వేస్ట్ కాదా? అంచేత తప్పని పరిస్థితులకు తలవొగ్గి- వెలగపూడిలోని తాత్కాలిక అమరావతిలోని ముఖ్యమంత్రిగారి ఆలీషాన్ కార్యాలయం- డాబామీదనే హెలీప్యాడ్ నిర్మించబోతున్నారహో! జేమ్స్‌బాండ్- సిన్మాల మాదిరి సి.ఎమ్.గారి కార్యాలయ డాబామీదకే నేరుగా వచ్చి- హెలికాప్టర్ రెక్కలు తిప్పుకుంటూ దిగుతుంది. ‘సారు’ లిఫ్ట్‌మీదికెక్కి- టెర్రస్ హెలీప్యాడ్ మీదికి క్షణాల్లో వెళ్లిపోతారు అక్కణ్నుంచి అంతరిక్షం నీలంగా, స్నిగ్ధంగా, ఖాళీగా వుంటే- యాభై కిలోమీటర్ల దూరమేగా- ఎయిర్‌పోర్ట్ చేరుకుని ఝామ్మని ఉమ్మడి రాజధానీ నగరానికెళ్తారు (అక్కడికి ఎందుకు?) లేదా, వున్నది కదా- కనకదుర్గమ్మవారి- ‘‘పబ్లిక్ చౌల్ట్రీ’’ బెజవాడ అనబడు విజయవాడకి ఎయిర్‌పోర్ట్‌నుంచి అక్కడికి కారులో చేరుకుంటారు. పిల్లి పిల్లల్నిపెట్టి పదిళ్లు త్రిప్పినట్లు- ఆయన క్యాబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలూ చంకనెత్తుకుని అటూయిటూ తిరగలేక పోతున్నాడు- పాపం!
‘‘ఈసారయినా రుూ ‘‘కల’’నెరవేరాలి- తప్పక అవుతుందీ’’- అనే- ఆంధ్రప్రదేశ్ రీజియన్ డెవలప్‌మెంట్ అథార్టీ కమిషనర్‌గారు- మైక్ ని ఉఫ్.... ఉఫ్‌మని ఊది, టెస్ట్‌చేసి మరీ చెప్పాడు. మొత్తం ఆరు బ్లాకులు- (ఇంగ్లీష్‌లో బ్లాక్’’అనాలి కానీ, అలా రాస్తే మనం ‘‘బ్లాక్’’అయిపోమా?)లుంటాయి అన్నాడు కమిషనర్ సారు. అందులో ఒకటి ముఖ్యమంత్రిగారికి కేటాయించేశారు. ఆ పని అయిపోయింది. ఇక దాని నెత్తిమీద రెండువేల చదరపు అడుగుల (ఇంతేనా?) వైశాల్యంగల హెలిప్యాడ్‌ని నిర్మిస్తారు. ఇదికూడా కాంట్రాక్టులో పెట్టే నిర్మాణకర్తలకి అప్పజెప్పారు. దీన్ని బిల్డింగ్‌తోపాటు ‘ఫ్రీ’గా యిస్తారుట! దీనికయే ఖర్చు అంతా, అంటే ఎంతలెండి- ఒక కోటి రూప్యములు మాత్రమే షాపుర్‌జీ పల్లొంజీలు భరిస్తారుట!
లోగడ నాయుడుగారు హైదరాబాద్‌లో- (ఉమ్మడి రాష్ట్రానికన్నమాట) సి.ఎమ్.గా వుండగా- జుబిలీ హిల్స్‌లోని తన నివాసగృహం (్భవంతి)నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోవున్న సచివాలయానికి ‘‘ఇలా’ ‘రెక్కల రథం’లో వద్దామని కలలుకన్నారు గానీ, ప్చ్! ప్రాప్తం లేకపోయింది.
ఇప్పుడు ఆరునూరైనా- నూరుఆరైనా- (నూరు ఆరవదు..సరే) రుూ హైటెక్ ఛాంబర్ ‘సార్’కి ఓహోమని దొరికిపోతుంది. ఈయనగారికి ఉమ్మడి రాజధానికి రుూమధ్య పోబుద్ధి పుట్టడం లేదల్లే వుంది’’అంటున్నదో వెలగపూడి పడుచు-
అయ్యా! అదండీ సంగతి...
హి మే బి ది ఫస్ట్ సి.ఎమ్. విత్ హెలీప్యాడ్!!