సబ్ ఫీచర్

పల్లెలను అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వారు దేశంలో నూరు పట్టణాలను దశలవారీగా స్మార్ట్‌గా తీర్చిదిద్దుతామంటూ ప్రకటించారు. అయతే తొలివిడతగా వారి కొలమానాలను అనుసరించి కొన్ని పట్టణాల పేర్లను పేర్కొన్నారు. అందులో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పట్టణాలను పేర్కొని మొదటినుంచీ వూరిస్తూ వచ్చిన వరంగల్‌ను వదిలేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పట్టణానికీ ఆ భా గ్యం కలిగించలేదు.
కేంద్ర ప్రభుత్వం చెబుతున్న స్మార్ట్ సిటీల్లో ఉండే సౌకర్యాలు మాత్రం కళ్లు మిరుమిట్లు గొలుపుతూ అటువంటి నగరాల్లో జీవించడమే మహాభాగ్యమనిపిస్తున్నాయ. స్మార్ట్ సిటీల్లోని వీధులన్నీ నాలుగు వరుసలలో రాకపోకలు సాగించే విధంగా ఉంటాయట. ఇంకా పెద్ద పెద్ద పార్కులు ఆకాశ హార్మ్యాలు, ఫ్లై ఓవర్లు, భూగర్భ రహదారులు, మెట్రోలు, పెద్ద పెద్ద మాల్స్ ఇలా ఏమి ఉంటాయో చెప్పి వూరిస్తున్నారు. ఇంకా రోజులో ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా సరఫరా చేస్తామని, విస్తారంగా నీటి సరఫరా చేస్తామని, పైపుల ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తామని లావణ్య నగరాల గురించి చెబుతున్నారు.
అంతవరకు బాగానే ఉంది కానీ, వీటి అభివృద్ధి మాత్రం విదేశీ కంపెనీలకు అప్పగిస్తారట. నాలుగైదేళ్ల పాటు వారు వీటిని నిర్మించి తమ దోవన తాము వెళ్లిపోతే వీటి నిర్వహణ బాధ్యతను ఎవరు చేపట్టాలి? ఏ విషయంలోనైనా మన నిర్వహణా వైఫల్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక స్మార్ట్ సిటీల నిర్మాణానికి, అందులో ఉపయోగించే వస్తు సముదాయానికి ఆయా కంపెనీల వారు భారీగానే గుంజుతారు కదా. అందువల్ల ఈ నిధులు ఎక్కడినుంచి ప్రభుత్వం చెల్లిస్తుంది? ప్రజలనుంచి అధిక పన్నులు వసూలు చేయడం ద్వారా మాత్రమే. అంటే వీటి భారం మళ్లీ ప్రజలమీదనే.
అసలు మన పట్టణాలను మనమే అభివృద్ధి చేసుకోలేమా? మన ప్రజల్లో ఆ సమర్ధత లేదా? అన్ని రంగాల్లో విదేశాలపై ఆధారపడటం కన్నా దౌర్భాగ్యమేముంటుంది? కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలనుంచి అప్పు తెచ్చి స్మార్ట్ సిటీల నిర్మాణం చేపడతామని కేంద్రం చెబుతుంటే అభిమానమున్న ముఖ్యమంత్రులు, పౌరులు మాకవసరం లేదని చెప్పకుండా వౌనం పాటించడమేంటి? మనకున్న వనరులతో, మన సంప్రదాయ పద్ధతులలో మన వాస్తుశాస్త్ర పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం తో దశలవారీగా మనమే నగరాలను వృద్ధి చేసుకోవచ్చు కదా. ఆవిధంగా చేస్తే ఎంతో గౌరవ ప్రదంగా ఉంటుంది.
సౌకర్యాలు కల్పించాలన్నా ప్రకృతి సహకరించాలి. ఎందుకంటే అన్నీ డబ్బుతోనే కొనలేం. మరి ప్రకృతిని రక్షిస్తేనే అది మనకు సహకరిస్తుంది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మ గనుక, కొన్ని పల్లెలను ఒక గ్రూపు చేసి వాటిల్లో అన్ని కనీస సదుపాయాలు కల్పిస్తే ఎంతో సముచితంగా ఉంటుంది. పల్లెల్లో విద్య, వైద్య తదితర అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వస్తే పట్టణాలకు వలస కూడా తగ్గుతుంది. ఇప్పటి వరకు పల్లెసీమలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయ. పట్టణాలలో అన్ని రకాల సదుపాయాలు ఉండటంతో, పల్లెలనుంచి ఉపాధికోసం పట్టణాలకు వలసలు విపరీతంగా పెరిగిపోయాయ. పట్టణ వాసులకు పాలు, ఆహార పదార్ధాలు, ఇతర నిత్యావసరాలు పల్లెలనుంచే సరఫరా కావాల్సి ఉంది. అతృవృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులు పల్లెల్లో జీవనోపాధిని దెబ్బతీస్తు న్నాయ. ఇదిలావుండగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సింగపూర్ మాదిరిగా అభివృద్ధి పరుస్తామంటున్నారు. ఇతరులను చూసి కాపీ కొట్టడం ఎందుకు? మన సృజనాత్మకతతో సరికొత్త నమూనాను సృష్టించ వచ్చుకదా.

- కౌస్త్భు